Microbiome: డిప్రెషన్‌కు మూలం మెదడా? పేగులా? మైక్రోబయోమ్ డిటెక్టివ్ పరిశోధన ఏం చెబుతుంది?
Microbiome: వెల్లుల్లి, అరటిపండు, ఉల్లిపాయలు వంటి పీచు పదార్థాలు (Fibre) అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటే..ఇవి పేగుల్లోని మంచి బ్యాక్టీరియాకు ఆహారంగా పనిచేస్తాయి.

Microbiome
శారీరక ఆరోగ్యం కంటే ఎక్కువగా, మానసిక ఆరోగ్యం (Mental Health) , తీవ్ర ఆందోళన (Anxiety) లకు పేగుల్లోని సూక్ష్మజీవులు (Gut Microbiome) కారణమవుతాయని అంటున్నారు నిపుణులు. దీనిలో ‘గట్-బ్రెయిన్ యాక్సిస్’ (పేగు-మెదడు అనుసంధానం) పాత్ర కూడా ఉందని చెబుతున్నారు.
మన పేగుల్లో నివసించే ట్రిలియన్ల సూక్ష్మజీవుల సమూహమే మైక్రోబయోమ్. ఈ మైక్రోబయోమ్ నేరుగా వేగస్ నరం (Vagus Nerve) ద్వారా మెదడుతో సంభాషిస్తుంది. దీనిని ‘గట్-బ్రెయిన్ యాక్సిస్’ అంటారు.
ఆరోగ్యకరమైన మైక్రోబయోమ్(Microbiome), సెరోటోనిన్ (సంతోషాన్నిచ్చే హార్మోన్, 90% పేగుల్లో ఉత్పత్తి అవుతుంది) వంటి న్యూరోట్రాన్స్‌మిటర్లను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. మైక్రోబయోమ్ సమతుల్యత దెబ్బతిన్నప్పుడు, ఆందోళన , డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు పెరుగుతాయి.
సాధారణంగా మానసిక సమస్యలకు చికిత్స తీసుకుంటున్నా కూడా.. ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోవడం వల్ల పేగుల్లోని చెడు బ్యాక్టీరియా పెరిగి, మెదడులో మంటను (Inflammation) పెంచుతుంది.

మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ‘మైక్రోబయోమ్ డిటెక్టివ్’ వ్యూహాలను అనుసరించాలి..
ప్రోబయోటిక్స్ (Probiotics).. పెరుగు, కిమ్చి వంటి పులియబెట్టిన ఆహారాలు లేదా సప్లిమెంట్ల ద్వారా మంచి బ్యాక్టీరియాను పేగుల్లోకి పంపడం చేయాలి.
ప్రీబయోటిక్స్ (Prebiotics).. వెల్లుల్లి, అరటిపండు, ఉల్లిపాయలు వంటి పీచు పదార్థాలు (Fibre) అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటే..ఇవి పేగుల్లోని మంచి బ్యాక్టీరియాకు ఆహారంగా పనిచేస్తాయి.
సమతుల్య ఆహారం.. ప్రాసెస్ చేసిన ఆహారం, చక్కెర , అనారోగ్యకరమైన కొవ్వులను తగ్గించడం ద్వారా పేగుల్లోని చెడు బ్యాక్టీరియా వృద్ధిని నివారించవచ్చు.
ఆహారపు అలవాట్లలో చిన్న మార్పులు చేయడం ద్వారా ఆందోళన , డిప్రెషన్ వంటి తీవ్రమైన మానసిక సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించవచ్చని ఈ పరిశోధనలు సూచిస్తున్నాయి.
2 Comments