Apricots : డ్రై ఆప్రికాట్లు 2 తింటే చాలట.. కావాల్సినన్ని లాభాలు
Apricots : ఐరన్, విటమిన్ A, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లతో పుష్కలంగా ఉండే డ్రై ఆప్రికాట్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. anemia, కంటి చూపు, గుండె ఆరోగ్యానికి ఇది సహజ ఔషధం.

Apricots
రక్తంలో ఐరన్(Iron) స్థాయిని పెంచాలనుకుంటున్నారా? కంటి చూపు మెరుగవ్వాలని ఆశిస్తున్నారా? రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు వెంటాడుతున్నాయా? అన్నిటికీ ఒకదానితోనే పరిష్కారం దొరికితే భలే ఉంటుంది కదా.. అందులోనూ మెడిసిన్ రూపంలో కాకుండా ఆహారం రూపంలోనే దొరికితే ఇంకా బాగుంటుంది. ఇలాంటివారి కోసమే డ్రై ఆప్రికాట్లు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. కేవలం వీటికోసమే కాదు ఇంకా ఎన్నెన్నోఆరోగ్య ప్రయోజనాలు పొందుతూ అందంగా కూడా తయారవ్వొచ్చట.

బాదంపప్పు, జీడిపప్పులా పేరు తెచ్చుకోకపోయినా.. డ్రై ఆప్రికాట్(dry apricots)లో ఉండే పోషక విలువలు వాటిని మించుతాయన్నదే నిపుణుల మాట. ఇది ఒక సూపర్‌ఫుడ్. దాని లోపల దాగి ఉన్న శక్తి మీ శరీరానికి కావాల్సిన ఎన్నో విలువల్ని అందిస్తుంది. ఒకటీ రెండూ తినడం ద్వారా – రక్తహీనత తగ్గుతుంది, జీర్ణక్రియ మెరుగవుతుంది, చర్మం కాంతివంతంగా మారుతుంది, గుండె బలపడుతుంది.
పొడి పండ్లలో బాదం, జీడిపప్పు లాంటి ప్రసిద్ధి వీటికి లేదు. కానీ వాటిలో దాగి ఉన్న పోషకాల పరిమాణం చూస్తే నోరు తెరుస్తారు నిపుణులు కూడా. ఐరన్, పొటాషియం, విటమిన్ A, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ డ్రై ఆప్రికాట్ (apricots) పండు… ఒక చిన్న ఔషధ గని అని అంటున్నారు న్యూట్రిషనిస్ట్‌లు.
ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని పెంచే ఐరన్ ఈ పండులో పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనత ఉన్న వారికి దివ్యౌషధం లాంటిది. రెండు ఆప్రికాట్లు(apricots) తినడం ద్వారా శరీరానికి అవసరమైన ఐరన్‌ను సహజసిద్ధంగా పొందవచ్చు.
విటమిన్ A, బీటా కెరోటిన్, కెరోటీనాయిడ్లు ఇందులో ఎక్కువగా ఉండటంతో కంటి చూపు మెరుగవుతుంది. మాక్యులర్ డిజెనరేషన్, కంటి శుక్లం వంటి సమస్యల నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే పొటాషియం, ఫైటోకెమికల్స్, ఫ్లేవనాయిడ్లు వంటి పోషకాలు గుండెపోటును తగ్గించడంలో సహాయపడతాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుతూ, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచే మేలు చేస్తాయి.

ఇటు ఫైబర్ (fiber)ఎక్కువగా ఉండటంతో జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. ప్రేగులను శుభ్రపరుస్తుంది. అజీర్తి లాంటి సమస్యలకు మంచి పరిష్కారంగా నిలుస్తుంది.
ఇందులో ఉన్న యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను పోగొట్టి చర్మానికి నిగారింపు తీసుకువస్తాయి. వృద్ధాప్య లక్షణాలు ఆలస్యంగా కనిపించడంలో సహాయపడతాయి.
ఎముకలు (bones) బలపడతాయి. క్యాల్షియం(calcium) పుష్కలంగా ఉండటంతో ఎముకల దృఢతకు ఇది సహాయపడుతుంది. వృద్ధుల్లో ఎముకల నాజూకుతనాన్ని తగ్గించడానికి ఇది బలమైన సహాయకారిగా పనికొస్తాయి. రోజుకు రెండు డ్రై ఆప్రికాట్లు సరిపోతాయి. వాటిని రాత్రి నానబెట్టి, ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే ఎక్కువ ప్రభావం ఉంటుందట.
Also Read: 40 ప్లస్‌లో ఫిట్‌నెస్ కావాలంటే..
water: మీకు తెలుసా ..అతిగా నీరు తాగితే.. నిశ్శబ్దంగా ప్రాణం తీస్తుందట
One Comment