Rice cooker: రైస్ కుక్కర్ టైమ్ సేవ్ చేస్తుందా లేక ఆరోగ్యాన్ని డేంజర్లో పడేస్తుందా?
Rice cooker: ఆరోగ్యానికి రైస్ కుక్కర్ ముప్పు: టైమ్ సేవ్ పేరుతో రోగాలను కొని తెచ్చుకోవద్దు

Rice cooker
ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే మాట ఇప్పుడు మరోసారి నిజమవుతోంది. ఆధునిక జీవనశైలిలో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తూ, క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈ బిజీ షెడ్యూల్ వల్ల సమయం ఆదా చేసుకోవడానికి రైస్ కుక్కర్లు(Rice cooker), ప్రెషర్ కుక్కర్లు వంటి వాటిని ఆశ్రయిస్తున్నారు. కానీ తెలియకుండానే తమతో పాటు తమ పిల్లల ఆరోగ్యాన్ని కూడా ప్రమాదంలోకి నెట్టుకుంటున్నామని వారికి అర్థం కావడం లేదు.
పూర్వం మన పెద్దవాళ్లు అన్నం వండటానికి మట్టి కుండలు లేదా కనీసం స్టీల్ గిన్నెలు, ఇత్తడి వంటి పాత్రలు వాడేవారు. అయితే ఇప్పుడు ఆ సంప్రదాయం పూర్తిగా పోయింది. సమయం లేకపోవడంతో, త్వరగా పని పూర్తి చేసుకోవాలనే ఉద్దేశంతో చాలామంది అల్యూమినియం పాత్రలు, కరెంట్ కుక్కర్లలో వంట చేస్తున్నారు. కానీ ఆరోగ్య నిపుణులు ఈ అలవాటు చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.

ఆరోగ్య నిపుణుల ప్రకారం, రైస్ కుక్కర్లు(Rice cooker) ఎక్కువగా అల్యూమినియం పదార్థంతో తయారు చేస్తారు. అల్యూమినియం పాత్రల్లో వంట చేయడం, ఆహారాన్ని నిల్వ ఉంచడం మంచిది కాదు. వంట చేసేటప్పుడు గాలి, వెలుతురు సరిగా తగలకపోతే ఆహారంలోని పోషకాలు హానికరంగా మారే అవకాశం ఉంది. ఈ హానికరమైన పదార్థాలు రెండు రకాలుగా పనిచేస్తాయి. కొన్ని వెంటనే ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీస్తే, మరికొన్ని నెమ్మదిగా శరీరంలో చేరి కొన్ని నెలలు లేదా సంవత్సరాల తర్వాత రోగాలకు కారణమవుతాయి.
అల్యూమినియం పాత్రల్లో వండిన ఆహారం వల్ల ఉదర సంబంధ సమస్యలు, గుండె జబ్బులు, కీళ్ల నొప్పులు, డయాబెటిస్, గ్యాస్ సమస్యలు, అధిక బరువు, నడుము నొప్పి వంటి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. అందుకే సాధ్యమైనంత వరకు ప్రెషర్ కుక్కర్ లేదా కరెంట్ కుక్కర్‌లో వంట చేయడం మానుకోవడమే ఉత్తమం.
ఈ ప్రమాదాలను గుర్తించి, ఇప్పుడు చాలామంది పాత పద్ధతులను మళ్లీ అనుసరిస్తున్నారు. చిరుధాన్యాలు, మిల్లెట్స్ తినడం, స్టీల్ గిన్నెల్లో వంట చేయడం వంటివి చేస్తున్నారు. మీరు అంత దూరం వెళ్లకపోయినా, కనీసం అన్నం వండటంలో కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా మీ జీవన ప్రమాణాలను కాపాడుకోవచ్చు. సమయం ఆదా చేసుకోవడానికి బదులు, మీ ఆరోగ్యాన్ని(health) కాపాడుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వండి.