Just NationalJust Political

DMK: తొక్కిసలాట వెనుక డీఎంకే కుట్ర సీబీఐ విచారణ కోరుతూ టీవీకే పిటిషన్

DMK: చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న డీఏంకే పార్టీ ఇటువంటి ఆరోపణలు చేసేవారు ముందు తమ పార్టీ నాయకత్వం గురించి ఆత్మపరిశీలన చేసుకోవాలంటూ విమర్శలు గుప్పించింది.

DMK

శనివారం రాత్రి తమిళనాడులో టీవీకీ అధినేత, నటుడు విజయ్ ర్యాలీలో తొక్కిసలాట జరిగి 40 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది. విజయ్ ఆలస్యంగా రావడంతోనే తొక్కిసలాట జరిగిందని డీఎంకే ఆరోపిస్తే… పోలీసులు పర్మిషన్ ఇరుకు రోడ్డులో ఇచ్చారంటూ విజయ్ పార్టీ వర్గీయులు మండిపడుతున్నారు. తాజాగా ఈ ఘటనకు సంబంధించి కీలక పరిణామాలు చోటేసుకుంటున్నాయి. ఈ ఘటన వెనుక డీఎంకే(DMK) కుట్ర ఉందని టీవీకే పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది.

దీని కోసం మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తొక్కిసలాట ఘటనపై అనుమానాలున్నాయని, సిట్ లేదా సీబీఐకి ఈ కేసు విచారణ బదిలీ చేయాలని కోరింది. తాము భద్రతా నియమాలను ఉల్లంఘించామని డీఏంకే చేస్తున్న తప్పుడు ప్రచారాన్నినమ్మొద్దని కోరుతోంది.

DMK
DMK

తొక్కిసలాట ఘటన వెనుక కుట్ర ఉందనడానికి తమ దగ్గర కొన్ని ఆధారాలున్నాయని టీవీకీ పార్టీ చెబుతోంది. కోర్టు దీనిపై స్పందించి స్వతంత్ర కమిటీతో విచారణ లేదా సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది. అయితే తమిళనాడు పోలీసుల విచారణపై నమ్మకం లేదా అన్న ప్రశ్నకు టీవీకే పార్టీ ప్రతినిధులు ఆచితూచి స్పందించారు. ఈ ఘటన వెనుక కుట్ర ఉన్నట్టు స్థానిక ప్రజలు ఇచ్చిన కొన్ని ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్‌లతో తమకు అర్థమైందనీ చెబుతున్నారు. కరూర్ జిల్లాల్లోని అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులకు ఈ కుట్రతో సంబంధం ఉందని ఆరోపిస్తోంది. దీని కోసమే సీబీఐ విచారణ కోరుతున్నట్టు తెలిపింది.

మరోవైపు టీవీకే పార్టీ చేస్తున్న కుట్ర ఆరోపణలను డీఎంకే తోసిపుచ్చింది. దురదృష్టకరంగా జరిగిన ఈ ఘటనను తాము రాజకీయం చేయాలని అనుకోవడం లేదని చెబుతోంది. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న డీఏంకే(DMK) పార్టీ ఇటువంటి ఆరోపణలు చేసేవారు ముందు తమ పార్టీ నాయకత్వం గురించి ఆత్మపరిశీలన చేసుకోవాలంటూ విమర్శలు గుప్పించింది. కాగా శనివారం మధ్యాహ్నపై కరూర్ కు రావాల్సిన నటుడు విజయ్ రాత్రి 7 గంటలకు రావడంతో అంచనాలకు మించి జనం వచ్చేశారు.

ఆ ప్రాంతంలో 10 వేల మందికంటే ఎక్కువ జనం పట్టకపోవడంతో క్రౌడ్ పెరిగి తొక్కిసలాటకు దారితీసింది. దేశచరిత్రలో తొక్కిసలాట ఘటనలకు సంబంధించి ఇదొక విషాదంగా మిలిగిపోయింది. అటు ప్రభుత్వం 10 లక్షలు , విజయ్ పార్టీ టీవీకే 20 లక్షల చొప్పున మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి 2 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించాయి

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button