Bigg BossJust EntertainmentLatest News

Suman Shetty: కన్నింగ్ లేని మంచితనం-సుమన్ శెట్టి ఎలిమినేషన్..14 వారాలకు రెమ్యునరేషన్ ఎంతంటే..

Suman Shetty:సుమన్ శెట్టి ఒక పాపులర్ కమెడియన్ కాబట్టి, ఆయనకు రెమ్యూనరేషన్ కూడా ఆయన స్థాయికి తగ్గట్టే ఇచ్చినట్టు తెలుస్తోంది.

Suman Shetty

బిగ్ బాస్ సీజన్ 9 (Bigg Boss 9 Telugu) హౌస్‌లో సుమారు 14 వారాల పాటు కొనసాగిన కంటెస్టెంట్ సుమన్ శెట్టి(Suman Shetty) ఈరోజు ఎలిమినేట్ అయ్యారు. హౌస్‌లో ఉన్న మిగిలిన కంటెస్టెంట్‌లతో పోలిస్తే, సుమన్ శెట్టి ఆట తీరు చాలా తక్కువ స్థాయిలో ఉందని, కేవలం 5 వారాలు మాత్రమే కొనసాగే రేంజ్ ఉందని ఆడియన్స్ అనుకున్నారు.

మొదటి వారం లో ఎలిమినేట్ అయిన శ్రేష్టి వర్మ కూడా సుమన్ శెట్టి (Suman Shetty)కంటే బెటర్ కంటెస్టెంట్ అని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే, సుమన్ శెట్టి ఇన్ని రోజులు హౌస్‌లో కొనసాగడానికి ముఖ్య కారణం ఆయనలోని మంచితనం, అమాయకత్వం. మిగిలిన కంటెస్టెంట్‌ల లాగా కన్నింగ్ ఆలోచనలు లేని మనిషి కాబట్టే, ఆడియన్స్ అతనికి ఓట్లు వేస్తూ వచ్చారు.

అంతే కాకుండా, ఇమ్మానుయేల్ సుమారు 11 వారాలు నామినేషన్స్ లో లేకపోవడం కూడా సుమన్ శెట్టికి బాగా కలిసొచ్చింది. ఇమ్మానుయేల్‌కి పడాల్సిన ఓటింగ్ అత్యధిక శాతం సుమన్ శెట్టికే పడుతూ వచ్చింది.

Suman Shetty
Suman Shetty

గత వారమే సుమన్ శెట్టి ఎలిమినేట్ అవ్వాల్సి ఉండగా, సడన్ గా ప్లాన్ మార్చి రీతూ చౌదరిని ఎలిమినేట్ చేశారు. టాప్ 5 లోకి ఎంట్రీ ఇవ్వడానికి అన్ని విధాలుగా అర్హతలు ఉన్న రీతూ చౌదరిని కాదని, సుమన్ శెట్టిని హౌస్‌లో ఎలా కొనసాగిస్తారని సోషల్ మీడియాలో (Social Media) నెటిజన్స్ పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈరోజు శనివారం టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్ లో సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యారు

సుమన్ శెట్టి (Suman Shetty)ఎలిమినేట్ అయిన తర్వాత, ఆదివారం టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్ లో భరణి లేదా సంజన లలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉంది.

సుమన్ శెట్టి ఒక పాపులర్ కమెడియన్ కాబట్టి, ఆయనకు రెమ్యూనరేషన్ కూడా ఆయన స్థాయికి తగ్గట్టే ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆయన రోజుకి 45 వేల రూపాయల రెమ్యూనరేషన్ ఆఫర్‌తో హౌస్‌లోకి వచ్చారు. సుమన్ శెట్టి మొత్తం 14 వారాలు హౌస్‌లో కొనసాగారు కాబట్టి, ఆయన 44 లక్షల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ అందుకోబోతున్నట్టు తెలుస్తోంది. యాంకర్ రవి తర్వాత బిగ్ బాస్ హిస్టరీలో ఆ రేంజ్ రెమ్యూనరేషన్ అందుకున్న ఏకైక కంటెస్టెంట్ సుమన్ శెట్టి మాత్రమేనని చెబుతున్నారు. హౌస్‌లో ఆడుతూ పాడుతూ 14 వారాలు లాకొచ్చాడంటే చిన్న విషయం కాదు, అదృష్టం ఆ రేంజ్‌లో ఉందని చెప్పాలి.

మరిన్ని బిగ్ బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button