Cough syrup deaths: దగ్గు సిరప్‌తో చిన్నారుల మృతి ఘటన .. సీబీఐ విచారణ కోరుతూ పిల్
Cough syrup deaths: కేంద్ర ఆరోగ్యశాఖ నిబంధనల ప్రకారం దగ్గు మందులో ఈ రసాయనం 0.1 శాతం కంటే ఎక్కువ ఉండకూడదు. అయితే కోల్డ్రిఫ్ కాఫ్ సిరప్ లో ఏకంగా 48 శాతం కంటే ఎక్కువ మొత్తం ఉన్నట్టు గుర్తించారు.

Cough syrup deaths
దగ్గు మందు తాగి చిన్నారులు ప్రాణాలు (Cough syrup deaths) కోల్పోయిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్రవిషాదాన్ని నింపింది. ఈ ఘటనపై సీబీఐ విచారణ కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అత్యున్నత న్యాయస్థానం ఈ పిల్ ను విచారణకు స్వీకరించింది. శుక్రవారం దీనిపై విచారిస్తామని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఉజ్జయ్ భూయాన్, జస్టిస్ కె.వి నోద్చంద్రన్లతో కూడిన ధర్మాసనం పిటిషనర్ కు తెలిపింది. మధ్యప్రదేశ్ లో కిడ్నీ ఫెయిలైన కారణంగా చిన్నారులు మృతి చెందారు.
చిన్నారుల మృతికి కారణాలను విచారించగా… వారంతా దగ్గు మందు వాడిన తర్వాతే ఇలా జరిగినట్లు తేలింది. మధ్యప్రదేశ్ మాత్రమే కాకుండా రాజస్థాన్‌తో పాటు ఇతర ప్రాంతాల్లోనూకోల్డ్రిఫ్ కాఫ్ సిరప్ తాగడంతోనే చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ సిరప్ కు సంబంధించిన శాంపిల్స్ పరీక్షించడంతో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి.అత్యంత విషపూరితమైన పదార్థాలు దీనిలో ఉన్నట్లు నిర్ధారణయింది. ముఖ్యంగా డైఇథలీన్ గ్లైకాల్ అనే విషపూరిత పదార్థం ఎక్కువ మొత్తంలో ఉన్నట్టు గుర్తించారు.

కేంద్ర ఆరోగ్యశాఖ నిబంధనల ప్రకారం దగ్గు మందులో ఈ రసాయనం 0.1 శాతం కంటే ఎక్కువ ఉండకూడదు. అయితే కోల్డ్రిఫ్ కాఫ్ సిరప్ లో ఏకంగా 48 శాతం కంటే ఎక్కువ మొత్తం ఉన్నట్టు గుర్తించారు. ఆరోగ్యశాఖ అనుమతించిన పరిమితికంటే ఇది ఏకంగా 500 రెట్లు ఎక్కువ. పెద్దలకే దీనిలో ముప్పు ఉంటుందని, చిన్నారులకు కూడా దీని ప్రమాదం ఎక్కువేనని అధికారులు చెబుతున్నారు.
అలాగే సిరప్ తయారీలో ఎలాంటి నిబంధనలు పాటించడం లేదని అధికారులు గుర్తించారు. దీనిలో ఉపయోగించే కెమికల్స్ ను నేరుగా గ్యాస్ స్టవ్ లపై వేడిచేస్తున్నట్టు గుర్తించారు. తయారీలో వాడుతున్న వస్తువులన్నీ కూడా తుప్పుపట్టి ఉండడం, అపరిశుభ్ర వాతావరణం కనిపించింది. పైగా తయారుచేసిన తర్వాత శాంపిల్స్ ను కూడా టెస్ట్ చేయకుండా నేరుగా ప్యాకింగ్ కు పంపించేయడం కూడా అనుమానాలకు తావిస్తోంది. అంటే తెలిసే ఇలా చేశారా.. లేక మరేదైనా కారణంగా ఉందా అన్న కోణంలోనూ విచారిస్తున్నారు.

మరోవైపు ఈ (Cough syrup deaths)ఘటన తీవ్రత నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్రం రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. రా మెటీరియల్స్, ఫైనల్ ప్రొడక్ట్స్ అన్నీ లోతుగా పరీక్షించాలని ఆదేశించింది. నాలుగేళ్లలోపు చిన్నారులకు ఎలాంటి కఫ్ సిరప్ లు ఇవ్వొద్దని చెప్పినా ఎందుకు విక్రయాలు జరుగుతున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ముడి పదార్థాలు, ఉత్పత్తులకు సంబంధించిన ఔషధ పరీక్ష నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ఆదేశించింది. ఇదిలా ఉంటేఈ సిరప్‌ను తయారు చేసిన శ్రేసన్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీ అధినేతను పోలీసులు అరెస్టు చేశారు.
2 Comments