Just LifestyleHealthLatest News

Laughter: ఒక మైల్ జాగింగ్ = 15 నిమిషాల నవ్వు..ఆరోగ్యానికి నవ్వు ఎందుకు ముఖ్యం?

Laughter: మనం మనస్ఫూర్తిగా నవ్వినా, లేదా కేవలం నవ్వుతున్నట్లుగా నటించినా, మన మెదడుకు నేను సంతోషంగా ఉన్నాననే సిగ్నల్ వెళ్తుంది.

Laughter

హైదరాబాదులో ఒక ఐటీ కంపెనీలో ఉద్యోగులు విపరీతమైన స్ట్రెస్‌తో సతమతమవుతున్నారు. ఆఫీస్ అంటేనే ఒక యుద్ధభూమిలా ఉంది. పని ఒత్తిడి, టార్గెట్లు, డెడ్‌లైన్స్‌తో వాళ్ల ముఖాల్లో చిరునవ్వు మాయమైపోయింది. ఇది గమనించిన మేనేజర్ ఒక వింత నిర్ణయం తీసుకున్నాడు. రోజూ ఉదయం 10 నిమిషాల పాటు లాఫ్టర్ సెషన్ పెట్టాడు. మొదట అందరూ ఇదేం పిచ్చి పనిరా బాబు అని నవ్వుకున్నారు. బలవంతంగా నవ్వడం మొదలుపెట్టారు. కానీ, క్రమంగా ఆ బలవంతపు నవ్వులు నిజమైన నవ్వులుగా మారాయి. వారితో పాటు అందరిలోనూ ఉత్సాహం పెరిగింది.

నవ్వు(Laughter) వెనుక ఉన్న సైన్స్..ఒక నెల రోజులు ఈ లాఫ్టర్ థెరపీ కొనసాగిన తర్వాత, ఆఫీసు వాతావరణమే మారిపోయింది. ఒకప్పుడు నిశ్శబ్దంగా ఉన్న ఆఫీస్ ఇప్పుడు నవ్వులతో, సరదా కబుర్లతో నిండిపోయింది. ఆశ్చర్యకరంగా, ఉద్యోగుల ప్రొడక్టివిటీ 30% పెరిగింది. స్ట్రెస్ లెవెల్స్ గణనీయంగా తగ్గాయి. దీని వెనుక సైంటిఫిక్ కారణం ఉంది.

మనం మనస్ఫూర్తిగా నవ్వి(Laughter)నా, లేదా కేవలం నవ్వుతున్నట్లుగా నటించినా, మన మెదడుకు నేను సంతోషంగా ఉన్నాననే సిగ్నల్ వెళ్తుంది. దాంతో మెదడు వెంటనే ఎండార్ఫిన్స్, డోపమిన్, సిరోటోనిన్ వంటి హ్యాపీ హార్మోన్స్‌ను విడుదల చేస్తుంది. ఇవి సహజసిద్ధమైన పెయిన్‌కిల్లర్స్‌లా పనిచేస్తాయి. అంతేకాకుండా, నవ్వడం వల్ల గుండె వేగం బ్యాలెన్స్ అవుతుంది, శరీరానికి ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది, ఇది మనసును ప్రశాంతంగా ఉంచుతుంది.

Laughter
Laughter

చాలామంది మొదట్లో నటిస్తూ నవ్వినా.. రెండు, మూడు నిమిషాల్లోనే ఆ నవ్వు నిజమైనదనే సంకేతాలు మెదడుకి పంపడంతో అది నిజమైన నవ్వుగానే మారిపోతుంది. ఒక గుంపులో అయితే నవ్వు ఇంకా సులభంగా వ్యాపిస్తుంది, ఎందుకంటే నవ్వు ఒక అంటువ్యాధి (Contagious) లాంటిది. ఒకరు నవ్వితే, వెంటనే అందరూ నవ్వడం మొదలుపెడతారు.

లాఫ్టర్(Laughter) యోగా అనే ఒక అద్భుతమైన టెక్నిక్ మన భారతదేశంలోనే పుట్టింది. ఇది ప్రపంచమంతటా ప్రాచుర్యం పొందింది. సైకాలజిస్టులు, డాక్టర్లు కూడా డిప్రెషన్, యాన్క్షయిటీ వంటి మానసిక సమస్యలకు చికిత్సగా దీన్ని సిఫార్సు చేస్తున్నారు. కేవలం 15 నిమిషాలు మనస్ఫూర్తిగా నవ్వితే, ఒక మైలు జాగింగ్ చేసినంత లాభం ఉంటుందని స్టడీస్ చెబుతున్నాయి.

జీవితంలో సమస్యలు, సవాళ్లు అనేవి సర్వసాధారణం. కానీ, నవ్వు అనేది ఒక చిన్న పెట్టుబడి లాంటిది. అది మన ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, సంబంధాలు, overall మూడ్ మీద మంచి ప్రభావం చూపుతుంది. మీకు నవ్వు సహజంగా వచ్చినప్పుడు నవ్వడం అనేది ఒక ఆరోగ్యకరమైన ఎంపిక. అది నిజమైన విశ్రాంతిని ఇస్తుంది. నవ్వు అనేది మనల్ని మనం ఫన్నీగా, తేలికగా ఎంజాయ్ చేయడానికి ఒక గొప్ప మార్గం. కాబట్టి, ప్రతి చిన్నదానికి నవ్వడం నేర్చుకుంటే, జీవితం చాలా సులభంగా అనిపిస్తుంది. నవ్వుతూ బ్రతకడం ఒక మంచి అలవాటు మాత్రమే కాదు, ఒక గొప్ప జీవిత కళ కూడా.

Surgery :సర్జరీ తర్వాత వచ్చే సమస్యలను ముందే కనిపెట్టే మైసర్జరీరిస్క్

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button