Just SportsLatest News

Shreyas Iyer : ఇవాళే కొత్త కెప్టెన్ ఎంపిక..శ్రేయాస్ పేరే ఖరారు

Shreyas Iyer : టీ20 ప్రపంచకప్ గెలిపించిన సూర్యకుమార్ యాదవ్ ను తప్పించి శ్రేయాస్ అయ్యర్ కు పగ్గాలు అప్పగిస్తారని భావిస్తున్నారు

Shreyas Iyer

భారత టీ20 జట్టు కొత్త కెప్టెన్ ఎవరనేది శనివారం తేలిపోనుంది. దీని కోసం బీసీసీఐ సెలక్షన్ కమిటీ ముంబైలో సమావేశం కాబోతోంది. ఐర్లాండ్, ఇంగ్లాండ్ లతో జరిగే సిరీస్ లకు కూడా జట్టును ప్రకటించనున్నారు. మధ్యాహ్నం బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, సెక్రటరీ దేవజీత్ సైకియా మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించనున్నారు.

ప్రస్తుతం స్వదేశంలో ఆప్ఘనిస్థాన్ తో ఒక టెస్ట్, మూడు వన్డేల సిరీస్ ఆడనున్న భారత్ తర్వాత వరుస విదేశీ పర్యటనలతో బిజీ కాబోతోంది. ఐర్లాండ్ తో రెండు టీ20లు, అనంతరం ఇంగ్లాండ్ టూర్, ఆసియా గేమ్స్ కు సెలక్టర్లు శనివారమే జట్లను ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో కొత్త కెప్టెన్ ను కూడా ప్రకటించనున్నారు. టీ20 ప్రపంచకప్ గెలిపించిన సూర్యకుమార్ యాదవ్ ను తప్పించి శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer) కు పగ్గాలు అప్పగిస్తారని భావిస్తున్నారు.

సారథిగా మంచి మార్కులే సాధించిన సూర్యకుమార్ వ్యక్తిగతంగా మాత్రం పూర్తిగా ఫామ్ కోల్పోయాడు. దాదాపు ఏడాదిన్నర కాలంగా పేలవ ప్రదర్శనలతో సతమతమవుతున్నాడు. దీంతో వరుస సిరీస్ లు, వచ్చే టీ20 ప్రపంచకప్ దృష్ట్యా కెప్టెన్సీపై కీలక నిర్ణయం కమిటీ తీసుకుంది. ఈ క్రమంలో శ్రేయాస్ తో పాటు సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ , తిలక్ వర్మ వంటి యువ ఆటగాళ్ల పేర్లు వినిపించాయి.

Shreyas Iyer
Shreyas Iyer

అయితే సెలక్టర్లు శ్రేయాస్ వైపే మొగ్గుచూపుతున్నారు. దీనిపై కోచ్ గంభీర్ తో కాస్త భేదాభిప్రాయాలు వచ్చినా కూడా సెలక్టర్లు శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer) పేరు ఖరారు చేసినట్టు వార్తలు వస్తున్నాయి,.ఈ జట్టు ఎంపికలో 15 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ పేరు హాట్ టాపిక్ గా మారింది. తన అద్భుతమైన బ్యాటింగ్ తో అందరినీ ఆశ్చర్యపరిచిన వైభవ్ కు సెలక్టర్లు జాతీయ జట్టులోకి పిలుపునివ్వడం లాంఛనమే.

ఆసియా గేమ్స్ , ఐర్లాండ్ టూర్ కు అతడిని ఎంపిక చేసే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే శ్రీలంకలో జరగబోయే రెండు మల్టీ డే మ్యాచ్ ల కోసం ఇండియా ఏ టీమ్ ను కూడా సెలెక్టర్లు ఎంపిక చేయనున్నారు. దేశవాళీ క్రికెట్ లో రాణించిన యువ ఆటగాళ్ళకు ఈ జట్టు ఎంపికలో ప్రాధాన్యత లభించనుంది. ఐర్లాండ్ తో సిరీస్ కు కీలక ఆటగాళ్ళకు విశ్రాంతినిచ్చి ఇంగ్లాండ్ తో సిరీస్ కు మళ్ళీ పటిష్ట జట్టుతో బరిలోకి దిగే అవకాశముంది.

Peddi : వీకెండ్ లోపు రూ.200 కోట్లు ..రెండో రోజు పెద్ది కలెక్షన్లు ఎంతంటే ?

Related Articles

Back to top button