Just LifestyleLatest News

Ashwagandha: అశ్వగంధతో అద్భుత ప్రయోజనాలు..మగవాళ్లకు వరం లాంటిది..!

Ashwagandha: దాదాపు మూడువేల సంవత్సరాల క్రితం నుంచి అశ్వగంధను వాడుతున్నారు. దీన్ని తీసుకోవడం వల్ల కలిగే అద్భుతమైన లాభాలు చూద్దాం.

Ashwagandha

అశ్వగంధ.. మన పూర్వీకుల కాలం నుంచి అందుబాటులో ఉన్న అద్భుత ఔషధం. ఆయుర్వేదంలో అశ్వగంధకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ఈ మూలిక కేవలం ఒత్తిడిని తగ్గించడానికే కాదు, సంతానోత్పత్తిని పెంచడం నుంచి ఎన్నో ఇతర ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. దాదాపు మూడువేల సంవత్సరాల క్రితం నుంచి దీన్ని వాడుతున్నారు. అశ్వగంధను తీసుకోవడం వల్ల కలిగే అద్భుతమైన లాభాలు చూద్దాం.

అశ్వగంధ (Ashwagandha)ఒత్తిడిని తగ్గించడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇది మన శరీరంలో ఒత్తిడిని పెంచే హార్మోన్లను నియంత్రిస్తుంది, దీనివల్ల మెదడుకు విశ్రాంతి లభిస్తుంది. ఆధునిక జీవనశైలి వల్ల వచ్చే టెన్షన్లు, ఒత్తిడి, ఆందోళనల నుంచి ఉపశమనం పొందడానికి ఇది ఒక మంచి పరిష్కారం. అలాగే డిప్రెషన్‌కు గురైన వారికి కూడా ఇది ఒక మంచి ఔషధంలా పనిచేస్తుంది. అశ్వగంధ వల్ల నెగెటివ్ ఆలోచనలు తగ్గి పాజిటివ్‌గా మారే అవకాశం ఉంటుంది.

అశ్వగంధ(Ashwagandha) బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఇది ఇన్సులిన్ స్థాయిని పెంచి, షుగర్‌ను నియంత్రణలో ఉంచుతుంది. ఇందులో ఉండే వితాఫెరిన్ అనే పదార్థం క్యాన్సర్‌ను అడ్డుకోగలదని కొన్ని పరిశోధనల్లో తేలింది.

Ashwagandha
Ashwagandha

అశ్వగంధ (Ashwagandha)మగవారిలో సంతానోత్పత్తికి ఒక వరం లాంటిది. ఇది స్పెర్మ్ కౌంట్‌ను పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా, కండరాల బలం పెంచడంలో కూడా దీనికి మంచి పేరుంది. మగవారు రోజుకు 750 మి.గ్రా చొప్పున ఒక నెలపాటు తీసుకుంటే కండరాలు బలోపేతమవుతాయి.

అశ్వగంధ శరీర ఉష్ణోగ్రతను కూడా నియంత్రించడంలో సహాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మతిమరపు లక్షణాలు కనిపించేవారు అశ్వగంధ వాడటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

మెదడుకు ఏదైనా కారణంతో దెబ్బతగిలితే, వైద్యులు కూడా అశ్వగంధ వాడమని సూచిస్తుంటారు. అశ్వగంధ ఆయుర్వేద షాపుల్లో లేదా ఆన్‌లైన్ ఈ-కామర్స్ సైట్లలో సులభంగా లభిస్తుంది. దీనివల్ల పెద్దగా సైడ్ ఎఫెక్టులు ఉండవు. అయితే, గర్భిణీలు, పాలిచ్చే తల్లులు దీన్ని వాడకూడదు. ఎప్పుడైనా అశ్వగంధను వాడేముందు వైద్యుడి సలహా తీసుకోవడం మంచిది.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button