Just InternationalJust Political

India, Brazil:భారత్-బ్రెజిల్ దోస్తీ.. మోదీ-లూలా భేటీతో అంతర్జాతీయ వాణిజ్య ముఖచిత్రం మారుతుందా?

India, Brazil: భారత దేశానికి చెందిన ఐటీతో పాటు స్టార్టప్ రంగానికి బ్రెజిల్ రూపంలో ఒక భారీ మార్కెట్ అందుబాటులోకి వస్తుంది.

India, Brazil

భారత్, బ్రెజిల్(India, Brazil) సంబంధాల్లో ఈరోజు ఒక సరికొత్త చరిత్ర లిఖించబడింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డసిల్వా.. మధ్య ఈరోజు జరిగిన ద్వైపాక్షిక చర్చలు రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలకు కొత్త ఊపిరిని పోశాయి.

బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డసిల్వా పర్యటన కేవలం.. ఒక దౌత్యపరమైన భేటీ మాత్రమే కాకుండా, ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కు సరికొత్త శక్తిని ఇచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. లూలా డసిల్వా నాయకత్వంలో భారత్-బ్రెజిల్ సంబంధాలు కొంతకాలంగా అత్యంత వేగంగా బలపడుతున్నాయని, ఈ ప్రయాణంలో ఇదొక కీలక మలుపని ఆయన అన్నారు.

కాగా లాటిన్ అమెరికా దేశాల్లో భారతదేశానికి.. బ్రెజిల్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలవడం విశేషంగా చెప్పుకోవాలి. కేవలం మాటలకే పరిమితం కాకుండా, రాబోయే ఐదు సంవత్సరాలలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 20 బిలియన్ డాలర్ల మార్కును దాటించాలని భారత్, బ్రెజిల్ (India, Brazil) దేశాలు దృఢ నిశ్చయంతో ఉన్నాయి.

ఈ వాణిజ్య సంఖ్యలు కేవలం లెక్కలు మాత్రమే కాదని, రెండు దేశాల మధ్య ఉన్న పరస్పర విశ్వాసానికి ఇవి నిదర్శనమని ప్రధాని మోదీ చెప్పారు. అధ్యక్షుడు లూలా డసిల్వాతో పాటు వచ్చిన భారీ వ్యాపార ప్రతినిధి బృందం కూడా ఈ నమ్మకాన్ని మరింత బలపరుస్తోందని అన్నారు.

సాంకేతికత , ఆవిష్కరణల విషయంలో భారత్-బ్రెజిల్ భాగస్వామ్యం కేవలం మన రెండు దేశాలకే కాకుండా, మొత్తం గ్లోబల్ సౌత్ (దక్షిణాది ప్రపంచం) దేశాలకు దిశానిర్దేశం చేయబోతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డిజిటల్ టెక్నాలజీతో పాటు స్టార్టప్ పర్యావరణ వ్యవస్థల్లో పరస్పరం సహకరించుకోవడం ద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాలకు కొత్త దారులు వెతుకుతామని రెండు దేశాల నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.

అంతేకాదు కేవలం ఆర్థికాభివృద్ధే కాకుండా, అంతర్జాతీయ శాంతిని కూడా దెబ్బతీసే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా రెండు దేశాలు ఏకతాటిపై నిలబడి పోరాడుతాయని ప్రధాని మోదీ ఈ సందర్భంగా బలంగా చెప్పారు.

India, Brazil
India, Brazil

ఈ ఒప్పందం వల్ల భారత్ కు చేకూరే ప్రయోజనాలు అపారమని తెలుస్తోంది. ముఖ్యంగా భారత దేశానికి చెందిన ఐటీతో పాటు స్టార్టప్ రంగానికి బ్రెజిల్ రూపంలో ఒక భారీ మార్కెట్ అందుబాటులోకి వస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డిజిటల్ టెక్నాలజీ రంగాల్లో భారతదేశం సాధించిన ప్రగతిని ..బ్రెజిల్ ఉపయోగించుకోవడం వల్ల మన టెక్ కంపెనీలకు విదేశీ పెట్టుబడులు, ప్రాజెక్టులు భారీగానే లభిస్తాయి.

అలాగే ఇంధన భద్రత విషయంలోనూ బ్రెజిల్ నుంచి ఇథనాల్ టెక్నాలజీతో పాటు చమురు సరఫరాపై సహకారం లభించడం వల్ల భారతదేశానికి ఇంధన అవసరాలకు ఊతం లభిస్తుంది.

అంతేకాకుండా, వ్యవసాయ రంగంలో బ్రెజిల్ కలిగి ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ మన రైతులకు మేలు చేస్తుంది. ఫార్మా రంగంలో భారత్ అగ్రగామిగా ఉండటంతో, మన మందులను బ్రెజిల్ మార్కెట్‌కు ఈజీగా ఎక్స్ పోర్ట్ చేసే అవకాశం ఈ ఒప్పందంతో లభిస్తుంది. రక్షణ రంగంలో ఉమ్మడి పోరాటం , సాంకేతిక మార్పిడి వల్ల భారత రక్షణ వ్యవస్థ కూడా మరింత బలోపేతం కాబోతోంది.

మరిన్ని ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button