Japanese:జపనీస్ సమురాయ్ వంశంలో పవన్ కళ్యాణ్‌కు చోటు.. ‘టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ ఎలా అయ్యారు?
Japanese: తాజాగా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ నుంచి రిలీజైన ‘మార్షల్ ఆర్ట్స్ జర్నీ’ వీడియో సోషల్ మీడియాలో ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో అందరికీ తెలిసిందే.
Japanese
ఏపీ డెప్యూటీ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్ వేదికపై.. ఒక అరుదైన మైలురాయిని చేరుకున్నారు. కేవలం సినిమా హీరోగానే కాకుండా, మూడు దశాబ్దాల పాటు యుద్ధకళల్లో పవన్ సాగించిన నిరంతర సాధనకు ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది.
ప్రాచీన జపనీస్(Japanese) కత్తిసాము విద్య అయిన ‘కెంజుట్సు’ (Kenjutsu) లో పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రవేశం పొందారు. జపాన్ వెలుపల, ‘సోకే మురమత్సు సెన్సై’ నేతృత్వంలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘టకెడా షింగెన్ క్లాన్’ (Takeda Shingen Clan) లో సభ్యత్వం పొందిన ఫస్ట్ తెలుగు వ్యక్తిగా పవన్ రికార్డు సృష్టించారు.
ఈ అరుదైన ఘనతతో పాటు పవన్ కళ్యాణ్‌కు.. జపాన్ సంప్రదాయ యుద్ధకళల సంస్థ సోగో బుడో కన్‌రి కై నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఫిఫ్త్ డాన్ (5th Dan) పురస్కారం లభించింది. అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్ రంగంలో అత్యున్నత స్థాయి నైపుణ్యానికి ఇది నిదర్శనంగా పవన్ ఫ్యాన్స్ చెబుతున్నారు.
అంతేకాకుండా, ‘గోల్డెన్ డ్రాగన్స్’ అనే ఇంటర్నేషనల్ సంస్థ పవన్ కళ్యాణ్‌కు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే విశిష్ట బిరుదును ఇచ్చింది. ఈ స్థాయి గౌరవాలు అందుకున్న అతికొద్ది మంది భారతీయ సెలబ్రెటీలలో పవన్ ఒకరిగా నిలిచారు.
మరోవైపు పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గమైన పిఠాపురంలో ఒక విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుడుతున్నారు. తన సొంత ట్రస్ట్ ద్వారా పిఠాపురంలో ఇండియాలోనే అత్యున్నత మార్షల్ ఆర్ట్స్ ,ఫైన్ ఆర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేయబోతున్నట్లు పవన్ ఇటీవల అధికారికంగా ప్రకటించారు.

కేవలం కత్తిసాము, కరాటే వంటి యుద్ధ విద్యలే కాకుండా, వాటి వెనుక ఉన్న తాత్వికతను, క్రమశిక్షణను ఇప్పటి తరానికి నేర్పించడమే ఈ అకాడమీ లక్ష్యంగా పవన్ దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ఇది పిఠాపురాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఒక సాంస్కృతిక , యుద్ధకళల కేంద్రంగా మార్చబోతోందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి సినిమాల్లోకి రాకముందే మార్షల్ ఆర్ట్స్‌తో పవన్ కళ్యాణ్ జర్నీ మొదలైంది. చెన్నైలో చిన్నప్పటి నుంచే కఠినమైన ట్రైనింగ్ పొందిన పవన్, కరాటేలో బ్లాక్ బెల్ట్ కూడా సాధించారు.
తాజాగా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ నుంచి రిలీజైన ‘మార్షల్ ఆర్ట్స్ జర్నీ’ వీడియో సోషల్ మీడియాలో ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో అందరికీ తెలిసిందే.
అందులో ఆయన చూపిస్తున్న కటానా అంటే జపనీస్(Japanese) కత్తి విన్యాసాలు చూస్తుంటే మార్షల్ ఆర్ట్స్ పట్ల పవన్ శ్రమ, పట్టుదల , ఇష్టం అన్నీ అర్థమవుతూనే ఉన్నాయి. పవన్ సాధించిన ఈ విజయం తెలుగు రాష్ట్రాల యువతతో పాటు పవన్ ఫ్యాన్స్‌కు ఒక గొప్ప స్ఫూర్తినిస్తోంది.
Medaram:మేడారంలో జనసముద్రం..మహాజాతర ఎప్పుడు? జాతర ప్రత్యేకతలేంటి?




5 Comments