Fat : బాడీలో కొవ్వు పెరగడం మంచిదేనట ..కానీ
Fat :బాడీలో కొవ్వు (fat) పెరిగిపోతోందని చాలామంది తెగ టెన్షన్ పడుతుంటారు. బరువు, కొలెస్ట్రాల్ (cholesterol) స్థాయిలు పెరిగి, బాడీ షేప్ మారిపోతుందని బాధ పడుతుంటారు.

Fat:బాడీలో కొవ్వు (fat) పెరిగిపోతోందని చాలామంది తెగ టెన్షన్ పడుతుంటారు. బరువు, కొలెస్ట్రాల్ (cholesterol) స్థాయిలు పెరిగి, బాడీ షేప్ మారిపోతుందని బాధ పడుతుంటారు. అయితే కొన్ని రకాల కొవ్వులు మన శరీరానికి డేంజరే అయినా ఓ ప్రత్యేకమైన కొవ్వు మాత్రం మనకు మేలు చేస్తుందట. అవును, ఈ ‘మంచి కొవ్వు’ (good fat) అంటే బ్రౌన్ ఫ్యాట్ (brown fat) స్థాయిలను పెంచమని స్వయంగా వైద్య నిపుణులే సూచిస్తున్నారు.
brown fat
మన శరీరానికి హాని చేసే ఫ్యాట్స్‌ను కంట్రోల్ చేయాలన్నా, ఆరోగ్యకరమైన జీవనశైలిని సొంతం చేసుకోవాలన్నా బ్రౌన్ ఫ్యాట్ చాలా అవసరం. ఇది కేలరీలను కరిగించడానికి (burning calories), శరీరంలోని అనవసరమైన భాగాల్లో కొవ్వును తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. పైగా, ఇది మానసిక సమస్యలను దూరం చేస్తుందని నిపుణులు అంటున్నారు. దీని కోసం ఖరీదైన ఉత్పత్తులు వాడాల్సిన అవసరం లేదనీ, జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే సరిపోతుందనీ చెబుతున్నారు.
అధ్యయనాల ప్రకారం, చల్లని ప్రదేశాల్లో లేదా తక్కువ టెంపరేచర్లో ఎక్కువసేపు ఉండటం వల్ల బ్రౌన్ ఫ్యాట్ యాక్టివేట్ అవుతుంది. దీనివల్ల నోరానెప్రైన్ హార్మోన్ల విడుదల వేగవంతమవుతుంది. ఈ రెండూ మెటబాలిజంను పెంచి, అనవసరపు కేలరీలను కరిగించేందుకు దోహదపడతాయని నిపుణులు వివరించారు. మరి మండుటెండల్లో చల్లని ప్రదేశాలను ఎక్కడ వెతకాలని ఆలోచిస్తున్నారా? అంత వర్రీ వద్దు.. మీ డైలీ ఎక్సర్‌సైజ్ తర్వాత నీళ్లలో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకుని స్నానం చేస్తే సరిపోతుందట. ఇలా చేయడం వల్ల తాజాగా అనిపించడమే కాకుండా, కొవ్వును కరిగించేందుకూ ఇది ఉపయోగపడుతుంది.
ఎక్కువ స్పైసీ ఆహారాన్ని తినడం వల్ల బ్రౌన్ ఫ్యాట్ పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. గ్రీన్ టీ , బ్లాక్ టీలో ఉండే ఫైటో , యాంటీఆక్సిడెంట్లు , కెఫీన్ వంటివి బ్రౌన్ ఫ్యాట్ యాక్టివేట్ అవ్వడానికి సహాయపడతాయి. ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండే నట్స్ , చేపలు వంటివి తిన్నా మంచిదని సూచిస్తున్నారు.
గాఢ నిద్ర కూడా బ్రౌన్ ఫ్యాట్ పెరగడానికి సహకరిస్తుందని నిపుణులు చెబుతున్నారు. నిద్రలో నోరానెప్రైన్ అనే హార్మోన్లు ఎక్కువగా విడుదలవుతాయి. వీటివల్ల మెలటోనిన్ తో పాటు బ్రౌన్ ఫ్యాట్ కూడా పెరుగుతుందట. ఉపవాసం వల్ల కూడా బ్రౌన్ ఫ్యాట్ స్థాయి పెరగడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ బ్రౌన్ ఫ్యాట్‌ను పెంచి, అదనపు కొవ్వులు తొలగిపోవడానికి దోహదపడతాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
sorce : https://my.clevelandclinic.org/health/body/24015-brown-fat
(note:: ఇక్కడ అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ఆధారంగానే ఈ వివరాలను అందించాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది)