Relationships: రిలేషన్‌షిప్ స్ట్రెస్, హార్ట్‌కు డ్యామేజ్.. సైలెంట్‌గా పెరుగుతున్న ఈ ప్రమాదానికి చెక్ పెట్టండి
Relationships: మంచి మాటలు లేకపోవడం, ఒకరిని ఒకరు తప్పుగా అర్థం చేసుకోవడం, నిన్నటి గొడవను నేటితో ముడిపెట్టడం..ఇవన్నీ కలిసి హార్ట్ బీట్‌పై డైరక్టుగా ఎఫెక్ట్ చూపిస్తాయి.
Relationships
ప్రస్తుతం ఉన్న ఫాస్ట్ లైఫ్‌లో సంబంధాలు (Relationships) బయటికి బాగానే కనిపించినా, లోపల మాత్రం ఒత్తిడి (Stress) నిండిపోయి ఉంటుంది. భాగస్వామి (Partner) అంచనాలు, వర్క్ ప్రెజర్, ఇంటి బాధ్యతలు, ఇద్దరూ మాట్లాడుకోవడానికి టైమ్ లేకపోవడం… ఇలా రోజూ మనసుపై పడే ఈ చిన్న చిన్న స్ట్రెస్‌లు నెమ్మదిగా హార్ట్‌పైన (Heart) కూడా బరువును పెంచేస్తాయి.
ముఖ్యంగా, ప్రేమ ఉన్న చోటే మనసు ఎక్కువగా బాధపడుతుంది. మంచి మాటలు లేకపోవడం, ఒకరిని ఒకరు తప్పుగా అర్థం చేసుకోవడం, నిన్నటి గొడవను నేటితో ముడిపెట్టడం..ఇవన్నీ కలిసి హార్ట్ బీట్‌పై డైరక్టుగా ఎఫెక్ట్ చూపిస్తాయి.

స్ట్రెస్ (Stress) ఎక్కువైందంటే మొదట వచ్చే మార్పులు చాలా సైలెంట్‌గా ఉంటాయి. ఆకస్మిక అలసట (Sudden Fatigue), రాత్రిళ్లు నిద్ర సరిగా లేకపోవడం (Sleep Issues), గుండె కొట్టుకోవడం ఒక్కసారిగా వేగంగా పెరగడం (Fast Heart Beat), ఛాతీ వద్ద చిన్న నొప్పులు రావడం ఇవన్నీ ప్రారంభంలో గందరగోళంగా మొదలవుతాయి.
చాలామంది వీటిని “సాధారణ అలసట” అని కొట్టిపారేస్తారు. కానీ ఇలాంటి లక్షణాలు రోజూ పెరుగుతుంటే, హార్ట్‌లో బ్లడ్ ప్రెషర్ (Blood Pressure) పెరుగుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ దెబ్బతింటుంది. ఇది హార్ట్ ఫంక్షన్ (Heart Function) మీద తీవ్రమైన ఒత్తిడిని పెడుతుంది. దీన్ని గుర్తించకుండా ఉండిపోతే, భవిష్యత్తులో హార్ట్ అటాక్ (Heart Attack) రిస్క్ కూడా పెరుగుతుంది.
అసలు సమస్య ఎక్కడంటే, మనసులో ఉన్న మాట గొంతులోకి రాదు. రాని ఆ మాట హార్ట్ మీద బరువుగా పడిపోతుంది. అందుకే రిలేషన్‌లో ఉన్న ఇద్దరూ మాట్లాడుకోవడం, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.
రాత్రికి పడుకునే ముందు సైలెంట్‌గా కూర్చుని రెండు నిమిషాలు మనసును రిలాక్స్ చేసుకోవడం, చిన్న వాకింగ్‌కు వెళ్లడం, మాట్లాడుకుంటూ సమస్యలను క్లియర్ చేసుకోవడం..ఇవన్నీ హార్ట్‌కు ప్రొటెక్షన్ (Protection) లాంటివి. ప్రేమ ఉన్న చోట హార్ట్ హెల్త్‌ను కూడా కాపాడుకోవాలి, అది పోతే ఏ సంబంధం(Relationships) కూడా స్థిరంగా (Stable) ఉండదు.



