Wardrobe: ఇంట్లో సంపద పెరగాలంటే బీరువా ఏ దిశలో ఉండాలో తెలుసా?
Wardrobe: ఇంట్లో సంపదకు మూలస్థానమైన కుబేర స్థానం పట్ల ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి.
Wardrobe
ఎంత కష్టపడి సంపాదించినా కష్టం మిగులుతుంది కానీ, డబ్బు చేతిలో నిలవడం లేదని చాలామంది బాధపడుతుంటారు. దీనికి ఇంటి వాస్తు దోషాలు కూడా ఒక కారణం కావచ్చుంటున్నారు వాస్తు నిపుణులు.
వాస్తు శాస్త్రం చెబుతున్న దాని ప్రకారం, ఇంట్లో సంపదకు మూలస్థానమైన కుబేర స్థానం పట్ల ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే మన ఇంట్లో నగదు లేదా విలువైన ఆభరణాలు ఉంచే బీరువా (Wardrobe )ఏ దిశలో ఉందనే అంశం మన ఆర్థిక స్థితిని నిర్ణయిస్తుంది.
వాస్తు ప్రకారం, డబ్బులు, బంగారం ఉంచే బీరువా ఎప్పుడూ ఇంటికి నైరుతి (South-West) మూలలో ఉండాలి. బీరువాను నైరుతి దిశలో ఉంచినప్పుడు దాని ముఖం ఉత్తరం (North) వైపునకు తెరుచుకునేలా ఉండాలి. ఎందుకంటే ఉత్తర దిక్కు కుబేరుడికి నివాస స్థలం. ఇలా ఉంచడం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి రాక అంటే డబ్బులు రావడం పెరుగుతుందని, అనవసర ఖర్చులు తగ్గుతాయని నమ్ముతారు. బీరువా వెనుక గోడకు అతుక్కొని ఉండేలా పెట్టకుండా కొద్దిగా గ్యాప్ ఉండటం మంచిది.

అలాగే బీరువా పైన ఎప్పుడూ బరువులు పెట్టకూడదు. అలాగే బీరువా లోపల ఒక చిన్న అద్దాన్ని అమర్చడం వల్ల, అందులో ఉన్న ధనం ప్రతిబింబించి రెట్టింపు అవుతుందని ఒక నమ్మకం. బీరువా ఉన్న గదిలో చీకటి అస్సలు ఉండకూడదు, ఎప్పుడూ వెలుతురు ఉండేలా చూసుకోవాలి.
అలాగే చిరిగిన బట్టలు , పాతబడిన వస్తువులను బీరువాలో డబ్బుతో పాటు ఉంచకూడదట. ఈ చిన్న వాస్తు మార్పులు చేసుకోవడం వల్ల ఆర్థిక పరమైన అడ్డంకులు తొలగిపోయి, సంపద వృద్ధి చెందుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
Japanese:జపనీస్ సమురాయ్ వంశంలో పవన్ కళ్యాణ్‌కు చోటు.. ‘టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ ఎలా అయ్యారు?




One Comment