Pawan Kalyan:పవన్ కళ్యాణ్ మాస్ వార్నింగ్‌లు దేనికి సంకేతం ? పదే పదే వైసీపీ డివైడ్ ప్లాన్ ఎందుకు ఫెయిల్ అవుతోంది?
Pawan Kalyan: ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు ఓటర్లను ఎంతగా ప్రభావితం చేశాయో, విపక్ష ఓట్లు చీలకుండా చేయడంలో ఎలాంటి కీలక పాత్ర పోషించాయో అందరికీ తెలిసిందే.
Pawan Kalyan
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దశాబ్ద కాలంగా ఎన్నో మార్పులు చూశాం. కానీ 2024 ఎన్నికల తర్వాత ఎవరూ ఊహించనంతగా రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సాధించిన చారిత్రాత్మక విజయం తర్వాత, ప్రత్యర్థి పార్టీ అయిన వైఎస్పార్సీపీ తన ఉనికిని కాపాడుకోవడానికి .. ముఖ్యంగా కూటమిలో చీలికలు తేవడానికి విశ్వ ప్రయత్నాలు ఎప్పటికప్పుడు చర్చనీయాంశంగా మారుతూనే ఉన్నాయి. పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )తాజాగా ఇచ్చిన వార్నింగ్ ఈ రాజకీయ పరిణామాలకు ఒక అద్దం పడుతున్నాయి.
పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )వార్నింగ్‌ల వెనుక అంతరార్థాన్నికనుక గమనిస్తే..పవన్ తన రాజకీయ ప్రయాణంలో మొదటి నుంచీ ఒక స్పష్టమైన వైఖరిని అవలంబిస్తున్నారు.పవన్ కేవలం కౌంటర్లు ఇవ్వడమే కాకుండా, తన ప్రత్యర్థులకు ఎప్పటికప్పుడు సీరియస్ వార్నింగులు ఇస్తూనే వస్తున్నారు. ముఖ్యంగా కుల విద్వేషాలను పెంపొందించడం, సోషల్ మీడియా వేదికగా అబద్ధాలను ప్రచారం చేయడం వంటి అంశాలపై పవన్ ఇంకాస్త ఎక్కువగానే ఫైర్ అవుతున్నారు.
ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )చేసిన విమర్శలు ఓటర్లను ఎంతగా ప్రభావితం చేశాయో, విపక్ష ఓట్లు చీలకుండా చేయడంలో ఎలాంటి కీలక పాత్ర పోషించాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అధికారంలో ఉన్నా సరే, పిఠాపురం వంటి చోట్ల చిన్న చిన్న సంఘటనలను కుల గొడవలుగా చిత్రీకరించే ప్రయత్నాలపై పవన్ ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. పోలీసులు చట్టప్రకారం కఠినంగా వ్యవహరించాలని చెబుతూనే.. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు కూటమి ఐక్యతను కాపాడుకోవడానికి తాను ఎంత వరకూ అయినా వెళతాననని హెచ్చిరించారు.
అయితే ఇదే సమయంలో వైసీపీ డివైడ్ స్ట్రాటజీ ఎందుకు ఫెయిల్ అవుతోందన్న ప్రశ్న వినిపిస్తోంది. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ అనుసరిస్తున్న ప్రధాన వ్యూహం ‘డివైడ్ అండ్ రూల్’. పవన్ కళ్యాణ్ (కాపు) , చంద్రబాబు (కమ్మ) సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టడం ద్వారా కూటమిని బలహీనపరచవచ్చని ఆ పార్టీ గట్టిగా నమ్మింది.
గతంలో చంద్రబాబు అరెస్ట్ సమయంలో పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాలు, సీట్ల సర్దుబాటు సమయంలో ఎదురైన సవాళ్లను సాకుగా చూపి కూటమి విచ్ఛిన్నం చేయడానికి ఎంత వరకూ ప్రయత్నించాలో అంతవరకూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. కానీ ఈ వ్యూహం ఫెయిల్ అవడానికి ప్రధాన కారణం ‘మ్యూచువల్ డిపెండెన్సీ’ అంటున్నారు విశ్లేషకులు.
