Just EntertainmentLatest News

Allu Sirish: అల్లు శిరీష్ ప్రీ-వెడ్డింగ్ పార్టీ.. మెగా స్టార్స్ హంగామా..

Allu Sirish: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒకే ఒక ఫోటో.. రెండు కుటుంబాల మెగా అండ్ అల్లు అభిమానులలో సరికొత్త జోష్‌ నింపింది.

Allu Sirish

పెళ్లి అంటేనే సందళ్లు, సరదాలు.అందులోనూ సెలబ్రెటీల ఇంట్లో పెళ్లి ఉందంటే ఆ జోషే వేరుగా ఉంటుంది. తారాలోకం దిగివచ్చి మరీ పెళ్లి వేడుకల్లో పాల్గొంటూ ఈవెంట్‌ను మరింత కలర్ ఫుల్‌గా మార్చేస్తారు. తాజాగా కొద్దిరోజుల్లో అల్లు వారి ఇంట్లో పెళ్లి బాజాలు మోగుతాయన్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే అల్లు శిరీష్(Allu Sirish) ప్రీ-వెడ్డింగ్ పార్టీ(Pre Wedding Party)ని గ్రాండ్ గా జరిపించారు.

అందులోనూ మెగా-అల్లు కుటుంబాల మధ్య ఉన్న అనుబంధాన్ని.. మరోసారి చాటిచెప్పేలా సాగుతున్న అల్లు శిరీష్-నయనిక వివాహ వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. మార్చి 26న జరగనున్న ఈ వివాహానికి సంబంధించి ఇప్పటికే పసుపు దంచడం వంటి సంప్రదాయ వేడుకలు కూడా జరిగాయి.

అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒకే ఒక ఫోటో.. రెండు కుటుంబాల మెగా అండ్ అల్లు అభిమానులలో సరికొత్త జోష్‌ నింపింది. శుక్రవారం రాత్రి అంటే ఫిబ్రవరి 21న అల్లు అర్జున్ దంపతులు ఏర్పాటు చేసిన ఒక ప్రైవేట్ ప్రీ-వెడ్డింగ్ పార్టీ(Pre Wedding Party)లో.. టాలీవుడ్ తారలందరూ ఒకే చోట చేరారు.

ఈ వేడుకలో రామ్ చరణ్-ఉపాసన దంపతులు సెంటర్ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచారు. ముఖ్యంగా రామ్ చరణ్ అయ్యప్ప మాలలో ఉండటంతో పాటు, మిగిలిన వారంతా బ్లాక్ డ్రెస్సుల్లో క్లాసీగా మెరిసిపోతున్నారు. దీంతో ఇప్పుడు ఈ ఫోటో ఇంటర్నెట్‌ను తెగ షేక్ చేస్తోంది. ముఖ్యంగా బన్నీ, చరణ్ ఇలా ఫ్యామిలీ ఫంక్షన్‌లో కలిసి సందడి చేస్తుండటం చూసి మెగా-అల్లు అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.

Allu Sirish
Allu Sirish

ఈ పార్టీకి కేవలం కుటుంబ సభ్యులే కాకుండా.. టాలీవుడ్ యంగ్ బ్రిగేడ్ కూడా హాజరవడం మరో స్పెషల్ గా నిలిచింది. నిహారిక, సుస్మిత కొణిదెలతో పాటు తేజా సజ్జా, వైష్ణవ్ తేజ్, సిద్ధు జొన్నలగడ్డ, కృతి శెట్టి, రాశీ ఖన్నా వంటి తారలు సందడి చేశారు.

అయితే దీనికంటే ముందు దుబాయ్‌లో జరిగిన యాచ్ పార్టీ వీడియోలు ఇంకా ట్రెండింగ్‌లోనే ఉన్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా, శిరీష్ తన మొదటి వెడ్డింగ్ ఇన్విటేషన్ ను మావయ్య చిరంజీవికి అందజేసి ఆశీస్సులు తీసుకోవడం అందరి హృదయాలను బాగా గెలుచుకుందన్న విషయాన్ని.. ఆ ఫోటోను తెగ వైరల్ చేస్తూ మరీ చెప్పారు అభిమానులు. మొత్తంగా మార్చి 26న జరగబోయే ఆ పెళ్లి వేడుకలో బన్నీ, చరణ్ ఇంకా ఏ రేంజ్ లుక్స్‌లో కనిపిస్తారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button