Anxiety : మీవాళ్లు ఫోన్ ఎత్తకపోయినా టైమ్‌కు ఇంటికి రాకపోయినా టెన్షన్ స్టార్ట్ అవుతుందా?అయితే అది ఇదే..
Anxiety : ఏదైనా జరగరానిది జరిగిందా, లేదా ఏ యాక్సిడెంట్ అయ్యిందా, లేక ఆరోగ్యం పాడయిందా అంటూ లేనిపోని భయాలన్నీ బుర్రలోకి వచ్చేస్తాయి
Anxiety
మన ఇంట్లో వాళ్లో, లేదంటే మన స్నేహితులో ఎవరైనా సరే..మన దగ్గరకు వస్తానన్న టైమ్‌కి రాకపోయినా, లేదా మనం ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా ఎత్తకపోయినా ఎవరికైనా సరే మన గుండెల్లో రాయి పడినట్లు అవుతుంది.
మొదట్లో ఏదో పనిలో ఉండి ఉంటారులే అని లైట్ తీసుకున్నా, టైమ్ గడుస్తున్న కొద్దీ మనకు తెలీకుండానే నెగిటివ్ ఆలోచనలు ఒకదాని వెంట మరొకటి వెంటాడుతాయి.
ఏదైనా జరగరానిది జరిగిందా, లేదా ఏ యాక్సిడెంట్ అయ్యిందా, లేక ఆరోగ్యం పాడయిందా అంటూ లేనిపోని భయాలన్నీ బుర్రలోకి వచ్చేస్తాయి. ఎంత కూల్‌గా ఉండే వాళ్లకైనా సరే, టైమ్ గడిచే కొద్దీ ఇలాంటి చెడు ఆలోచనలు రన్ అవుతూ ఉంటాయి.
నిజానికి మన మెదడు ఎప్పుడూ మనల్ని రక్షించడానికే చూస్తుంది. ఎవరైనా ఫోన్ ఎత్తనప్పుడు కానీ వారు చెప్పిన టైమ్‌కు రాకుండా లేట్ చేసినపుడు కానీ.. మనసులో ఒక తెలియని ఖాళీతనం ఏర్పడుతుంది. ఆ ఖాళీ సమయాన్ని మన మెదడు ఊరికే ఉంచదు. అందుకే ఇలా లేనిపోని ఆలోచనలు వస్తాయి.
కేరింగ్ ఎక్కువ ఉన్న చోటే ఈ కంగారు కూడా ఎక్కువగా ఉంటుంది. కొంతమంది ఫోన్ ఎత్తకపోయినా కూడా మనం అస్సలు పట్టించుకోం, కానీ మనకు బాగా కావాల్సిన వాళ్లు కనిపించకపోయినా, ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా మాత్రం తట్టుకోలేం.అదే సమయం గడిచేకొద్దీ భయంగా మారిపోతుంది.
దీనిని సైకాలజీలో ‘సెపరేషన్ యాంగ్జైటీ'(Anxiety) అంటే దగ్గరి వారికి దూరమయ్యామనే ఆందోళన అంటారు. మనకు ఎవరి మీదైతే ఎక్కువ ప్రేమ, అనుబంధం ఉంటాయో.. వారిని ఎక్కడ కోల్పోతామనో, లేదా వారికి ఏదైనా జరిగిపోతుందేమో అనే అంతర్గత భయం వల్లే ఈ మానసిక ఆందోళన పుడుతుంది

అంతెందుకు అవతలి వ్యక్తి కేవలం ఫోన్ సైలెంట్‌లో పెట్టి పడుకున్నా,జర్నీలో ఉండి చూసుకోకపోయినా, లేదంటే చార్జింగ్ అయిపోయినా.. ఇక్కడ మన మనసు మాత్రం అప్పటికే ఒక పెద్ద దెయ్యాల కథను ఊహించేసుకుంటుంది. దీన్నే సైకాలజీలో కాటస్ట్రోఫైజింగ్(Anxiety) అనే ఒక రకమైన మానసిక ఆందోళన అంటారు.
ఈ కంగారు నుంచి బయటపడాలంటే, అవతలి వాళ్ల గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడటం ఆపాలి. గతంలో కూడా ఇలాగే ఫోన్ ఎత్తనప్పుడు ఆ తర్వాత సేఫ్‌గానే ఇంటికి వచ్చారనే విషయాన్ని మన మనస్సుకు గట్టిగా చెప్పుకోవాలి. ఆ టైమ్‌లో ఫోన్‌ని పక్కన పడేసి వేరే ఏదైనా పనిలో బిజీ అయిపోతే చాలు.. ఈ ఓవర్ థింకింగ్ అలవాటు మెల్లగా తగ్గిపోతుంది.
India Alliance : ఇండియా కూటమి కీలక భేటీ..డీఎంకే దూరం.. ఏం జరగబోతోంది ?





