chicken : మీరు రోజూ చికెన్ తినే బ్యాచేనా? అయితే అర్జంటుగా ఆపేయండి
chicken : ఎంత ఇష్టమైనా, ఆరోగ్యకరమైన ఆహారమైనా దాన్ని అతిగా తీసుకుంటే అది విషంతో సమానం అంటున్నారు నిపుణులు.

chicken
కొంతమందికి చికెన్(chicken) లేకుండా రోజు గడవదు. మటన్, ఫిష్‌తో పోలిస్తే చికెన్‌లో కొవ్వు తక్కువ, ప్రోటీన్లు ఎక్కువ, పైగా ధర కూడా తక్కువ. అందుకే ఇది చాలామందికి డైలీ మెనూలో ఒక భాగమైపోయింది. అయితే, ఎంత ఇష్టమైనా, ఆరోగ్యకరమైన ఆహారమైనా దాన్ని అతిగా తీసుకుంటే అది విషంతో సమానం అంటున్నారు నిపుణులు. రోజూ చికెన్ తినే అలవాటు ఉన్నవారు ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వారానికి రెండు లేదా మూడు సార్లు మించి చికెన్ తినడం ఆరోగ్యానికి హానికరం అని స్పష్టం చేస్తున్నారు.
అతిగా చికెన్ తినడం వల్ల కలిగే ప్రమాదాలలో ముందుగా.. కోళ్లను త్వరగా పెంచడానికి, బరువు పెంచడానికి పెద్ద మొత్తంలో యాంటీబయాటిక్స్ ఇస్తారు. ఈ యాంటీబయాటిక్స్ చికెన్ ద్వారా మన శరీరంలోకి ప్రవేశించి, మనలో ఉండే మంచి బ్యాక్టీరియాను దెబ్బతీస్తాయి. దీనివల్ల మన శరీరం యాంటీబయాటిక్స్‌కు నిరోధక శక్తిని కోల్పోతుంది. అంటే, భవిష్యత్తులో మనం అనారోగ్యానికి గురైనప్పుడు ఏ మందులు పనిచేయవు. ఇది చాలా పెద్ద ప్రమాదం.
సాల్మొనెల్లా బ్యాక్టీరియా ముప్పు ఉంటుంది. పచ్చి చికెన్‌లో సాల్మొనెల్లా వంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియాలు ఉంటాయి. వీటి వల్ల కడుపు నొప్పి, వాంతులు, డయేరియా వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ బ్యాక్టీరియాను పూర్తిగా తొలగించాలంటే చికెన్‌ను కనీసం 165°F (74°C) ఉష్ణోగ్రత వద్ద బాగా ఉడికించడం అవసరం. అపరిశుభ్రమైన చోట కొన్న చికెన్ మరింత ప్రమాదకరం.
మన శరీరానికి రోజూ అవసరమయ్యే ప్రోటీన్ పరిమాణం పరిమితంగా ఉంటుంది. ఇది సాధారణంగా మొత్తం ఆహారంలో 35 శాతంకు మించకూడదు. అంటే, రోజుకు సుమారు 50 గ్రాముల చికెన్ మాత్రమే తీసుకోవడం మంచిది. అంతకు మించి తీసుకుంటే, అదనపు ప్రోటీన్‌ను శరీరం కొవ్వుగా (Fat) మార్చి నిల్వ చేస్తుంది. దీనివల్ల ఊబకాయం, రక్తంలో కొవ్వు శాతం పెరగడం వంటి సమస్యలు వస్తాయి.
అధికంగా చికెన్(chicken) తినడం వల్ల రక్తనాళాల్లో కొవ్వు నిల్వలు పెరిగి, గుండె సంబంధిత వ్యాధులు, హార్ట్ ఎటాక్ వంటి ప్రమాదాలు పెరుగుతాయి. మాంసంలో ఉండే శాచురేటెడ్ ఫ్యాట్ దీనికి ప్రధాన కారణం.

మనం తక్కువ పరిమాణంలో చికెన్ తిన్నప్పుడు, దాన్ని జీర్ణం చేయడానికి ఎక్కువ శక్తి ఖర్చవుతుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కానీ, అధికంగా తిన్నప్పుడు, శరీరం దాన్ని ఫ్యాట్‌గా మార్చి నిల్వ చేస్తుంది. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది.
ప్రోటీన్ కోసం కేవలం చికెన్‌పైనే ఆధారపడటం కంటే, ఇతర ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం మంచిది. గుడ్లు, పప్పులు, పనీర్, సోయా, గింజలు, చిక్కుళ్లు, చేపలు వంటివి శరీరానికి అవసరమైన ప్రోటీన్‌ను అందిస్తాయి. ఈ ఆహారాలను సమతుల్యంగా తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలను నివారించి, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపొచ్చు.
One Comment