Just SportsLatest News

T20 : భారత మహిళలదే టీ20 సిరీస్..చివరి మ్యాచ్ లో కంగారూలు చిత్తు

T20 :భారత మహిళల క్రికెట్ జట్టు అదరగొట్టింది. కంగారూల గడ్డపై చాలా కాలం తర్వాత సిరీస్ విజయాన్ని రుచి చూసింది. అడిలైడ్ వేదికగా జరిగిన చివరి టీ ట్వంటీలో ఆసీస్ ను ఓడించింది.

T20

భారత మహిళల క్రికెట్ జట్టు అదరగొట్టింది. కంగారూల గడ్డపై చాలా కాలం తర్వాత సిరీస్ విజయాన్ని రుచి చూసింది. అడిలైడ్ వేదికగా జరిగిన చివరి టీ ట్వంటీ(T20)లో ఆసీస్ ను ఓడించింది. దీంతో 2015-16 తర్వాత తొలిసారి టీ20(T20) సిరీస్ ను కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ ఇన్నింగ్స్ లో స్మృతి మంధాన బ్యాటింగ్ హైలైట్ గా నిలిచింది.

షెఫాలీ వర్మ(7) పరుగులకే ఔటై నిరాశపరిచినా స్మృతి మంధాన దుమ్మురేపింది. జెమీమా రోడ్రిగ్స్ తో కలిసి ఆసీస్ బౌలర్లను ఆటాడుకుంది వీరిద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకోవడంతో పాటు రెండో వికెట్ కు కేవలం 82 బంతుల్లోనే 121 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. స్మృతి 55 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 82 , జెమీమా 46 బంతుల్లో 4 ఫోర్లతో 59 పరుగులు చేసింది. అయితే రిఛా ఘోష్ (18), అమన్ జోత్ కౌర్ (1), దీప్తి శర్మ (1) నిరాశపరిచారు. భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో సదర్లాండ్ 2 , సోఫీ 1, కిమ్ 1 వికెట్ తీశారు.

177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్ మహిళల జట్టు కూడా దూకుడుగానే ఆడేందుకు ప్రయత్నించింది. అయితే భారత బౌలర్లు వారి జోరుకు కళ్లెం వేశారు. పవర్ ప్లేలోనూ 3 కీలక వికెట్లు తీసి దెబ్బకొట్టారు. ఓపెనర్లు జార్జియా వాల్ (10), బెత్ మూనీ (6), ఎల్లిస్ పెర్రీ(1) పరుగుకే ఔటయ్యారు. ఈ దశలో లిచ్ ఫీల్డ్ , గార్డనర్ ఆసీస్ ను ఆదుకున్నారు.

T20
T20

వీరిద్దరూ నాలుగో వికెట్ కు 31 పరుగులు జోడించగా.. లిచ్ ఫీల్డ్ ను తెలుగమ్మాయి శ్రీచరణి పెవిలియన్ కు పంపింది. అయితే గార్డనర్ తర్వాత వరుసగా రెండు కీలక భాగస్వామ్యాలు నెలకొల్పడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. కానీ చివర్లో భారత బౌలర్లు మరోసారి పుంజుకుని వికెట్లు తీశారు. 57 రన్స్ చేసిన గార్డనర్ ను అరుంధతి రెడ్డి ఔట్ చేయడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. తర్వాత సదర్లాండ్ కాసేపు ధాటిగా ఆడడంతో ఉత్కంఠ పెరిగింది. 18వ ఓవర్లో ఆమెను శ్రేయాంక పాటిల్ ఔట్ చేయడంతో భారత్ విజయం ఖాయమైంది.

భారత బౌలర్లలో శ్రేయాంక పాటిల్ 3, శ్రీచరణి 3 వికెట్లు తీశారు. తొలి మ్యాచ్ లో భారత్ గెలవగా.. తర్వాతి మ్యాచ్ లో ఆసీస్ గెలిచి సిరీస్ ను సమం చేసింది. సిరీస్ డిసైడర్ లో అదరగొట్టిన భారత్ ఆసీస్‌ను నిలువరించి ట్రోఫీని సొంతం చేసుకుంది.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button