Just TechnologyJust TelanganaLatest News

Hyderabad Top In Jobs : వైట్ కాలర్ ఉద్యోగాల్లో భాగ్యనగరం జోరు..నౌకరి.కామ్‌ రిపోర్ట్‌లో హైదరాబాద్ టాప్..

Hyderabad Top In Jobs : నేషనల్ స్థాయిలో ఉద్యోగాల వృద్ధి కేవలం 2 పర్సంటేజ్ వద్దే ఆగిపోగా, హైదరాబాద్‌లో ఏకంగా 9 పర్సంటేజ్‌ వృద్ధితో దేశంలోనే నెంబర్ వన్ ప్లేస్‌లో కూర్చుని అందరినీ ఆశ్చర్యపరిచింది.

Hyderabad Top In Jobs

దేశంలో ఎక్కడ చూసినా లేఆఫ్‌ల టెన్షన్స్, ఐటీ స్లో అయిందనే వార్తలే విన్పిస్తుండగా.. హైదరాబాద్ మాత్రం జాబ్ ఆఫర్ల పండుగ చేసుకుంటోంది. మిగిలిన మెయిన్ మెట్రోలన్నీ జాబ్స్ వేటలో తడబడుతుంటే, భాగ్యనగరం మాత్రం అందరినీ దాటుకుని వైట్ కాలర్ ఆఫీస్ అప్పాయింట్మెంట్ రేసులో టాప్ గేర్‌లో దూసుకెళ్తోంది.

ఫేమస్ జాబ్ ఇన్ఫర్మేషన్ పోర్టల్ నౌకరి.కామ్ లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన జాబ్‌స్పీక్ రిపోర్ట్‌ దేశంలోనే సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. నేషనల్ స్థాయిలో ఉద్యోగాల వృద్ధి కేవలం 2 పర్సంటేజ్ వద్దే ఆగిపోగా, హైదరాబాద్‌లో ఏకంగా 9 పర్సంటేజ్‌ వృద్ధితో దేశంలోనే నెంబర్ వన్ ప్లేస్‌లో కూర్చుని అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఈ డేటా ప్రకారం చూస్తే హైదరాబాద్ సాధించిన 9 పర్సంటేజ్ డెవలప్‌మెంట్ తర్వాత చెన్నై 6 శాతంతో సెకండ్ ప్లేస్‌లో నిలవగా, ఐటీ హబ్ బెంగళూరు 4 పర్సంటేజ్‌, కోల్‌కతా 4 పర్సంటేజ్‌తో పాజిటివ్ ధోరణిని కనబరిచాయి. ఇక మహారాష్ట్ర ఇండస్ట్రియల్ సిటీ అయిన పూనేలో ఉద్యోగ నియామకాలలో ఏ మార్పు కనిపించకుండా ఎప్పటిలాగే ఉంది. అయితే ఊహించని విధంగా దేశ ఆర్థిక రాజధాని ముంబై అలాగే దేశ రాజధాని ప్రాంతమైన ఢిల్లీ-ఎన్‌సీఆర్‌‌లలో చూస్తే.. వైట్ కాలర్ జాబ్ మార్కెట్ ఆశ్చర్యకరంగా 6 పర్సంటేజ్‌ వరకూ పడిపోయింది.

వరల్డ్ వైడ్‌గా హల్‌చల్ చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్) కేటగిరీలలో అత్యధికంగా 20 శాతం వరకూ ఉద్యోగాలు పెరిగాయి. పండుగల సీజన్ డిమాండ్, మార్కెట్‌లో ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు పెరుగుతున్న క్రేజ్ వల్ల ఆటోమొబైల్ సెక్టార్ 11 శాతం డెవలప్‌మెంట్ సాధించింది. అయితే సంప్రదాయ రంగాలు మాత్రం బాగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఐటీ, సాఫ్ట్‌వేర్ సెక్టార్‌లో -4 శాతం, ఫార్మా సెక్టార్‌లో -4 శాతం, హాస్పిటాలిటీ సెక్టార్‌లో -11 పర్సంటేజ్‌, అలాగే ఎడ్యుకేషన్ విభాగంలో ఏకంగా -18 పర్సంటేజ్ వరకూ కొత్త అప్పాయింట్‌మెంట్స్ తగ్గిపోయాయి.

Hyderabad Top In Jobs
Hyderabad Top In Jobs

ఇక కంపెనీలు ఎవరిని తీసుకుంటున్నాయనే విషయంలోనూ ఈ రిపోర్ట్ ఒక క్లియర్ పిక్చర్ బయటపెట్టింది.జాబ్ మార్కెట్‌లో డిమాండ్ అంతా పక్కా అనుభవజ్ఞులకే ఉంటోంది. 13 నుంచి 16 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉన్న సీనియర్లకు డిమాండ్ 7 శాతం పెరగగా.. కెరీర్ స్టార్ట్ చేయాలనుకునే ఫ్రెషర్ల అప్పాయింట్‌మెంట్స్ మాత్రం ఒక్క శాతం మాత్రమే పెరిగాయి. ఇక 4 నుంచి 7 ఏళ్ల అనుభవం ఉన్న మిడ్-లెవల్ ప్రొఫెషనల్స్ కేటగిరీలో జాబ్స్ 2 శాతం వరకూ క్షీణించడం నిరుద్యోగులకు కాస్త టెన్షన్ పెట్టే విషయంగానే ఉంది.

టోటల్‌గా చూస్తే జాబ్ మార్కెట్ అంతా సరికొత్త రూపును సంతరించుకుంటోంది. పాత పాలసీలు, పాత టెక్నాలజీలని నమ్ముకున్న సెక్టార్లు స్లో అవుతుంటే , ఏఐ వంటి కొత్త టెక్నాలజీని రీ-స్కిల్లింగ్ చేసుకునే ఎక్స్‌పర్ట్స్‌కు హైదరాబాద్ (Hyderabad Top In Jobs) వంటి సిటీలలో అవకాశాల తలుపులు బార్లా తెరుచుకుంటున్నాయని అర్థం అవుతుంది.

Mind Controling Power : మీ మైండ్‌కి మీరే బాస్ అవ్వాలా?..ఈ 10 విషయాలు కచ్చితంగా ఫాలో అవ్వండి..

Related Articles

Back to top button