Hair :జుట్టు సమస్యలా? ఈ చిట్కాలు పాటిస్తే చాలు
Hair : సమస్యలన్నింటికీ చెక్ పెట్టి, మీ జుట్టును ఆరోగ్యంగా మార్చుకోవడానికి కొన్ని సులభమైన ఇంటి చిట్కాలను ఇప్పుడు చూద్దాం.

Hair
ఈ రోజుల్లో హెయిర్ (Hair)ఫాల్, చిన్న వయసులోనే తెల్లజుట్టు, చుండ్రు లాంటి సమస్యలు చాలా సాధారణమైపోయాయి. కాలుష్యం, ఒత్తిడి, సరిగా లేని ఆహారపు అలవాట్లు, సరైన నిద్ర లేకపోవడం వంటివి దీనికి ప్రధాన కారణాలు. ఒకప్పుడు మహిళలకు ఉండే పొడవాటి, ఒత్తైన జుట్టు ఇప్పుడు కనిపించడం చాలా అరుదుగా మారింది. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టి, మీ జుట్టును ఆరోగ్యంగా మార్చుకోవడానికి కొన్ని సులభమైన ఇంటి చిట్కాలను ఇప్పుడు చూద్దాం.
మీ జుట్టు (Hair)ఒత్తుగా, పొడవుగా పెరగాలంటే ఈ చిట్కా పాటించండి. ముందుగా అలోవెరా జెల్‌ను తీసుకుని తలకు, జుట్టు కుదుళ్లకు బాగా పట్టించాలి. ఒక ఐదు నిమిషాల పాటు సున్నితంగా మర్దనా చేయాలి. ఇది జుట్టుకు పోషణనిస్తుంది. ఆ తర్వాత, మరో గిన్నెలో ఒక విటమిన్-ఈ క్యాప్సూల్‌లోని నూనెను తీసుకోవాలి. అందులో ఒక స్పూన్ ఆముదం, రెండు స్పూన్ల కొబ్బరి నూనె కలిపి బాగా మిక్స్ చేయాలి.
ఈ మిశ్రమాన్ని కొద్దిగా వేడి చేసి, గోరువెచ్చగా ఉన్నప్పుడు తలకు పట్టించి ఐదు నిమిషాలు మర్దనా చేయాలి. ఒక గంటసేపు ఈ ప్యాక్‌ను అలాగే ఉంచి, గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే జుట్టు మృదువుగా, ఒత్తుగా, ఆరోగ్యంగా పెరుగుతుంది.

చుండ్రు సమస్యతో బాధపడేవారికి ఇది ఒక మంచి పరిష్కారం. ఒక స్పూన్ మెంతి పొడి, ఒక స్పూన్ కుంకుడుకాయ పొడి, ఒక స్పూన్ పుల్లటి పెరుగును ఒక గిన్నెలో బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని గంటసేపు నానబెట్టాలి. తర్వాత దీన్ని తలకు హెయిర్ ప్యాక్‌లా వేసి, 45 నిమిషాలు ఉంచాలి. అనంతరం గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఈ ప్యాక్ షాంపూల కంటే మెరుగైన ఫలితాలను ఇచ్చి, తలలోని చుండ్రును పూర్తిగా తొలగిస్తుంది.
చిన్న వయసులోనే తెల్లజుట్టు సమస్యతో ఇబ్బంది పడుతున్న వారికి ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది. ముందుగా, నాలుగు స్పూన్ల ఉసిరి పొడి, నాలుగు స్పూన్ల కుంకుడుకాయ పొడి లేదా శీకాయ పొడిని తీసుకుని రాత్రంతా నీటిలో నానబెట్టాలి.
ఉదయం ఈ పేస్ట్‌లో నాలుగు స్పూన్ల గోరింటాకు పొడిని కలిపి, ఆ మిశ్రమాన్ని గంటసేపు నానబెట్టాలి. తర్వాత ఈ పేస్ట్‌ను జుట్టు(Hair)కు పూర్తిగా పట్టించాలి. ఒక గంటసేపు ఉంచి సాధారణ నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే, తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుతుంది.
ఈ చిట్కాలు పాటిస్తూనే, సరైన ఆహారం తీసుకోవడం, ఒత్తిడి తగ్గించుకోవడం, తగినంత నిద్ర పోవడం కూడా జుట్టు ఆరోగ్యానికి చాలా అవసరం.
Also Read: Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ దర్శన టికెట్లు, గదుల బుకింగ్ తేదీలు ఇవే