Cracked Heels : పగుళ్లతో ఇబ్బంది పడుతున్నారా?.. సాఫ్ట్ పాదాలను పొందే ఇంటి టిప్స్ ఇవే..
Cracked Heels : ఇంట్లో ఎప్పుడూ అవైలబుల్‌గా ఉండే కొబ్బరి నూనె, వాజెలిన్, లేదా గ్లిజరిన్ మిశ్రమాన్ని పాదాలకు అప్లై చేయడం వల్ల స్కిన్‌కు మంచి తేమ అందుతుంది.
Cracked Heels
చాలామంది ఫేస్‌కి ఇచ్చినంత ప్రాధాన్యత పాదాలకు ఇవ్వరు. ఎక్కువసేపు నిలబడి పనిచేయడం, చెప్పులు లేకుండా నడవడం, వాతావరణంలో మార్పుల వల్ల తేమను కోల్పోయి మడమలు పగిలిపోతూ ఉంటాయి.
ఈ సమస్యను మొదటిలోనే పట్టించుకోకపోతే పగుళ్లు లోతుగా మారి నడవలేనంత నొప్పిని కలిగేలా చేస్తాయి. బ్యూటీ పార్లర్లకు వెళ్లి వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పని లేకుండా, ఇంట్లో దొరికే వస్తువులతోనే పాదాలను స్మూత్‌గా మార్చుకునే ఈజీ టిప్స్ తెలుసుకుందాం.
పాదాల పగుళ్లను(Cracked Heels) తగ్గించుకోవడానికి ఫస్ట్ స్టెప్.. వాటిని శుభ్రం చేయడమే. బకెట్‌లో కాస్త గోరువెచ్చని నీళ్లు తీసుకుని అందులో పాదాలను 10 నుంచి 15 నిమిషాల పాటు నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల మడమల దగ్గర ఉన్న గట్టి చర్మం, డెడ్ స్కిన్ మెత్తబడుతుంది.
ఆ తర్వాత ప్యూమిస్ స్టోన్ లేదా ఫుట్ ఫైల్ ఉపయోగించి డెడ్ స్కిన్‌ను మెల్లగా రుద్ది తొలగించాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, పగుళ్లున్న చోట గట్టిగా రుద్దకూడదు. అలా చేస్తే బ్లడ్ వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి చాలా సున్నితంగా స్క్రబ్ చేయాలి.
స్క్రబ్బింగ్ అయిన తర్వాత పాదాలను పొడి బట్టతో తుడుచుకుని ఆరాక మాయిశ్చరైజర్ రాయాలి. అలాగే ఇంట్లో ఎప్పుడూ అవైలబుల్‌గా ఉండే కొబ్బరి నూనె, వాజెలిన్, లేదా గ్లిజరిన్ మిశ్రమాన్ని మడమలకు అప్లై చేయడం వల్ల స్కిన్‌కు మంచి తేమ అందుతుంది.
ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు ఈ నూనె లేదా క్రీమ్ రాసి, కాటన్ సాక్స్ వేసుకుని పడుకోవాలి.ఇలా చేయడం వల్ల తేమ బయటకు పోకుండా చర్మం లోపలికి ఇంకుతుంది. దీనివల్ల కేవలం కొద్ది రోజుల్లోనే పగుళ్లు తగ్గి పాదాలు స్మూత్‌గా మారతాయి.

వీటితో పాటు చాలా మంది ఇంట్లో పెంచుకునే కలబందను కూడా పాదాలకు అప్లై చేయొచ్చు. అలోవెరా జెల్, తేనె, బాగా పండిన అరటిపండు గుజ్జు వంటివి కూడా డ్రై స్కిన్‌ను రిపేర్ చేయడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ఇవన్నీ ఒకెత్తయితే, లోపలి నుంచి చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడం కోసం రోజూ తగినన్ని నీళ్లు తాగడం చాలా ముఖ్యం.
ఇంట్లో ఉన్నప్పుడు కూడా సౌకర్యవంతమైన సాఫ్ట్ చెప్పులు వేసుకుని నడవడం అలవాటు చేసుకోవాలి. అయితే పగుళ్లు(Cracked Heels) మరీ లోతుగా ఉన్నా, పాదాల నుంచి రక్తం కారుతున్నా లేదా మధుమేహం వంటి సమస్యలు ఉన్నా.. సొంత వైద్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.
Katuruva : మటన్ ధరను దాటేసిన అడవి కూరగాయ.. కిలో రూ. వెయ్యి దాటినా ఎందుకంత క్రేజ్?





