Mentally fit:మీరు మెంటల్లీ ఫిట్‌గా ఉండాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి
Mentally fit:చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు,వీడియోలు చూసి తమజీవితాలతో పోల్చుకుంటారు. ఇతరుల జీవితాలతో మన జీవితాన్ని పోల్చుకోవడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది.

Mentally fit
శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో, మానసిక ఆరోగ్యం (mentally fit)కూడా అంతే ముఖ్యం. మానసిక ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు ఇప్పుడు చాలామందిని వేధిస్తున్నాయి. అయితే, మానసిక ఆరోగ్యం అంటే కేవలం మానసిక సమస్యలు లేకపోవడం మాత్రమే కాదు, జీవితంలోని ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కోవడం, సానుకూలంగా జీవించడం.
మానసిక ఆరోగ్యం(mentally fit) దెబ్బతింటే అది మన పనితీరు, సంబంధాలు, శారీరక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. అందుకే దీనిని జాగ్రత్తగా చూసుకోవాలి.ఓపెన్‌గా మాట్లాడటం నేర్చుకోవాలి. మీకు బాధగా ఉన్నప్పుడు, మీ భావాలను స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకోండి. ఇది మనసులోని భారాన్ని తగ్గిస్తుంది.
ఆహ్లాదకరమైన పనులు చేయాలి. మీకు నచ్చిన పనులు చేయడం వల్ల మనసు ఉల్లాసంగా ఉంటుంది. హాబీలు, పెయింటింగ్, మ్యూజిక్ వినడం వంటివి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

ప్రతిరోజూ కొంత సమయం ధ్యానం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా, ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి.అలాగే వ్యాయామం చేయడం వల్ల ఎండోర్ఫిన్స్ అనే హార్మోన్లు విడుదలయ్యి, మనసుకు ఆనందాన్ని ఇస్తాయి.
సోషల్ మీడియాకు విరామం ఇవ్వడం ముఖ్యం. చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు,వీడియోలు చూసి తమజీవితాలతో పోల్చుకుంటారు. ఇతరుల జీవితాలతో మన జీవితాన్ని పోల్చుకోవడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. అందుకే సోషల్ మీడియాకు అప్పుడప్పుడు విరామం ఇవ్వడం మంచిది.
మానసిక ఆరోగ్యం ఒక గమ్యం కాదు, అది ఒక ప్రయాణం. దీనిపై దృష్టి పెట్టడం వల్ల మనం మరింత ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవితాన్ని గడపగలం.