Just CrimeJust NationalLatest News

Roopkund Lake:హిమాలయాల్లో అస్థిపంజరాల సరస్సు..రూప్‌కుండ్ రహస్యం ఏంటి?

Roopkund Lake: నిర్జనమైన ఆ ఎత్తైన మంచు పర్వతాల మధ్య, అన్ని వందలాది అస్థిపంజరాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వారెవరు? ఎలా చనిపోయారు?

Roopkund Lake

భారతదేశం అంతుచిక్కని రహస్యాల నిలయమనే విషయం చాలామందికి తెలీదు. అందులోనూ హిమాలయాల మంచు పర్వతాల మధ్య దాగి ఉన్న మర్మాలు ఇంకా ఎన్నో ఉంటాయి. ముఖ్యంగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గల చమోలి జిల్లాలో, సముద్ర మట్టానికి దాదాపు 16 వేల అడుగుల ఎత్తులో ఉండే రూప్‌కుండ్ సరస్సు(Roopkund Lake).. అటువంటి ఒక భయంకరమైన మిస్టరీకి చిరునామాగా చెబుతారు స్థానికులు.

ఈ సరస్సును అస్థిపంజరాల సరస్సు (Skeleton Lake) అని పిలుస్తారు. ఏటా వేసవి కాలంలో అక్కడి మంచు కరిగినప్పుడు, ఆ రూప్‌కుండ్ సరస్సు(Roopkund Lake) అడుగు భాగాన , దాని ఒడ్డున వందలాది మనుషుల అస్థిపంజరాలు బయటపడతుండటమే దీనికి కారణం. నిర్జనమైన ఆ ఎత్తైన మంచు పర్వతాల మధ్య, అన్ని వందలాది అస్థిపంజరాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వారెవరు? ఎలా చనిపోయారనే ప్రశ్నలు దశాబ్దాల తరబడి శాస్త్రవేత్తలకు, చరిత్రకారులకు సవాలుగానే నిలుస్తున్నాయి.

1942లో ఒక ఫారెస్ట్ రేంజర్ మొట్టమొదటిసారిగా ఈ అస్థిపంజరాలను చూసనపుడు, అవి రెండో ప్రపంచ యుద్ధ కాలంలో దారి తప్పి వచ్చిన జపాన్ సైనికులవని అందరూ అనుకున్నారు. కానీ బ్రిటిష్ ప్రభుత్వం జరిపిన పరిశోధనల్లో ఆ అస్థిపంజరాలు ఇంకా చాలా పాతవని తేలింది. ఆ తర్వాత కాలంలో లేటెస్ట్ టెక్నాలజీతో చేసిన కార్బన్ డేటింగ్ , డీఎన్ఏ పరీక్షలలోవిస్తుపోయే నిజాలను వెలుగులోకి తెచ్చాయి.

ఆ అస్థిపంజరాలు క్రీస్తుశకం 800 నుంచి 900 సంవత్సరాల మధ్య కాలానికి చెందినవని అంతేకాదు..అవి వేర్వేరు జాతులకు చెందిన వ్యక్తులవని తేలింది. అంటే సుమారు 1200 ఏళ్ల క్రితమే అంతమంది అక్కడ మరణించారన్న మాట. అలా చనిపోయినవారి మరణానికి కారణం ఏదైనా యుద్ధమా, లేదా అంటువ్యాధి వంటివా అని అనుమానించారు. కానీ చిత్రంగా అస్థిపంజరాలపై ఎటువంటి కత్తుల గాయాలు గానీ, వ్యాధి లక్షణాలు గానీ ఏమీ కనిపించలేదు.

అయితే విచిత్రంగా అస్థిపంజరాల పుర్రెలపై ఉన్న గాయాలను ఇంకాస్త జాగ్రత్తగా పరిశీలించినప్పుడు, అవన్నీ ఏదో గుండ్రటి వస్తువుతో బలంగా కొట్టడం వల్ల ఏర్పడినట్లుగా గుర్తించారు. దీనితో శాస్త్రవేత్తలు అది ఒక భారీ ప్రకృతి వైపరీత్యం అని ఒక సంచలన ముగింపునకు వచ్చారు.

Roopkund Lake
Roopkund Lake

అంటే సుమారు తొమ్మిదో శతాబ్దంలో ఒక చాలా పెద్ద బృందంతో బయలుదేరిన వారు .. ఆ ప్రాంతం వైపు మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు, అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఒక్కసారిగా ఎవరూ ఊహించని రీతిలో భారీ వడగళ్ల వాన కురిసినట్లు తేల్చారు. ఆ వడగళ్లు మామూలువి కావని, ఏకంగా క్రికెట్ బంతి అంత సైజులో ఉండి, అత్యంత వేగంతో వారి తలలపై పడ్డాయి.

ఆ సమయంలో ఆ మంచు పర్వతాల మధ్య తల దాచుకోవడానికి చెట్లు గానీ, ఇండ్లు వంటి షెల్టర్లు గానీ ఏమీ లేకపోవడంతో వారంతా ఆ వడగళ్ల దెబ్బలకు అక్కడికక్కడే ప్రాణాలు వదిలినట్లు తేల్చారు. కాలక్రమేణా మంచులో కలిసిపోయిన ఆ మృత దేహాలు, మంచు కరిగినప్పుడల్లా అందరికీ నేటికీ కూడా కనిపిస్తూ ఆనాటి భీభత్సాన్ని గుర్తు చేస్తూనే ఉంటున్నాయి. అలా హిమాలయాల గర్భంలో దాగి ఉన్న ఈ మిస్టరీ సరస్సు ఇప్పటికీ ప్రపంచ పర్యాటకులను, పరిశోధకులను ఆశ్చర్యపరుస్తూనే ఉంది.

Hyderabad Metro:హైదరాబాద్ మెట్రోలో సర్కారీ పాలన.. ఇకపై పూర్తి ప్రైవేటు రహితంగా మెట్రో

Related Articles

Back to top button