ఎందుకంటే పవన్ కళ్యాణ్( Pawan Kalyan )కు చంద్రబాబు అనుభవం అవసరమైతే, చంద్రబాబుకు పవన్ ఇమేజ్ , మాస్ బేస్ అత్యంత కీలకం అని ఇద్దరికీ బాగానే తెలుసు.అందుకే వీలయినప్పుడల్లా ఈ ఇద్దరు నేతలు బహిరంగంగానే తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, తమ లక్ష్యం కేవలం రాష్ట్రాభివృద్ధి అని స్పష్టం చేస్తూనే ఉంటారు. వీరిద్దరి సఖ్యతే వైసీపీ వ్యూహాలకు గట్టి దెబ్బ కొడుతూ వస్తుంది.

సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా విమర్శలకే పరిమితమవుతుంది. కానీ పవన్ కళ్యాణ్ ఇక్కడ ఒక కొత్త పంథాను అనుసరిస్తున్నారు. ఆయన వార్నింగ్‌లు ఇస్తూనే, మరోవైపు అభివృద్ధిపైన కూడా దృష్టి పెడుతున్నారు. ఉదాహరణకు పిఠాపురం నియోజకవర్గంలో రూ. 212 కోట్ల బడ్జెట్ కేటాయింపులు, ఉప్పాడ రిటైనింగ్ వాల్ నిర్మాణం వంటి పనులను వేగవంతం చేస్తున్నారు.ఇలాంటివి ప్రజలు జాగ్రత్తగానే గమనిస్తున్నారన్న విషయాన్ని వైసీపీ నేతలు మర్చిపోతున్నారు.
ఎందుకంటే ప్రజలు కేవలం మాటలు కాకుండా చేతలనే చూస్తున్నారు.దీంతో వైసీపీ చేస్తున్న విమర్శలు కేవలం రాజకీయం కోసమే అని ప్రజలకు అర్థం కావడంతో, వైసీపీ డివైడ్ ప్లాన్ క్షేత్రస్థాయిలో పని చేయడం లేదు. పైగా పవన్ కళ్యాణ్ తాను ముఖ్యమంత్రి పదవిని ఆశించడం లేదని, వ్యవస్థలో మార్పు కోసమే కూటమితో కలిశానని పదే పదే చెప్పడం.. ఆయన క్రెడిబిలిటీని మరింత పెంచింది.
మరోవైపు రాబోయే ఐదేళ్ల కాలం కూటమికి అత్యంత కీలకం. అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం వంటి పెద్ద లక్ష్యాలు వీరి ముందు ఉన్నాయి. ఇలా ఏపీ ప్రభుత్వం అభివృద్ధిపై ఫోకస్ చేయడంతో.. 2029 ఎన్నికల నాటికి వైసీపీ మళ్లీ పుంజుకోవాలంటే కూటమిలో చీలికలు తేవడం తప్ప వేరే మార్గం లేదని భావిస్తోంది.
అయితే పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ), చంద్రబాబు మధ్య ఉన్న బాండ్ కేవలం రాజకీయ అవసరం మాత్రమే కాదు, అది ఒక వ్యక్తిగత నమ్మకం మీద ఆధారపడి ఉంది. పవన్ కళ్యాణ్ తన కేడర్‌ను కూడా క్రమశిక్షణలో ఉంచడం, వివాదాస్పద వ్యాఖ్యలకు తావు లేకుండా చూసుకోవడం కూటమికి బలాన్నిస్తోంది.
మొత్తంగా.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ ‘Resilience’ (స్థితప్రజ్ఞత) అనేది ఒక కొత్త పాఠం. ప్రత్యర్థుల కుల రాజకీయాలు, సోషల్ మీడియా ట్రోలింగ్ కంటే ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని కూటమి నేతలు నిరూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ హెచ్చరికలు ప్రత్యర్థులకే కాకుండా, కూటమిలోని (Alliance) ఎమ్మెల్యేలకు కూడా ఒక గైడ్ లా పనిచేస్తున్నాయి. ఈ ఐక్యత ఇలాగే కొనసాగితే.. వైసీపీ తన మనుగడ కోసం కొత్త మార్గాలను వెతుక్కోవాల్సి ఉంటుంది తప్ప, కూటమిని విడదీయడం అసాధ్యం అనే చెప్పొచ్చు.
Review:ది రాజాసాబ్ రివ్యూ.. ప్రభాస్ ,మారుతి ‘మైండ్ గేమ్’ ప్రేక్షకులను మెప్పించిందా?




3 Comments