Gratitude Algorithm: పాజిటివిటీతో మెదడు రీ-ప్రోగ్రామ్ చేసుకుందామా? అయితే గ్రాటిట్యూడ్ అల్గోరిథం గురించి తెలుసుకోండి
Gratitude Algorithm: నెగెటివిటీ సర్క్యూట్‌ను బ్రేక్ చేసి, మన మెదడును సానుకూలత (Positivity) వైపు మళ్లించే ఒక శక్తివంతమైన సాధనం గ్రాటిట్యూడ్ అల్గోరిథం
Gratitude Algorithm
సోషల్ మీడియాలో, న్యూస్‌లో మనకు తరచుగా నెగెటివ్ వార్తలు, విమర్శలు, అసంతృప్తి కనిపిస్తాయి. మన మెదడు కూడా సహజంగా సమస్యలపై, లోపాలపైనే ఎక్కువ దృష్టి పెడుతుంది. దీనివల్ల మన జీవితంలో మంచి విషయాలు ఉన్నా, వాటిని గుర్తించలేం. ఈ నెగెటివిటీ సర్క్యూట్‌ను బ్రేక్ చేసి, మన మెదడును సానుకూలత (Positivity) వైపు మళ్లించే ఒక శక్తివంతమైన సాధనం గ్రాటిట్యూడ్ అల్గోరిథం (Gratitude Algorithm).
ఇది ఒక ఆచరణాత్మకమైన, చిన్నపాటి మైండ్‌సెట్ ప్రాక్టీస్. ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు, ఆ రోజులో జరిగిన మూడు మంచి విషయాలను లేదా మీరు ఇతరులకు/ప్రపంచానికి కృతజ్ఞత చెప్పాలనుకునే అంశాలను గుర్తు చేసుకోవడం. ఇది ఒక ‘రూల్’ లాగా అలవాటు చేసుకోవడం వలన, మీ మెదడు రోజు మొత్తం జరిగిన పాజిటివ్ ఈవెంట్స్‌ను వెతకడం మొదలుపెడుతుంది. అందుకే దీన్ని ‘అల్గోరిథం’ అని పిలుస్తున్నారు.
ఎందుకు ఇది ‘అల్గోరిథం’లా పనిచేస్తుందంటే.. దీనిలో మెదడు రీ-వైరింగ్ అవుతుంది.సింపుల్ గా చెప్పాలంటే మీరు రోజూ ఈ ప్రాక్టీస్ చేయడం వల్ల, మెదడులో రీ-వైరింగ్ (Re-wiring) జరుగుతుంది. అంటే, ఆటోమేటిక్‌గా, మీ ఫోకస్ ఫిర్యాదుల నుంచి ప్రశంసల వైపు మారుతుంది.
చాలామంది రోజంతా చేసిన తప్పులు, ఎదురైన ఇబ్బందుల గురించి ఆలోచిస్తూ నిద్రకు ఉపక్రమిస్తారు. ఈ అల్గోరిథం దానిని మార్చి, సానుకూల భావనలతో రోజును ముగించేలా చేస్తుంది.
ఏ విషయాలకు కృతజ్ఞత చెప్పాలి?
కృతజ్ఞత అనేది పెద్ద విజయాల కోసం మాత్రమే చెప్పాల్సిన అవసరం లేదు. అది చిన్న చిన్న విషయాలైనా సరే:
- ఒకరి సహాయం.. “ఈరోజు నాకు ఆఫీస్‌లో కాఫీ తెచ్చి ఇచ్చినందుకు ఆ కొలీగ్‌కు థ్యాంక్స్.”
- సహజ సౌకర్యాలు.. “ఇవాళ చల్లటి గాలి వీచినందుకు, ఇంట్లో భోజనం సరిగా దొరికినందుకు థ్యాంక్స్.”
- సొంత ప్రయత్నం.. “నేను ఏదో ఒక పనిని పూర్తి చేయగలిగినందుకు నా మీద నాకు కృతజ్ఞత.”

ఇలాంటి సానుకూల భావనలతో పడుకోవడం వల్ల ఒత్తిడి తగ్గి, మనస్సు ప్రశాంతంగా ఉండి, నిద్ర నాణ్యత (Sleep Quality) బాగా మెరుగుపడుతుంది. మీకు సహాయం చేస్తున్న వ్యక్తులను, మీ జీవితంలో ఉన్న మంచి విషయాలను గుర్తించడం వల్ల మీ ఆత్మవిశ్వాసం, సంతోషం పెరుగుతాయి.
మీరు నిరంతరం పాజిటివ్‌గా ఆలోచించడం మొదలుపెడితే, భవిష్యత్తుపై మీకు తెలియకుండానే ఒక రకమైన ఆశావాదం పెరుగుతుంది.
గ్రాటిట్యూడ్ అల్గోరిథం(Gratitude Algorithm) అనేది ఖర్చు లేని, శక్తివంతమైన మానసిక చికిత్స లాంటిది. ఇది మీ జీవితంలో నెగెటివిటీ అనే శబ్దాన్ని తగ్గించి, మీలోని సానుకూలతను “రీ-ప్రోగ్రామ్” చేస్తుంది.



