Weight Lose : ఆరోగ్యకరంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఇలా ట్రై చేయండి
Weight Lose: అధిక బరువు వల్ల బి.పి., షుగర్, కీళ్లనొప్పులు, గుండె జబ్బులు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే చాలామంది తక్కువగా తిని బరువు తగ్గాలని చూస్తారు

Weight Lose
ఈ రోజుల్లో చాలామంది అధిక బరువుతో ఇబ్బందులు పడుతున్నారు. బరువు తగ్గడం కోసం ఫుడ్ మానేయడం లేదా విపరీతంగా ఎక్సర్సైజులు చేయడం వంటి పద్ధతులను చాలామంది పాటిస్తున్నారు. కానీ నిపుణుల ప్రకారం, ఆరోగ్యకరమైన బరువు తగ్గడానికి డైట్ కంట్రోల్ తో పాటు సరైన ఫిజికల్ ఎక్సర్సైజ్ చాలా అవసరం. ఈ రెండూ కలిస్తేనే ఎక్కవ కాలం వెయిట్ పెరగకుండా చూసుకోవడం సాధ్యమవుతుంది.
అధిక బరువు వల్ల బి.పి., షుగర్, కీళ్లనొప్పులు, గుండె జబ్బులు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే చాలామంది తక్కువగా తిని బరువు తగ్గాలని(Weight Lose) చూస్తారు. కానీ అలా చేయడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందక ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యకు పరిష్కారం, పోషకాలు నిండిన ఆహారం(diet) తీసుకుంటూ, క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ (exercise)చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్.

బ్యాలెన్స్డ్ డైట్, ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం, ఫ్యాట్స్ తక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల బరువు తగ్గడం ఈజీ అవుతుంది. ముఖ్యంగా, నీటి శాతం ఎక్కువగా ఉండే తాజా కాయగూరలు తీసుకోవాలి. గుడ్డులో ఉండే అమైనో యాసిడ్స్ బరువు తగ్గడంలో సహాయపడతాయి. భోజనానికి అరగంట ముందు అర లీటరు నీళ్లు తాగడం వల్ల మెటబాలిజం రేటు పెరుగుతుంది.
అలాగే, ఎక్సర్సైజ్ చేయడం వల్ల కండరాలకు తగిన పని లభించి, రక్తప్రసరణ మెరుగుపడుతుంది. దీంతో గుండె వేగం పెరిగి, కొవ్వు కరుగుతుంది. ముఖ్యంగా ఏరోబిక్స్ వంటి ఎక్సర్సైజులు కొవ్వును తగ్గించడంలో ఎంతో సహాయపడతాయి. సైక్లింగ్(cycling), స్విమ్మింగ్(cycling), వాకింగ్, జాగింగ్ వంటి ఎక్సర్సైజులు కూడా బరువు తగ్గాలనుకునేవారికి మంచి ఫలితాలు ఇస్తాయి. సరైన ఆహారం, సరైన ఎక్సర్సైజ్ ఈ రెండూ కలిసి బరువు తగ్గడాన్ని ఒక ఆరోగ్యకరమైన ప్రాసెస్‌గా మారుస్తాయి.