Children: వర్షాకాలంలో మీ పిల్లలకు చెప్పాల్సిన జాగ్రత్తలివే..
Children: మీ పిల్లలను ఇంట్లోనే సేఫ్‌గా ఉండేలా చూసుకోండి. బయటకు వెళ్లాల్సిన అవసరం వస్తే, మీరు వారితో తోడుగా ఉండండి

Children
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో స్కూల్స్‌కు వరుసగా సెలవులు వస్తున్నాయి. వినాయక చవితి, స్వాతంత్య్ర దినోత్సవం వంటి ఫెస్టివల్స్, ఆపై భారీ వర్షాలు. కానీ ఈ హాలిడేస్ పిల్లలకు (Children)ఎంత ఆనందాన్ని ఇస్తున్నాయో,మీరు మీ పిల్లల భద్రతకు సరైన చర్యలు తీసుకోకపోతే, వాటి వెనుక ప్రమాదం పొంచి ఉంటుందన్న విషయం మర్చిపోకూడదు.
చిన్న పిల్లలు నీటిలో ఆడుకోవడానికి ఇష్టపడతారు. కానీ ఆ నీటి కింద లోతైన గుంతలు, తెరిచి ఉన్న మ్యాన్‌హోల్స్ లేదా డ్రెయిన్లు ఉండవచ్చు. అదేవిధంగా, విద్యుత్ స్తంభాలు, కరెంట్ వైర్లు లేదా ట్రాన్స్‌ఫార్మర్ల దగ్గర కదలవద్దని గట్టిగా చెప్పాలి. ఎందుకంటే నీటిలో పడిన కరెంట్ లైన్ కనిపించకపోయినా షాక్ తగిలే ప్రమాదం ఉంటుంది. రోడ్లు దాటేటప్పుడు పెద్దల సహాయం తీసుకోవడం సురక్షితం.
తల్లిదండ్రులుగా, మీరు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యవసరమైతే తప్ప పిల్లల(children)ను బయటకి పంపకపోవడం మంచిది. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే, తప్పనిసరిగా రెయిన్ కోటు, గొడుగు ఇవ్వాలి. వర్షంలోని ప్రమాదాల గురించి పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా వివరించాలి. ఆడే చోటు సురక్షితంగా ఉన్నప్పుడే ఆడాలనే అలవాటును వారికి నేర్పాలి.
మీ పిల్లలను ఇంట్లోనే సేఫ్‌గా ఉండేలా చూసుకోండి. బయటకు వెళ్లాల్సిన అవసరం వస్తే, మీరు వారితో తోడుగా ఉండండి. వర్షపు నీటిలో ఆడుకోవద్దని, కరెంట్ వైర్లకు దూరంగా ఉండమని మీ పిల్లల(Children)కు గట్టిగా చెప్పండి.
వర్షంలో తడిచి ఇంటికి వచ్చిన వెంటనే బట్టలు మార్చుకోవాలని చెప్పాలి. ఇది దగ్గు, జలుబు, జ్వరం వంటి అనారోగ్య సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. అలాగే, నీరు నిలిచి ఉన్న చోట దోమలు పెరిగి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి, ఇంటి చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

ప్రమాదాలను గుర్తించడం నేర్పండి. అంటే పిల్లలకు ఏది సురక్షితం, ఏది ప్రమాదకరం అని గుర్తించేలా వివరించండి. ఇవి పిల్లలకు మాత్రమే కాదు పెద్లలకూ వర్తిస్తుందన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి.
ఒక చిన్న నిర్లక్ష్యం కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ వానాకాలంలో మీ పిల్లల భద్రత మీ చేతుల్లోనే ఉంది కాబట్టి.. దీన్ని సీరియస్‌గా తీసుకోండి.