Gold price: 2030 నాటికి బంగారం రూ. 2 లక్షలు దాటిపోతుందా?
Gold price :రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, డాలర్‌పై తగ్గుతున్న విశ్వాసం, అమెరికా పెరుగుతున్న రుణం వంటి కారణాలు బంగారం డిమాండ్‌ను పెంచాయి.

Gold Price
ఈ ఏడాది పెట్టుబడిదారులకు బంగారం అద్భుతమైన రాబడిని అందించింది. MCXలో ఈ విలువైన లోహం దాదాపు 30 శాతానికి పైగా పెరిగింది. గత ఆరు సంవత్సరాలలో, 10 గ్రాముల బంగారం ధర రూ.32,000 (2019) నుంచి రూ. 1 లక్షకు పైగా (2025 నాటికి) చేరింది. అంటే దాదాపు 200 శాతం పెరుగుదల నమోదైంది. రాబోయే ఐదు సంవత్సరాలలో బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, ఇది కేవలం సాధారణ అంచనా కాదని, అంతర్జాతీయ పరిస్థితులు దీనికి కారణమని చెబుతున్నారు.
బంగారం భవిష్యత్తుపై భారతీయ కుటుంబాలకు బంగారం ఎప్పటినుంచో భావోద్వేగ, ఆర్థిక విలువను కలిగి ఉందని అంటున్నారు. ఇటీవల ఇది ప్రపంచ కేంద్ర బ్యాంకులకు కూడా వ్యూహాత్మక పెట్టుబడిగా మారింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, డాలర్‌పై తగ్గుతున్న విశ్వాసం, అమెరికా పెరుగుతున్న రుణం వంటి కారణాలు బంగారం డిమాండ్‌ను పెంచాయి.
ఐదేళ్లలో బంగారం 18 శాతం CAGR (Combined Annual Growth Rate) నమోదు చేసింది. ఇదే ట్రెండ్ కొనసాగితే, 2030 నాటికి 10 గ్రాముల బంగారం ధర (Gold Price)రూ.2,25,000 చేరుకోవచ్చు అని ఆయన అంచనా వేశారు. కష్టకాలంలో బంగారంను మించిన పెట్టుబడి మరొకటి లేదని అంటున్నారు.
అలాగే COVID మహమ్మారి,వడ్డీ రేట్ల తగ్గింపు, కరెన్సీ క్షీణత, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం వంటి అంశాలన్నీ బంగారం ధరలు ₹1,01,000 దాటేలా చేశాయని చెబుతున్నారు. రాబోయే ఐదేళ్లలో బంగారం ధర 10 గ్రాములకు రూ.1,50,000 – రూ. 1,70,000 మధ్య ఉండవచ్చు. దీర్ఘకాలికంగా బంగారం పెరుగుదలకు అన్ని అనుకూల పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు. అయితే, సపోర్ట్ లెవల్ రూ. 80,000 – రూ. 90,000 మధ్య ఉండవచ్చని తెలిపారు.
బంగారాన్ని దీర్ఘకాలిక పెట్టుబడిగా పరిగణించినా.. స్వల్పకాలంలో దాని ధరలు (Gold Price) కొన్ని కీలక అంశాలపై ఆధారపడి ఉంటాయి.అమెరికాలో ద్రవ్యోల్బణ గణాంకాలు, పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, డాలర్ బలహీనత వంటివి బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.

రాబోయే వారాల్లో యుద్ధ చర్చలు, ఫెడ్ రిజర్వ్ పాలసీ నిర్ణయాలు, అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల పురోగతి వంటివి బంగారం ధరల గమనాన్ని ప్రభావితం చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ అంశాలు సానుకూలంగా ఉంటే, బంగారం ధరలు కొంత దిద్దుబాటుకు లోనయ్యే అవకాశం ఉంది.
నిపుణుల సలహా ప్రకారం, బంగారం(Gold Price) అనేది దీర్ఘకాలిక విలువ, సురక్షితమైన ఆస్తి కాబట్టి పెట్టుబడిదారులు దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ధరల దిద్దుబాటు సమయంలో క్రమబద్ధంగా కొనుగోలు చేయడం ద్వారా మెరుగైన రాబడులు పొందవచ్చని వారు సూచిస్తున్నారు. ఏదేమైనా, ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు నిపుణులను సంప్రదించడం ముఖ్యం.
Also Read: Soubin Shahir: కూలీలో రజినీనే డామినేట్ చేసిన క్యారెక్టర్.. అంతగా సౌబిన్‌లో ఏముంది?