Just SpiritualLatest News

Talambralu:భద్రాద్రి రాములోరి తలంబ్రాలు ఇక మీ ఇంటికే.. బుకింగ్ ప్రాసెస్ ఇదే

Talambralu:భద్రాద్రి వెళ్లలేకపోయినా, స్వామివారి ఆశీస్సులు తలంబ్రాల రూపంలో ప్రతి భక్తుడి ఇంటికి చేరాలనేదే అసలు ఉద్దేశ్యం.

Talambralu

శ్రీరామ నవమి వేడుకలు వస్తున్నాయంటేనే .అందరికీ భద్రాచలం గుర్తుకు వస్తుంది. జన్మలో ఒక్కసారైనా భద్రాచలం వెళ్లి సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కళ్లారా చూసి తరించాలని ప్రతీ భక్తుడు కోరుకుంటారు. కనీసం తలంబ్రాలు అయినా తెచ్చుకుని ఇంట్లో వారంతా నెత్తిమీద జల్లుకుని స్వామి ఆశీస్సులు తీసుకోవాలని అనుకుంటారు. అయితే ఇది చాలామందికి తీరని కోరికగానే మిగిలిపోతుంది.

ప్రతీ ఏటా కన్నుల పండువగా జరిగే సీతారాముల కళ్యాణోత్సవ తలంబ్రాల(Talambralu) కోసం లక్షలాది మంది భక్తులు ఎదురుచూస్తుంటారు. ఇలా భద్రాద్రి వెళ్లలేని భక్తులకు రాములోరి కళ్యాణ తలంబ్రాలను డైరక్టుగా వారి ఇంటికే చేర్చాలనే మహోన్నత నిర్ణయాన్ని టీజీఆర్టీసీ (TGSRTC) తీసుకుందన్న విషయం చాలామందికి తెలీదు.

ఈసారి కూడా భక్తుల మనోభావాలను గౌరవిస్తూ, దేవాదాయ శాఖ సహకారంతో టీజీఆర్టీసీ మూడేళ్ల క్రితం హోమ్ డెలివరీ సేవలను ప్రారంభించింది. ఈ మహోన్నత కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను శనివారం బస్ భవన్‌లో ఆర్టీసీ వీసీ అండ్ ఎండీ వై.నాగిరెడ్డి ఆవిష్కరించారు. భద్రాద్రి వెళ్లలేకపోయినా, స్వామివారి ఆశీస్సులు తలంబ్రాల రూపంలో ప్రతి భక్తుడి ఇంటికి చేరాలనేదే ఈ ప్రయత్నం వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యమని వారు తెలిపారు.

భద్రాద్రి రామయ్య తలంబ్రాల(Talambralu)కు ఒక ప్రత్యేకత ఉంది. భక్తులు నియమ నిష్టలు పాటిస్తూ ధాన్యాన్ని గోటితో ఒలిచి తీసిన కోటి బియ్యం గింజలను.. ఈ సీతారాముల కళ్యాణంలో తలంబ్రాలుగా ఉపయోగిస్తారు. అలాంటి విశిష్టమైన తలంబ్రాలను కావాలనుకునే భక్తులు కేవలం రూ.151 చెల్లించి తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు.

Talambralu
Talambralu

దీని కోసం www.tgartclogistics.co.in అనే వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా అయినా బుక్ చేసుకోవచ్చు లేదంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో నేరుగా వివరాలు నమోదు చేయొచ్చు. మార్చి 27న భద్రాద్రిలో సీతారాముల కళ్యాణం పూర్తయిన వెంటనే, బుక్ చేసుకున్న భక్తులందరికీ ఆర్టీసీ సిబ్బంది తలంబ్రాల ప్యాకెట్లను హోమ్ డెలివరీ చేసేస్తారు.

మూడేళ్లుగా ఈ తలంబ్రాల సేవలకు భక్తుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. 2022లో ఏకంగా 89 వేల మంది ఈ తలంబ్రాలను బుక్ చేసుకున్నారు. అలా ఈ మూడేళ్లలో లక్షలాది మందికి ఈ పవిత్ర ప్రసాదాన్ని సంస్థ అందజేస్తూ వచ్చింది.

ఈసారి కూడా రికార్డు స్థాయిలో బుకింగ్స్ వస్తాయని అనుకుంటున్నట్లు ఎండీ నాగిరెడ్డి అన్నారు. భక్తుల సౌకర్యార్థం 040-23450033 , 040-69440069 నెంబర్లతో కాల్ సెంటర్‌ను కూడా అందుబాటులో ఉంచారు. శ్రీరామ నవమి వేడుకల్లో భాగంగా, భద్రాద్రికి వెళ్లలేని వారంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం కోరుతోంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Related Articles

Back to top button