HealthJust LifestyleLatest News

Water: నీళ్లు తాగడానికీ ఒక సమయం ఉందట.. ఇది నిపుణుల మాట

Water: నీళ్లు కొన్ని సమయాల్లో తప్పనిసరిగా తాగడం వలన శరీరం మరింత ఆరోగ్యంగా ఉంటుంది.

Water

మంచినీటి(Water) ప్రయోజనాలు అందరికీ తెలిసినవే, కానీ నీళ్లు ఏ టైంలో ఎంత పరిమాణంలో తాగాలనేది చాలా కీలకం. ప్రముఖ న్యూట్రిషనిస్టులు చెబుతున్నట్లుగా, నీళ్లు కొన్ని సమయాల్లో తప్పనిసరిగా తాగడం వలన శరీరం మరింత ఆరోగ్యంగా ఉంటుంది. సరైన సమయంలో నీరు తాగడం వలన జీవక్రియలు (Metabolism) మెరుగవుతాయి, శరీరం నుంచి వ్యర్థాలు సమర్థవంతంగా తొలగిపోతాయి.

ఉదయాన్నే ఒక్క గ్లాసు వాటర్..ఉదయం నిద్ర లేవగానే కనీసం ఒక్క గ్లాసు మంచినీళ్లు తాగడం ఎంతో మంచిది. దీనివల్ల నిద్రలో మందగించిన జీవక్రియల్లో వేగం పెరిగి, శరీరం యాక్టివ్‌గా మారుతుంది. ఇది మార్నింగ్ సిక్‌నెస్‌ను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. వీలైతే, ఉదయాన్నే లీటర్‌కు తక్కువ కాకుండా వాటర్ తాగడం అలవాటు చేసుకోవడం వలన శరీరంలోని వ్యర్థాలన్నీ సమర్థవంతంగా తొలగిపోతాయి.

Water
Water

తిన్న తర్వాత అరగంట గ్యాప్..ఆహారం తీసుకునే ముందు లేదా ఆహారం తీసుకుంటున్నప్పుడు ఎక్కువగా నీరు తాగకూడదు. కొంతమంది ప్రతి ముద్దకు కొన్ని మంచినీళ్లు తాగుతుంటారు. ఇలా చేయడం వలన కడుపులోని జీర్ణరసం (Digestive Juices) పలచబడి, ఆహారం జీర్ణం కావడానికి పట్టే సమయం పెరుగుతుంది. దీనివల్ల ఆహారంలోని పోషకాల శోషణ సామర్థ్యం (Nutrient Absorption) తగ్గిపోతుంది. అందుకే, తిన్న తర్వాత కనీసం అరగంట నుంచి గంట వరకు నీళ్లు తాగకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని హెల్త్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button