Sangeet :సంగీత్ థియేటర్ నుంచి మెడికవర్ ఆసుపత్రి వరకు..జ్ఞాపకాల దారిలో సంగీత్ రోడ్
Sangeet :సంగీత్' కేవలం ఒక సినిమా హాల్ మాత్రమే కాదు; అది ఒక సాంస్కృతిక కేంద్రం. స్నేహితులు, కుటుంబసభ్యులు, యువతకు అది వీకెండ్ అంటే సినిమా చూసే ఒక వేదిక.

Sangeet
ఒకప్పుడు సికింద్రాబాద్ నడిబొడ్డున ఉన్న సంగీత్ థియేటర్(Sangeet Theatre), సినిమా ప్రియులకు ఒక జ్ఞాపకం. 1969లో ప్రారంభమైన ఈ సింగిల్-స్క్రీన్ థియేటర్, సుమారు నాలుగు దశాబ్దాల పాటు నగరవాసులను అలరించింది. ముఖ్యంగా హాలీవుడ్ చిత్రాలను నగరానికి పరిచయం చేసిన ఘనత ఈ థియేటర్‌కే దక్కుతుంది.
మల్టీప్లెక్స్‌లు, షాపింగ్ మాల్స్ లేని ఆ రోజుల్లో, ఇంగ్లీష్ సినిమాలను చూడటానికి హైదరాబాద్ ప్రజలు ఎక్కువగా సంగీత్ థియేటర్‌కే వచ్చేవారు. ఇక్కడే జాస్(Jaws),జురాస్సిక్ పార్క్ (Jurassic Park), టైటానిక్ Titanic), హోమ్ ఎలోన్ (Home Alone) వంటి అంతర్జాతీయ బ్లాక్‌బస్టర్‌లు రికార్డు కలెక్షన్లతో ప్రదర్శితమయ్యాయి. అంతేకాకుండా, బాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన హమ్ ఆప్కే హే కౌన్ (Hum Aapke Hain Kaun) అనే సినిమా ఈ థియేటర్‌లో ఉదయపు షోలోనే ఏడాది పొడవునా ప్రదర్శితమై రికార్డు సృష్టించింది.

సంగీత్ (Sangeet )కేవలం ఒక సినిమా హాల్ మాత్రమే కాదు.. అది ఒక సాంస్కృతిక కేంద్రం. స్నేహితులు, కుటుంబసభ్యులు, యువతకు అది వీకెండ్ అంటే సినిమా చూసే ఒక వేదిక. ఆ థియేటర్ ప్రత్యేకమైన నిర్మాణం, దాని బోర్డులు, మరియు అద్భుతమైన సౌండ్ ఎక్స్పీరియన్స్ అప్పటి తరానికి ఇప్పటికీ గుర్తే. దాని ప్రత్యేకమైన నిర్మాణం, బోర్డులు, థియేటర్‌లో వచ్చే ఫుల్ సౌండ్ ఎక్స్పీరియన్స్ అప్పటి తరాన్ని ఇప్పటికీ కళ్లముందే ఉంటాయి.
కాలక్రమంలో మల్టీప్లెక్స్‌లు, షాపింగ్ మాల్స్ ఆకర్షణ, స్క్రీనింగ్ టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో సింగిల్-స్క్రీన్ థియేటర్ల ప్రాధాన్యత తగ్గింది. తగ్గిన ప్రేక్షకులతో పాటు పెరిగిన నిర్వహణ ఖర్చుల వల్ల చివరికి సంగీత్ థియేటర్ 2008లో మూతపడింది.
ప్రస్తుతం ఆ స్థలంలో 300 పడకల సామర్థ్యం గల మల్టీ-స్పెషాలిటీ మెడికవర్ ఆసుపత్రి పనిచేస్తోంది. థియేటర్ భవనం కనిపించకపోయినా, ఆ ప్రాంతానికి సంగీత్ క్రాస్ రోడ్స్’ అనే పేరు మాత్రం ఇప్పటికీ వాడుకలో ఉంది .అది ఆ ప్రదేశం యొక్క లోతైన చరిత్రను గుర్తు చేస్తుంది.
Also Read: Breakfast:హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌ను ఇలా ప్లాన్ చేసుకోండి..
సికింద్రాబాద్‌లోని సంగీత్ థియేటర్ ఒకప్పుడు హాలీవుడ్‌ను హైదరాబాద్‌కు దగ్గర చేసింది. నాలుగు దశాబ్దాల పాటు సినిమా ప్రియులకు చిరస్మరణీయ అనుభవాలను అందించింది. కాలం మారినా, ‘సంగీత్’ అనే పేరు మాత్రం ఆ నగరవాసుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఇప్పుడు ఆసుపత్రి రూపంలో అది ఒక కొత్త సేవా అధ్యాయాన్ని మొదలుపెట్టింది. ఈ విధంగా ‘సంగీత్’ థియేటర్ (Sangeet Theatre) ఒక యుగం ముగిసిందని, ఇప్పుడు ఆసుపత్రి రూపంలో ఒక కొత్త సేవా అధ్యాయం మొదలైందని హైదరాబాదీలు గర్వంగా చెప్పుకుంటారు.