Obesity: ఒబెసిటీకి గుడ్ బై చెప్పేయండి ..అది కూడా డైటింగ్,ఎక్సర్‌సైజులు లేకుండానే..
Obesity: మన శరీరంలో కాలరీలను నిల్వ చేసేవి వైట్ ఫ్యాట్ కణాలు. కానీ, సిస్టైన్ స్థాయిలు తగ్గినప్పుడు, ఈ కణాలు బ్రౌన్ ఫ్యాట్‌గా రూపాంతరం చెందుతాయి

Obesity
ఎవరైనా వెయిట్(Obesity) తగ్గాలనుకుంటే ముందు డైట్ ఆ తర్వాత ఎక్సర్‌సైజుల మీదే ఫోకస్ చేయాలి. మెడిసిన్స్ లేదా సర్జరీ చివరి ఆప్షన్ గా మాత్రమే ఎంచుకోవాలని ఇప్పటి వరకూ వింటూ వస్తున్న వార్తలకు చెక్ పెట్టే ఓ గుడ్ న్యూస్ వినిపించారు పరిశోధకులు. అవును భారత, అమెరికా శాస్త్రవేత్తలు కలిసి మన శరీరంలోనే దాగి ఉన్న ఒక సీక్రెట్ స్విచ్‌ను కనుగొన్నారు.
ఇది కొవ్వును కరిగించే ప్రక్రియను శాశ్వతంగా మార్చగల సామర్థ్యం కలిగి ఉంది. దీని వెనుక ఉన్న కీలకాంశం సిస్టైన్ (Cysteine) అనే ఒక ముఖ్యమైన అమినో యాసిడ్. ఈ ఆవిష్కరణ ఊబకాయం సమస్యకు ఒక కొత్త, విప్లవాత్మక పరిష్కారాన్ని చూపించేలా ఉంది.
సాధారణంగా మన శరీరం(Obesity)లో కాలరీలను నిల్వ చేసేవి వైట్ ఫ్యాట్ కణాలు. కానీ, సిస్టైన్ స్థాయిలు తగ్గినప్పుడు, ఈ కణాలు బ్రౌన్ ఫ్యాట్‌గా రూపాంతరం చెందుతాయి. బ్రౌన్ ఫ్యాట్ అనేది ఎక్కువ మెటబాలిజం రేటును కలిగి ఉంటుంది. ఇది శరీరానికి వేడిని ఉత్పత్తి చేయడం కోసం అదనపు కాలరీలను వేగంగా బర్న్ చేస్తుంది. ఈ ప్రక్రియ వల్ల బరువు తగ్గడం వేగవంతమవుతుంది.

పెనింగ్టన్ బయోమెడికల్ రీసెర్చ్ సెంటర్ లో జరిగిన ఈ పరిశోధనలో, ఎక్కువ కాలం కాలరీలను తగ్గించిన వ్యక్తులలో సిస్టైన్ స్థాయిలు తగ్గినట్లు నిర్ధారించారు. ఇది కొవ్వు నిల్వలు తగ్గి, మెటబాలిజం మెరుగుపడటానికి దారి తీసింది.
దీనిలో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఎలాంటి ప్రత్యేకమైన ఆహార నియమాలు లేకుండానే సిస్టైన్ స్థాయిల తగ్గింపు (cysteine depletion) ద్వారా శరీరం కొవ్వును బర్న్ చేయడం గమనించారు. ఇది భవిష్యత్తులో ఓవర్ వెయిట్ సమస్యకు లాంగ్ లైష్ సొల్యూషన్‌ను అందించగలదని భావిస్తున్నారు.
ఈ పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు ఎలుకలపై (mice) చేసిన ప్రయోగాలు ఈ విషయాన్ని మరింత స్పష్టం చేశాయి.పరిశోధకులు సిస్టైన్ స్థాయిలను ఎలుకల శరీరంలో తగ్గించినప్పుడు, వాటి శరీర బరువు దాదాపు సగం వరకు తగ్గింది. వైట్ ఫ్యాట్ కణాలు బ్రౌన్ ఫ్యాట్‌గా మారడం వల్ల శరీరం ఎక్కువ కాలరీలను బర్న్ చేయగలిగింది.
మైక్రోస్కోప్, ఇతర అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కొవ్వు కణాలను పరిశీలించారు. సిస్టైన్ తక్కువగా ఉన్నప్పుడు కొవ్వు కణాల ప్రత్యేక రకం ఉద్భవించడం స్పష్టమైంది. ఇది శరీరం సహజంగా కాలరీలను వినియోగించుకునే సామర్థ్యాన్ని పెంచుతుందని నిరూపించారు.
America :అమెరికాకు పోస్టల్ సేవలు బంద్..కొత్త టెన్షన్ ఎందుకు?
సిస్టైన్ ఆధారంగా కొవ్వు మార్పులో ఎటువంటి రసాయన మార్పులు జరుగుతాయో వివరంగా అధ్యయనం చేశారు. ముఖ్యంగా, శక్తి ఉత్పత్తిలో మైటోకాండ్రియా యొక్క పాత్రపై దృష్టి పెట్టారు.
ఈ ప్రయోగాల ఫలితాలు సిస్టైన్ స్థాయిల తగ్గింపు ద్వారా బరువు తగ్గడమే కాకుండా మెటబాలిజం పెరగడం సాధ్యమవుతుందని శాస్త్రీయంగా నిరూపించాయి.
ఈ పరిశోధన ఫలితాల ఆధారంగా, శాస్త్రవేత్తలు ఇప్పుడు కొత్త మెడిసిన్, పోషక ఉత్పత్తులను రూపొందించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ప్రయత్నాలు భవిష్యత్తులో మానవులకు సురక్షితమైన, దీర్ఘకాలిక బరువు తగ్గించే పరిష్కారాలను తీసుకురావడమే లక్ష్యంగా ఉన్నాయి.
Literature: అర్మిలి
ఈ పరిశోధన ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆశను రేకెత్తిస్తోంది, ఎందుకంటే ఇది డైట్ లేదా వ్యాయామంపై ఆధారపడకుండా, బాడీ స్వయంగా వెయిట్ (Obesity)తగ్గించుకునే ప్రాసెస్‌ను ప్రేరేపించొచ్చని సూచిస్తుంది. అయితే సమీక్షకుల అభిప్రాయాల ప్రకారం, ఈ పరిశోధన బరువు తగ్గడంలో ఒక సైంటిఫిక్ రివిరజన్‌కు దారితీసింది. భారత శాస్త్రవేత్తలు, ఇతర అంతర్జాతీయ పరిశోధకులు ఈ రంగంలో లోతైన అధ్యయనాలను కొనసాగిస్తున్నారు.