Just LifestyleLatest News

Time:టైమ్ టెన్షన్ పెడుతోందా? .. మరి ఆ కాలాన్ని, ఆ కొలతలను శాశ్వతంగా బహిష్కరిద్దామా?

Time: మనం కాలాన్ని ఒక మెషీన్‌లా వాడుతున్నాం. ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి సెకను కూడా లెక్కలేస్తూ బతికేస్తున్నాం.

Time: ఉదయం లేచింది మొదలు కాలంతో పోటీ పడుతూ టైమ్(Time) వెంట పరుగులు తీస్తూనే ఉంటున్నాం. అందుకే ఎవరిని చూసినా టైమ్ లేదు అనడం, టైమ్ సరిపోవడం లేదు అన్న మాటలే ఎక్కువగా వింటున్నాం. ఇంకా చెప్పాలి అంటే మనం కాలాన్ని ఒక మెషీన్‌లా వాడుతున్నాం. ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి సెకను కూడా లెక్కలేస్తూ బతికేస్తున్నాం.

ఇంకా చెప్పాలంటే టైమ్ అనే కొలతే మన అందరి జీవితంలో ఒక కాలకూట విషంలా మారింది. ఆఫీస్ టైమ్, డెడ్ లైన్స్, టార్గెట్లు.. ఇలా ప్రతిదానికీ సమయం అనే సంకెళ్లు చాలామందిని హింసిస్తున్నాయి..

మనమందరం ఎంతసేపూ వాల్ క్లాక్‌లోని ముల్లుతో పోటీ పడుతుంటాం. దీనివల్ల మన మనసులో ఎప్పుడూ కూడా ఏదో తెలియని ఆందోళన (Anxiety) పెరుగుతోందన్న విషయాన్ని మర్చిపోతున్నాం. టైమ్ అయిపోతోంది.. నేను వెనకబడిపోతున్నాను అనే భయమే మన ఆరోగ్యాన్ని చాలావరకూ పాడు చేస్తోంది.

అందుకే ఇకపై అయినా నేను కాలాన్ని, ఈ టైమ్(Time) కొలతలను నా మనసు నుంచి బహిష్కరిస్తున్నానని ఎవరికి వారు ప్రకటించుకోవాలి. అంటే దీని మీనింగ్ టైమ్‌ను వదిలేయడం అని కాదు, టైమ్ టైమ్ అని మనమంతా పరుగులు పెట్టడం వల్ల వచ్చే టెన్షన్‌ను వదిలేయడం అని అర్థం.

Time
Time

నిజానికి టైమ్‌ అనే కాదు మనం ప్రతిదాన్నీ కొలుస్తున్నాం..మన సంతోషాన్ని సంపాదనతో, మన విలువను హోదాతో కొలుస్తున్నాం. ఈ కొలతలే మనల్ని మరింత ఒత్తిడికి గురి చేస్తున్నాయి. ఎప్పుడైతే మనం ఈ లెక్కలన్నీ పక్కన పెట్టి, మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటామో, అప్పుడు మనకు అసలైన సంతోషం దొరుకుతుందంటారు సైకాలజిస్టులు.

సైకాలజిస్టులే కాదు ఆధ్యాత్మికవేత్తలు ఇదే చెబుతారు. ఎందుకంటే ఆ స్థితిలోనే ఎదుటి మనుషులందరూ అందరికీ కూడా సమానంగా కనిపిస్తారు. అక్కడ పోటీ ఉండదు, కులమతాల గొడవలు అసలే ఉండవు, కేవలం ప్రశాంతత మాత్రమే ఉంటుంది..

అందుకే కాలం అనే విషాన్ని అమృతంలా మార్చుకోవడానికి ప్రతీ ఒక్కరూ కూడా సమయం వెనక పరిగెత్తడం మానేయాలి. గడియారం ముల్లు మనల్ని శాసించకూడదు, మనమే మన కాలాన్ని కంట్రోల్‌లో పెట్టుకోవాలి. ఈ మానసిక మార్పు మనిషిలో వచ్చినప్పుడే నిజమైన స్వేచ్ఛను అనుభవిస్తాడు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button