Raj Shamani:రాజ్ షమానీ ఎవరు? వరల్డ్ వైడ్ న్యూస్ ఛానల్స్‌కు అతనెలా సవాల్ విసురుతున్నాడు?
Raj Shamani : ఒక సాదా సీదా యువకుడు.. చేతిలో మైక్ పట్టుకుని కూర్చుంటే, ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ నుంచి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యువెల్ మాక్రాన్ వరకు ఇంటర్వ్యూ ఇస్తారని ఎవరైనా అనుకుంటారా?
Raj Shamani
ఒక సాదా సీదా యువకుడు.. చేతిలో మైక్ పట్టుకుని కూర్చుంటే, ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ నుంచి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యువెల్ మాక్రాన్ వరకు ఇంటర్వ్యూ ఇస్తారని ఎవరైనా అనుకుంటారా? దేశ విదేశీ టాప్ మీడియా సంస్థలకే సాధ్యం కాని విధంగా.. అతిపెద్ద సెలబ్రిటీలను తన పాడ్‌కాస్ట్ కి రప్పిస్తూ సోషల్ మీడియా ప్రపంచంలో ఒక సెన్సేషన్‌గా మారాడు రాజ్ షమాని(Raj Shamani).
కేవలం 28 ఏళ్ల వయస్సులోనే ఫిగరింగ్ అవుట్ (Figuring Out) అనే పాడ్‌కాస్ట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ యువకుడి ప్రస్థానం ప్రతి ఒక్కరికీ విచిత్రంగానే ఉంటుంది. అగ్ర హీరోలు అమీర్ ఖాన్, కరణ్ జోహార్, అంతరిక్ష యాత్రికురాలు సునీతా విలియమ్స్, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ వంటి మేధావులు కూడా రాజ్ షమాని అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.
రాజ్ షమాని ప్రస్థానం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నుంచి మొదలైంది. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన రాజ్, కేవలం 16 ఏళ్ల వయస్సులోనే వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాడు. తన తండ్రి దగ్గర 10 వేల రూపాయలు అప్పు తీసుకుని ..జాదూగర్ డ్రాప్ అనే డిష్ వాష్ సబ్బుల వ్యాపారాన్ని ప్రారంభించాడు.
అతి కొద్ది కాలంలోనే తన వ్యాపారాన్ని 200 కోట్ల టర్నోవర్ స్థాయికి తీసుకెళ్లడం రాజ్ షమాని(Raj Shamani) బిజినెస్ ఎఫిషియన్సీకి నిదర్శనం. బహుశా తాను ఒక సక్సెస్ ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ కావడం వల్లే, రాజ్ అడిగే ప్రశ్నల్లో ఒక రకమైన లోతు, నిజాయితీ కనిపిస్తాయి. తన వైఫల్యాలను కూడా దాచుకోకుండా బహిరంగంగా చర్చించడం వల్ల యువత ఆయనకు విపరీతమైన ఫ్యాన్స్ అయిపోయారు.
అసలు రాజ్ షమాని ఇంతలా ఎలా ఫేమస్ అయ్యాడని చూస్తే.. ఆయన అనుసరించే సిస్టమాటిక్ అప్రోచ్ మెయిన్ రీజన్. ఏ గెస్ట్ వచ్చినా వారి గురించి లోతుగా రీసెర్చ్ చేయడం, వారికి ఒక కొత్త విలువను (Value) జోడించడం రాజ్ స్పెషాలిటీ. ముఖ్యంగా దేశం విడిచి వెళ్లిపోయిన విజయ్ మాల్యాతో.. రాజ్ చేసిన నాలుగు గంటల సుదీర్ఘ పాడ్‌కాస్ట్ ఒక సెన్సేషన్ అయింది.

ఇప్పటివరకు ఏ నేషనల్ మీడియా కవర్ చేయని కోణాలను రాజ్ ఆ ఇంటర్వ్యూలో ఆవిష్కరించారు. ఆ ఒక్క ఎపిసోడ్ కి 26 మిలియన్ల వ్యూస్ రావడం రాజ్ షమాని కెరీర్ లోనే ఒక టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. ప్రొఫెషనల్ టీమ్ తో పని చేస్తూ, కంటెంట్ మార్కెటింగ్ లో ఎక్స్‌పర్ట్ గా పేరు తెచ్చుకున్న రాజ్‌కు అన్ని ప్లాట్‌ఫారమ్‌లలో కలిపి 18 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.
ఇక వ్యక్తిగత వివరాల్లోకి వెళ్తే.. రాజ్ షమాని 1996లో ఇండోర్ లో జన్మించాడు. చదువులో యావరేజ్ స్టూడెంట్ అయినా.. కమ్యూనికేషన్ స్కిల్స్ లో మాత్రం టాప్‌లోనే ఉండేవాడు. రాజ్ సంవత్సర ఆదాయం సుమారు 15 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. ఒక కంటెంట్ క్రియేటర్ గానే కాకుండా, ఇన్వెస్టర్ గా, మోటివేషనల్ స్పీకర్ గా ఎదుగుతున్న రాజ్ .. అతి త్వరలోనే యావత్ ప్రపంచంలోనే నంబర్ వన్ పాడ్‌కాస్టర్ అవుతారని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.



