Quantum Healer : అంతుచిక్కని నొప్పికి క్వాంటం హీలర్‌తో ఎలా చెక్ పెడతారు?
Quantum Healer: క్వాంటం హీలింగ్ సిద్ధాంతంలో, దీర్ఘకాలిక నొప్పి అనేది తరచుగా .. గత అనుభవాలు, ఒత్తిడి , భయం వల్ల మెదడు నొప్పి సంకేతాలను అతిగా (Overdrive) పంపడం. నొప్పి లేకపోయినా, నొప్పిని అనుభవించేలా చేయడం కనిపిస్తాయి.

Quantum Healer
దీర్ఘకాలికంగా బాధిస్తున్న, అంతుచిక్కని శారీరక నొప్పి (Chronic Pain) కి మూల కారణం కేవలం గాయం కాదని, అది మనస్సు-శరీర అనుసంధానం (Mind-Body Connection) లోపంలో దాగి ఉందని అంటున్నారు నిపుణులు. ఈ చికిత్సా విధానంలో ప్రాచీన జ్ఞానం, ఆధునిక క్వాంటం సూత్రాలను ఎలా ఉపయోగిస్తారో వివరిస్తున్నారు.
సంప్రదాయ వైద్యంలో, నొప్పి అనేది గాయం వల్ల ఏర్పడుతుంది. కానీ క్వాంటం హీలింగ్(Quantum Healer) సిద్ధాంతంలో, దీర్ఘకాలిక నొప్పి అనేది తరచుగా .. గత అనుభవాలు, ఒత్తిడి , భయం వల్ల మెదడు నొప్పి సంకేతాలను అతిగా (Overdrive) పంపడం. నొప్పి లేకపోయినా, నొప్పిని అనుభవించేలా చేయడం కనిపిస్తాయి.
అందుకే రోగికి చికిత్సపై ఉండే నమ్మకం శారీరక స్వస్థతను ఎలా ప్రభావితం చేస్తుందో, అలాగే, క్వాంటం హీలర్ విధానాలు మనస్సు శక్తిని ఉపయోగించి నొప్పిని తగ్గించడానికి ప్రయత్నిస్తాయి.

క్వాంటం హీలింగ్(Quantum Healer) పద్ధతులలో నొప్పిని మెదడు స్థాయిలో పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది.
మైండ్‌ఫుల్‌నెస్, ధ్యానం (Meditation).. స్థిరమైన ధ్యానం ద్వారా, నొప్పి సంకేతాలపై మెదడు యొక్క ప్రతిస్పందనను మార్చడం. నొప్పిని భయంతో కాకుండా ప్రశాంతంగా గమనించే శక్తిని పెంపొందించడం.
శ్వాస నియంత్రణ (Breath Control).. లోతైన, నెమ్మదైన శ్వాస వ్యాయామాలు పారాసింపథెటిక్ నరాల వ్యవస్థ (PNS) ను ఉత్తేజపరుస్తాయి. ఇది శరీరాన్ని ‘విశ్రాంతి ,జీర్ణక్రియ’ స్థితికి (Rest and Digest) తెస్తుంది, దీని ద్వారా ఒత్తిడి తగ్గి, కండరాల బిగుతు సడలుతుంది.
ప్రాచీన తాత్వికత.. ‘ఆత్మ’ , ‘శరీరం’ వేర్వేరు కాదని, అవి ఒకదానిపై మరొకటి ప్రభావాన్ని చూపుతాయని భావించే హిందూ తత్వంలోని ‘మైండ్-బాడీ’ సిద్ధాంతాలను ఈ చికిత్సలు ఆధారం చేసుకుంటాయి.
దీర్ఘకాలిక నొప్పి చికిత్సలో, రోగి యొక్క నమ్మకం, మానసిక ప్రశాంతత , జీవనశైలి మార్పులు కీలక పాత్ర పోషిస్తాయని ఈ ‘క్వాంటం హీలింగ్(Quantum Healer)’ విధానం తెలియజేస్తుంది.