Just LifestyleLatest News

Stress Response : బయట కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నారా? ..ఆ ఫ్రస్ట్రేషన్‌నే భార్యాపిల్లలపై చూపిస్తున్నారా?

Stress Response : బయటి ఫ్రస్ట్రేషన్‌ను ఇంట్లోకి తీసుకురాకుండా, స్ట్రెస్ రెస్పాన్స్‌ను సరిగ్గా అర్థం చేసుకుంటే..ఫ్యామిలీలో బంధాలు దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు.

Stress Response

ఆఫీసులో వర్క్ ప్రెజర్, బిజినెస్‌లో నష్టాలు, ఆర్థిక ఇబ్బందులు లేదంటే అనుకోకుండా చిన్న గొడవ.. కారణం ఏదైనా బయట పడ్డ టెన్షన్‌ను మోసుకొచ్చి, ఇంట్లోకి అడుగుపెట్టగానే భార్య, పిల్లలు, తల్లిదండ్రులు ఇలా ఎవరో ఒకరిపై చూపించేస్తుంటారు కొంతమంది. ఆ తర్వాత అయ్యో అనవసరంగా అరిచానే అని గిల్టీగా ఫీల్ అవుతుంటారు. అయితే దీని వెనుక మన బాడీ నడిపే ఒక విచిత్రమైన ‘స్ట్రెస్ రెస్పాన్స్’ దాగి ఉందని అంటున్నారు సైకాలజిస్టులు.

మన బాడీకి ఏదైనా ప్రమాదం లేదా విపరీతమైన టెన్షన్ ఎదురైనప్పుడు, బ్రెయిన్‌లోని అమిగ్డాలా అనే పార్ట్ అలెర్ట్ అయి హైపోథాలమస్‌కు సిగ్నల్స్ పంపుతుంది. దాంతో బాడీ కంట్రోల్ సెంటర్ వెంటనే అడ్రినలిన్, కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్లను బాడీలోకి రిలీజ్ చేస్తుంది. ఈ హార్మోన్ల వల్ల ఫైట్ ఆర్ ఫ్లైట్ అంటే పోరాడు లేదా పారిపో అనే రెస్పాన్స్ స్టార్ట్ అవుతుంది.

దీనివల్లే బీపీ పెరగడం, గుండె స్పీడ్‌గా కొట్టుకోవడం, కండరాలు బిగుసుకుపోవడం జరిగిపోతాయి. బయటి వారి దగ్గర లేదా ఆఫీసులో బాస్ దగ్గర ఈ కోపాన్ని చూపిస్తే ఉద్యోగం,తమ మధ్య సంబంధాలు పోతాయనే భయంతో మన బ్రెయిన్ ఆ హార్మోన్ల ప్రవాహాన్ని బలవంతంగా నొక్కి పెట్టేస్తుంది. కానీ మనకు అత్యంత దగ్గరైన వారి వద్ద, ఫ్రెండ్స్ వద్ద ఆ భయం ఉండదు కాబట్టి, మన ప్రమేయం లేకుండానే ఆ ఆపుకున్న కోపమంతా మన వారిపై అగ్నిపర్వతంలా బద్దలు కొట్టేస్తాం.

సమస్య ఏంటంటే.. పూర్వం అడవుల్లో జంతువులు ఎదురైనప్పుడు మనిషి ప్రాణాలు కాపాడుకోవడానికి ఈ రక్షణ వ్యవస్థే ఉపయోగపడేది. కానీ ఇప్పుడున్న డిజిటల్ యుగంలో ఆర్థిక ఆందోళనలు, వర్క్ ప్రెజర్ వల్ల ఈ స్ట్రెస్ సిస్టమ్ స్విచ్ ఆఫ్ అవ్వకుండా శరీరంలో నాన్‌స్టాప్‌గా పనిచేస్తూనే ఉంటోంది. దీనినే క్రానిక్ స్ట్రెస్ అంటారు.

ఇలా బాడీలో కార్టిసాల్ స్థాయిలు ఎప్పుడూ ఎక్కువగా ఉండటం వల్ల నిద్రలేమి, బీపీ, గుండె సమస్యలు, జీర్ణక్రియ పాడవటం, బరువు పెరగడం, డిప్రెషన్ వంటి ప్రాణాంతక సమస్యలన్నీ చుట్టుముడుతున్నాయి.

Stress Response
Stress Response

ఈ ఒత్తిడి రాక్షసి నుంచి బయటపడాలన్నా, మన ప్రశాంతతను కాపాడుకోవాలన్నా కూడా పెద్ద కష్టమేమీ కాదు. రోజూ క్రమం తప్పకుండా డీప్ మెడిటేషన్ చేయాలి. యోగా లేదా డీప్ బ్రీథింగ్ వంటి వ్యాయామాలు చేయడం వల్ల బ్రెయిన్‌కు ఇప్పుడు ప్రమాదం ఏమీ లేదనే మెసేజ్ వెళ్లి స్ట్రెస్ రెస్పాన్స్(Stress Response) వెంటనే ఆగిపోతుంది.

అలాగే వాకింగ్, రన్నింగ్ వంటి ఫిజికల్ ఎక్సర్‌సైజెస్ కూడా బాడీలోని స్ట్రెస్ హార్మోన్లను కరిగించి మైండ్‌ను ప్రశాంతంగా మార్చడంలో యూజ్ అవుతాయి. బయటి ఫ్రస్ట్రేషన్‌ను ఇంట్లోకి తీసుకురాకుండా, స్ట్రెస్ రెస్పాన్స్‌(Stress Response)ను సరిగ్గా అర్థం చేసుకుంటే..ఫ్యామిలీలో బంధాలు దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు.

Constructive Mind Game : బంధం విడిపోవడానికి బ్రేకప్.. మరి కన్‌స్ట్రక్టివ్ మైండ్ గేమ్ గురించి తెలుసా?

Related Articles

Back to top button