Just SpiritualJust InternationalLatest News

Lunar Eclipse:హోలీ రోజే చంద్రగ్రహణం..రంగుల సంబరాలకు బ్రేక్ వేయాలా?

Lunar Eclipse భారత దేశంతో పాటు పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ , ఇరాన్ దేశాల్లో కూడా ఈ చంద్రగ్రహణంను చూడొచ్చు.

Lunar Eclipse

హోలీ అంటేనే రంగుల పండుగ.. ఆనందాల విందు. అయితే 2026 మార్చి 3న రాబోతున్న హోలీ మాత్రం కాస్త భిన్నంగా ఉండనుంది. ఈ ఏడాదిలోనే అత్యంత సుదీర్ఘమైన చంద్రగ్రహణం (Lunar Eclipse)అదే రోజు ఏర్పడుతూ ఉండటం.. ఇప్పుడు అందరినీ ఆలోచనలో పడేసింది.

ఈ అరుదైన గ్రహణం మధ్యాహ్నం 3:19 గంటలకు ప్రారంభమై.. సాయంత్రం 6:46 గంటల వరకు కొనసాగనుంది. సుమారు 3 గంటల 27 నిమిషాల పాటు సాగే ఈ చంద్ర గ్రహణం(Lunar Eclipse) వల్ల రంగుల వేడుకలపై నియమ నిబంధనల నీడ ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా గ్రహణానికి ముందు వచ్చే సూతక కాలం ప్రభావం వల్ల.. తమ పండుగ ప్లాన్స్‌ను మార్చుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు

ఈ గ్రహణ ప్రభావం వల్ల.. హోలీ సంబరాలను జరుపుకొనేవారు ఉదయం 11:00 గంటలలోపే పూర్తి చేసుకోవడం మంచిది. నిజానికి గ్రహణం ప్రారంభం అయ్యే 9 గంటల ముందే సూతక కాలం మొదలవుతుండటంతో.. ఉదయం 9:00 గంటలకే ఆలయ ద్వారాలను మూసివేస్తుంటారు.

ఈ సమయంలో దైవ విగ్రహాలను తాకడం కానీ, పూజలు చేయడం కానీ మంచిది కాదని పండితులు చెబుతారు. కాబట్టి ఉదయాన్నే రంగుల పండుగను చేసుకుని ఆడుకుని, స్నానాది కార్యక్రమాలు ముగించుకోవడం మంచిదని అంటున్నారు. భారత్‌లోని పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ గ్రహణం చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. అయితే ఢిల్లీ, మహారాష్ట్ర వంటి ప్రాంతాల్లో మాత్రం పాక్షికంగా దర్శనమిస్తుంది. భారత దేశంతో పాటు పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ , ఇరాన్ దేశాల్లో కూడా ఈ ఖగోళ వింతను చూడొచ్చు.

Lunar Eclipse
Lunar Eclipse

కాగా మరోవైపు గ్రహణ సమయంలో ఆహారం తీసుకోవడం, ప్రయాణాలు చేయడం వంటివి నివారించమని శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా గర్భిణీలు, చిన్నపిల్లలు , వృద్ధులు ఈ సమయంలో బయటకు రాకుండా ఇంట్లోనే ఉండాలి. గ్రహణం ముగిసాక ఇల్లంతా శుద్ధి చేసుకుని, స్నానం చేసిన తర్వాతే భోజనం చేయాలన్న ఆచారం మనందరికీ ఎప్పటినుంచో వస్తోంది.

ఈ రంగుల కేళిని ఎంజాయ్ చేయాలనుకునే వాళ్లు.. ఈ గ్రహణ సమయాలను దృష్టిలో పెట్టుకుని, ఉదయాన్నే వేడుకలను ముగించుకుంటే మంచిది. దీని వల్ల అటు పండుగ జోష్‌ను, ఇటు శాస్త్ర నియమాలను రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసినట్లు అవుతుంది.ఇక ఈ చంద్రగ్రహణం సుమారు గంట పాటు స్పష్టమైన బింబంతో అలరించబోతోంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Related Articles

Back to top button