HealthJust LifestyleLatest News

Adaptogens:టెన్సన్స్‌కు ప్రకృతి అందించిన విరుగుడు..ఏంటీ అడాప్టోజెన్స్

Adaptogens: ఒత్తిడి సమయంలో, అడ్రినల్ గ్రంథులు అధికంగా కార్టిసోల్ (Cortisol) హార్మోన్‌ను విడుదల చేస్తాయి.

Adaptogens

నేటి అత్యంత వేగవంతమైన, పోటీ ప్రపంచంలో శారీరక, మానసిక ఒత్తిడి (Stress) అనేది ఒక ప్రతీ ఒక్కరి సమస్యగా మారింది. శరీరం ఈ ఒత్తిడికి అనుగుణంగా మారడానికి, అంతర్గత సమతుల్యత (Homeostasis)ను తిరిగి సాధించడానికి సహాయపడే సహజ మూలికలనే అడాప్టోజెన్స్ (Adaptogens) అని అంటారు. ఈ మూలికలు దేహంపై పనిచేసే విధానం చాలా ప్రత్యేకమైనది.

ఇవి నేరుగా హార్మోన్ల వ్యవస్థను, ముఖ్యంగా ఒత్తిడికి ప్రతిస్పందించే హైపోథాలమిక్-పిట్యూటరీ-అడ్రినల్ (HPA) యాక్సిస్‌ను నియంత్రిస్తాయి. ఒత్తిడి సమయంలో, అడ్రినల్ గ్రంథులు అధికంగా కార్టిసోల్ (Cortisol) హార్మోన్‌ను విడుదల చేస్తాయి. అడాప్టోజెన్‌లు ఈ కార్టిసోల్ స్థాయిలను అదుపులో ఉంచి, శరీరం ‘పోరాడాలా లేదా పారిపోవాలా’ (Fight or Flight) అనే మోడ్ నుంచి త్వరగా బయటపడేలా సహాయపడతాయి.

Adaptogens
Adaptogens

మన భారతీయ సంప్రదాయంలో తరతరాలుగా వాడుతున్న అశ్వగంధ (Ashwagandha), బ్రహ్మి, విదేశాలలో ప్రసిద్ధి చెందిన రోడియోలా (Rhodiola) వంటి మూలికలు అడాప్టోజెన్ల కోవకే చెందుతాయి. అశ్వగంధ వంటివి మెదడులోని నరాల కణాల పునరుత్తేజానికి (Neuroregeneration) దోహదపడతాయి. వీటిని క్రమం తప్పకుండా వైద్యుల పర్యవేక్షణలో తీసుకోవడం వలన కేవలం ఒత్తిడి తగ్గడమే కాక, దీర్ఘకాలిక అలసట (Chronic Fatigue) తగ్గుతుంది. రోగనిరోధక శక్తి (Immune System) పెరుగుతుంది . మానసిక స్పష్టత (Mental Clarity) మెరుగుపడుతుంది.

నిద్రలేమి, జ్ఞాపకశక్తి సమస్యలు , దీర్ఘకాలిక ఆందోళనతో బాధపడేవారు అడాప్టోజెన్లను తమ జీవనశైలిలో భాగం చేసుకోవడం వలన మానసిక ఆరోగ్యం , శారీరక శక్తి స్థాయిలు స్థిరంగా మెరుగుపడతాయి. అయితే, ఏదైనా కొత్త సప్లిమెంట్ ప్రారంభించే ముందు వైద్య నిపుణుడి సలహా తీసుకోవడం తప్పనిసరి. ఈ సహజ మూలికల శక్తిని గుర్తించి, ఆధునిక వైద్య పరిశోధనలు కూడా వీటి సమర్థతను ధృవీకరిస్తున్నాయి.

Almonds: జ్ఞాపకశక్తి పెరగడానికి బాదం అంత మంచిదా?

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button