Just LifestyleLatest News

Apple cider vinegar:బరువు తగ్గాలా? బీపీ, షుగర్ కంట్రోల్ చేయాలా? అయితే ఇది వాడండి యాపిల్ సైడర్ వెనిగర్

Apple cider vinegar: సలాడ్‌ డ్రెస్సింగ్‌లలో, స్మూతీస్‌లో కూడా వాడవచ్చు. అయితే, ఎక్కువ మోతాదులో వాడితే పంటి మీద ఎనామిల్‌కు మంచిది కాదని గుర్తుంచుకోండి.

Apple cider vinegar

అందరి కిచెన్లలో ఒక సాధారణ వస్తువు వెనిగర్. దీనిలో వైట్ వెనిగర్‌ను క్లీనింగ్ కోసం ఉపయోగిస్తే, యాపిల్ సైడర్ వెనిగర్ (ACV) మాత్రం ఆరోగ్య ప్రయోజనాలకు వాడే వెనిగర్‌గా ఫేమస్ అయింది. ఇది శరీరంలో అనవసరమైన ద్రవాలు (ఫ్లూయిడ్) పేరుకుపోకుండా నిరోధించి, అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్‌ని తగ్గించడం ద్వారా డయాబెటిస్ నియంత్రణలోనూ సహాయపడుతుంది.

అంతేకాకుండా, బరువు తగ్గాలనుకునేవారికి యాపిల్ సైడర్ వెనిగర్ ఒక గొప్ప సహకారిగా నిలుస్తుంది. ఇది మెటబాలిజంను పెంచి, కొవ్వు కరిగేలా చేస్తుంది. ఆకలిని నియంత్రించి, అతిగా తినకుండా చూస్తుంది. అలాగే, ఇది కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్‌ను తగ్గించి గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు రక్తపోటును అదుపులో ఉంచుతాయి. యాపిల్ సైడర్ వెనిగర్ జీర్ణక్రియకు సహాయపడి, గ్యాస్ సమస్య, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో రెండు టీస్పూన్ల ఆర్గానిక్ ACV (Apple cider vinegar)కలిపి ఉదయం తాగితే రోజంతా గ్యాస్ సమస్య లేకుండా ఉంటుంది.

Apple cider vinegar
Apple cider vinegar

యాపిల్ సైడర్ వెనిగర్‌(Apple cider vinegar)ను రోజుకు 2-3 టేబుల్ స్పూన్ల వరకు తీసుకోవచ్చు. మొదట అలవాటు లేకపోతే ఒక టీస్పూన్‌తో మొదలుపెట్టి క్రమంగా పెంచుకోవచ్చు. ఒక టేబుల్ స్పూన్ రా (raw), అన్‌ఫిల్టర్డ్ యాపిల్ సైడర్ వెనిగర్‌ను నీరు లేదా ఫ్రూట్ జ్యూస్‌లో కలిపి తీసుకోవచ్చు. భోజనానికి ముందు ఈ మిశ్రమాన్ని తీసుకుంటే ఆహారం త్వరగా జీర్ణమై, ఆకలి నియంత్రణలో ఉంటుంది. దీనిని సలాడ్‌ డ్రెస్సింగ్‌లలో, స్మూతీస్‌లో కూడా వాడవచ్చు. అయితే, ఎక్కువ మోతాదులో వాడితే పంటి మీద ఎనామిల్‌కు మంచిది కాదని గుర్తుంచుకోండి.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button