Just PoliticalJust NationalLatest News

Sasikala: శశికళ కొత్త పార్టీ? ..2026 ఎన్నికలే లక్ష్యంగా చిన్నమ్మ వ్యూహం ?

Sasikala: మరోవైపు పన్నీర్ సెల్వం (OPS) వంటి నాయకులు కూడా శశికళతో జతకట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Sasikala

తమిళనాడు రాజకీయాల్లో కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు తెర దించుతూ, మాజీ సీఎం జయలలిత అత్యంత సన్నిహితురాలు వీకే శశికళ తన పొలిటికల్ ఫ్యూచర్‌పై కీలక సంకేతాలు ఇచ్చారు. ఫిబ్రవరి 24న జయలలిత జయంతిని పురస్కరించుకుని నివాళులర్పించిన శశికళ(Sasikala), అతి త్వరలోనే ఒక శుభవార్త వింటారని ప్రకటించారు.

దీని ద్వారా కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటును సుమారు ఖరారు చేసినట్లే అన్న వార్తలు వినిపించాయి. అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన తర్వాత, పార్టీని మళ్లీ తన చేతుల్లోకి తీసుకోవడానికి శశికళ చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో, ఇప్పుడు ఒక రాజకీయ శక్తిగా ఎదగడానికి ఆమె నిర్ణయించుకున్నారు. రాజకీయ వర్గాల్లో అమ్మా పేరై పార్టీ (APP) అనే పేరు వినిపిస్తున్నా, పార్టీ పేరు , జెండాపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది

అయితే ఈసారి తమిళనాడు ఎన్నికలకు కేవలం ద్రావిడ పార్టీలే కాకుండా, దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) కూడా ఉండటంతో.. శశికళ వ్యూహాలకు ఒక సవాల్‌గా, అదే సమయంలో ఒక ఛాన్స్‌గా మారింది. విజయ్ ఎంట్రీ వల్ల అధికార డీఎంకే , అన్నాడీఎంకే ఓట్లు చీలిపోతే, అది శశికళకు కలిసివచ్చే అంశం.

ముఖ్యంగా ఆమె బలంగా ఉన్న దక్షిణ తమిళనాడులోని ముక్కులత్తోర్ సామాజిక వర్గ ఓటర్లను తనవైపు తిప్పుకోవడం ద్వారా 2026 ఎన్నికల్లో కింగ్ మేకర్‌గా మారాలని ఆమె భావిస్తున్నారు. అయితే, యువత , మహిళా ఓటర్లు విజయ్ వైపు ఆకర్షితులైతే, అది శశికళ పార్టీకి కొంత మైనస్ అయ్యే ప్రమాదం కూడా ఉంది.

Sasikala
Sasikala

శశికళ(Sasikala) ప్రస్తుతం అక్రమాస్తి కేసులో శిక్షా కాలం తర్వాత ఉన్న అనర్హత వేటు కారణంగా 2027 వరకు నేరుగా ఎన్నికల్లో పోటీ చేయలేరు. అయినా సరే, ఒక శక్తివంతమైన వ్యూహకర్తగా వెనుక ఉండి కనీసం 40 కి పైగా స్థానాల్లో తన అభ్యర్థులను నిలబెట్టాలని ఆమె ప్రణాళికలు సిద్ధం చేశారు.

తమిళనాడు వ్యాప్తంగా 500 శాఖలను ప్రారంభించి, జయలలిత అమ్మా మోడల్ పాలనను మళ్లీ తీసుకురావడమే లక్ష్యంగా శశికళను అడుగులు వేస్తున్నారు. మరోవైపు పన్నీర్ సెల్వం (OPS) వంటి నాయకులు కూడా శశికళతో జతకట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి శశికళ అనుభవం, విజయ్ క్రేజ్ మధ్య 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఒక రసవత్తర పోరాటానికి వేదిక కాబోతున్నాయి.

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button