Waist Cord: మొలతాడు కట్టుకోవడం ఆచారమా? ఆరోగ్యమా?
Waist Cord: మొలతాడు కట్టుకోవడం వెనుక ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

Waist Cord
మన సంస్కృతిలో, పూర్వీకుల కాలం నుంచి వస్తున్న ఎన్నో ఆచారాలు, సంప్రదాయాలు ఇప్పటికీ పాటిస్తున్నాం. అందులో ఒకటి మొలతాడు కట్టుకోవడం. దీనిని చాలామంది చాదస్తం అనుకుంటారు. మరికొంతమంది పూర్వం పంచెలు కట్టుకునేవారు.అప్పట్లో బెల్టులు అవీ లేవు కాబట్టి లుంగీపంచె జారిపోకుండా సపోర్టు కోసం మొలతాడు వాడేవారని అంటారు. అయితే ఈ అలవాటు వెనుక ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మొలతాడు (Waist Cord) కట్టుకోవడం వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలేమిటో చూద్దాం.
మొలతాడు(Waist Cord) బరువు అదుపులో ఉంచుతుంది. మొలతాడు కట్టుకోవడం వల్ల మీ బరువుపై మీకు ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది. అది బిగుతుగా ఉందంటే మీరు బరువు పెరుగుతున్నారని, వదులుగా ఉందంటే తగ్గుతున్నారని అర్థం. ఇది మీ శరీరంలో వస్తున్న మార్పులను గమనించి, అందుకు తగ్గ జాగ్రత్తలు తీసుకోవడానికి ఒక సంకేతంలా పనిచేస్తుంది. అంతేకాకుండా, నడుముకు మొలతాడు కట్టుకోవడం వల్ల పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోకుండా కొంతవరకు అడ్డుకుంటుంది. ఇది మెటబాలిజంను మెరుగుపరచి, వాత, పిత్త, కఫ దోషాలను సమతుల్యంగా ఉంచుతుంది.
మొలతాడు(Waist Cord) జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శరీరానికి నడుము కేంద్ర బిందువు. మొలతాడు కట్టుకోవడం వల్ల ఈ ప్రాంతంలోని కండరాలు బలంగా ఉంటాయి. ఇది తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా, పెద్దపేగు పనితీరును మెరుగుపరిచి, శరీరంలోని వ్యర్థాలు సక్రమంగా బయటకు వెళ్లేలా చూస్తుంది. అంతేకాకుండా, పిత్తాశయం, కిడ్నీల పనితీరుపైనా సానుకూల ప్రభావం చూపుతుంది.
హెర్నియా, వెన్నెముక సమస్యల నివారణకు..మొలతాడు కట్టుకోవడం వల్ల వెన్నెముక ఆరోగ్యంగా ఉంటుంది. ఇది ముఖ్యంగా లుంబార్ స్పైన్ పోస్చర్‌ను సరిగ్గా ఉంచడానికి సహాయపడుతుంది. నడుము నొప్పి, వెన్నెముక సమస్యలు, డిస్క్ జారడం వంటివి రాకుండా కొంతవరకు కాపాడుతుంది. అతిగా తినడాన్ని కూడా ఇది నియంత్రిస్తుంది. మొలతాడు బిగుతుగా ఉందంటే మీరు ఎక్కువగా తిన్నారని అర్థం. అది అసిడిటీ, గ్యాస్ లాంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. దీనివల్ల ఆరోగ్యంపై నియంత్రణ పెరుగుతుంది.

సంతాన సమస్యల నివారణకు ..మొలతాడుగా సాధారణంగా నల్ల దారాన్ని ఉపయోగిస్తారు. నల్ల రంగు శరీరానికి చలువ చేస్తుందని చెబుతారు. నడుముకు కట్టుకోవడం వల్ల పొత్తి కడుపు భాగంలో ఉష్ణోగ్రతలు అదుపులో ఉంటాయి. శరీరంలో వేడి పెరగడం వల్ల శుక్ర కణాల సంఖ్య తగ్గిపోయే ముప్పు ఉంటుంది, అందుకే పురుషులకు మొలతాడు కట్టుకోవాలని సూచిస్తారు. ఇలా మొలతాడు కట్టుకోవడం వల్ల సంతాన సమస్యలు రాకుండా కూడా నివారించవచ్చని నమ్మకం.
మొత్తానికి, మొలతాడు (Waist Cord) కట్టుకోవడం కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, దాని వెనుక మన పూర్వీకులు ఆలోచించి పెట్టిన ఎన్నో శాస్త్రీయ, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి.
2 Comments