HealthJust LifestyleLatest News

Workout: వర్కౌట్ తరువాత ఏం తినాలి? ఫిట్‌నెస్ కోసం పక్కా డైట్..!

Workout: కేవలం వ్యాయామం చేయడం మాత్రమే కాదు, దాని తర్వాత సరైన ఆహారం తీసుకోవడం కూడా అంతే ముఖ్యం.

Workout

ఫిట్‌నెస్ అంటే వ్యాయామం, సరైన ఆహారం రెండూ కలిస్తేనే. చాలామంది వర్కౌట్ చేసిన తర్వాత ఏం తినాలో తెలియక తప్పులు చేస్తుంటారు. మరి వ్యాయామం(Workout) తర్వాత కండరాలకు శక్తిని, పోషకాలను అందించేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.

ఆరోగ్యం, ఫిట్‌నెస్(Workout) పట్ల శ్రద్ధ ఉన్నవారు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తారు. అయితే, కేవలం వ్యాయామం చేయడం మాత్రమే కాదు, దాని తర్వాత సరైన ఆహారం తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. వర్కౌట్ చేయడం వల్ల శరీరం కోల్పోయిన శక్తిని తిరిగి పొందడానికి, కండరాల రిపేర్ కోసం నిపుణులు కొన్ని ఆహారాలను సూచిస్తున్నారు.

వర్కౌట్(Workout) తర్వాత తినాల్సిన ఆహారాలు

Workout
Workout

అరటి పండు: జిమ్ తర్వాత అరటి పండు తినడం చాలా మంచిది. ఇందులో ఉండే కేలరీలు కండరాల పెరుగుదలకు, శక్తిని త్వరగా తిరిగి పొందేందుకు సహాయపడతాయి.

పుచ్చకాయ: జాగింగ్ లేదా వాకింగ్ చేసిన తర్వాత పుచ్చకాయ తినడం వల్ల శరీరం రిలాక్స్ అవుతుంది. పుచ్చకాయలో ఉండే సిట్రులిన్, లైకోపిన్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. సిట్రులిన్ నైట్రిక్ ఆక్సైడ్‌ను విడుదల చేసి, వ్యాయామం తర్వాత వచ్చే అలసటను తగ్గిస్తుంది.

చాక్లెట్ మిల్క్ షేక్: ఉదయం వాక్ తర్వాత ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే చాక్లెట్ మిల్క్ షేక్ తీసుకోవచ్చు. ఇది త్వరగా జీర్ణమై అలసిపోయిన కండరాలను మళ్లీ యాక్టివ్‌గా చేస్తుంది. బాడీకి బూస్టింగ్ ఇవ్వాలంటే అమైనో యాసిడ్స్ ఎక్కువగా ఉండే ప్రోటీన్ షేక్స్ తాగడం మంచిది.

ఆమ్లెట్: విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే ఆమ్లెట్‌ను ఉదయం వర్కౌట్ తర్వాత తినవచ్చు. ఇది బరువు తగ్గాలనుకునేవారికి కూడా బాగా ఉపయోగపడుతుంది.

చికెన్: వాకింగ్ తర్వాత చికెన్ తింటే కండరాలకు చాలా మంచిది. దీనిని కూరగాయలు, ఆకుకూరలతో కలిపి తింటే పోషకాలు మరింత పెరుగుతాయి.

కాటేజ్ చీజ్: ప్రోటీన్, కాల్షియం, సోడియం ఎక్కువగా ఉండే కాటేజ్ చీజ్‌ను కూడా తీసుకోవచ్చు. అలాగే, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న పండ్లను ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది.

NTR: ఎన్టీఆరే కాదు తారక్ ఫ్యాన్స్ కూడా సెన్సేషనే.. ఎందుకలా అంటారా?

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button