Tourist spot: క్రేజీ టూరిస్ట్ స్పాట్.. వీసా లేకుండా 3 గంటల్లో చేరుకునే దేశం
Tourist spot: చేతిలో కావాల్సినన్ని డబ్బులు, పాస్‌పోర్ట్ ఉన్నా, వీసా తంటాలతో చాలామంది ప్రయాణాలను వాయిదా వేసుకుంటారు

Tourist spot
సాధారణంగా భారతీయులకు ప్రయాణాలంటే ఎంతో మక్కువ. మన దేశంలోనే కాకుండా విదేశాలకు వెళ్లాలన్నా ముందుంటారు. అందుకే భారతీయులలో ప్రయాణాలపై ఉండే ఆసక్తి ఇటీవల కాలంలో అసాధారణంగా పెరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన తాజా నివేదికలు ఈ విషయాన్నే స్పష్టం చేస్తున్నాయి.
2024 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే, 2025లో విదేశీ ప్రయాణాలపై భారతీయులు ఏకంగా 24.5% అధికంగా ఖర్చు చేశారు. గత ఏడాది విదేశీ ప్రయాణాల కోసం సుమారు రూ. 1.13 లక్షల కోట్లు ($13.6 బిలియన్లు) ఖర్చు చేయగా, ఈ ఏడాది అది రూ.1.41 లక్షల కోట్లకు ($17 బిలియన్లు) చేరుకుంది. ఈ మొత్తం కేవలం ఒక్క నెలలో సగటున రూ. 12,500 కోట్లు ఖర్చు చేసినట్లుగా నివేదికలు చెబుతున్నాయి. ఈ స్థాయిలో భారతీయులు విదేశీ పర్యటనలకు (Tourist spot) ఆసక్తి చూపించడం నిజంగా ఆశ్చర్యపరిచే విషయం.

జనరల్‌గా విదేశీ ప్రయాణాలంటే ముందుగా గుర్తొచ్చేది వీసా సమస్య. చేతిలో కావాల్సినన్ని డబ్బులు, పాస్‌పోర్ట్ ఉన్నా, వీసా తంటాలతో చాలామంది ప్రయాణాలను వాయిదా వేసుకుంటారు. కానీ, వీసా లేకుండానే ప్రయాణించే అవకాశం కల్పించిన కొన్ని దేశాలు ఇప్పుడు భారతీయుల మొదటి ఎంపికగా నిలుస్తున్నాయి. అలాంటి దేశాల్లో ఒకటైన కజకిస్థాన్‌కు వెళ్లడానికి భారతీయులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. దీనికి ప్రధాన కారణం, కేవలం మూడు గంటల్లోనే అక్కడికి చేరుకోవడమే.
2022లో కజకిస్థాన్ ప్రభుత్వం భారత ప్రయాణీకుల(Kazakhstan tourism for Indians)కు 14 రోజుల వీసా ఫ్రీ పాలసీని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం, ఒక భారతీయుడు 180 రోజులలో మూడు సార్లు 14 రోజులపాటు వీసా లేకుండా అక్కడ పర్యటించొచ్చు. అదీకాక, అక్కడ పర్యటన ఖర్చు కూడా చాలా తక్కువ. ఈ కారణాలన్నీ భారతీయులను ఆ దేశం వైపు ఆకర్షిస్తున్నాయి.

కజకిస్థాన్(Kazakhstan)లో సందర్శించడానికి అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు (Tourist spot)కూడా ఉన్నాయి. అల్మటి, అస్తానా, టర్కిస్థాన్, నూర్ సుల్తాన్, షిమ్‌కెంట్, అక్టావు, కోక్ టోబ్ వంటి నగరాలతో పాటు, లేక్ కైండి, చరిన్ కన్యోన్ నేషనల్ పార్క్, కోల్‌సె నేషనల్ పార్క్ వంటి అద్భుతమైన ప్రకృతి ప్రదేశాలు(Tourist spot) పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. అందుకే, పాస్‌పోర్ట్ ఉంటే చాలు, మూడు గంటల్లో చేరుకునే కజకిస్థాన్‌కు వెళ్లడానికి భారతీయులు క్యూ కడుతున్నారని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.