Just EntertainmentJust NationalLatest News

Prathyusha:నటి ప్రత్యూష కేసులో రెండు దశాబ్దాల తర్వాత సుప్రీంకోర్టు తుది తీర్పు.. ఆ తల్లి పోరాటం ఫలించినట్లేనా?

Prathyusha: 2002 ఫిబ్రవరిలో జరిగిన ప్రత్యూష విషయం జరిగిన విషాద ఘటన ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో మరోసారి వార్తల్లోకి వచ్చింది.

Prathyusha

టాలీవుడ్ యువ నటి ప్రత్యూష(Prathyusha) మరణం తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు పెద్ద సంచలనాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే. 2002 ఫిబ్రవరిలో జరిగిన ఈ విషాద ఘటన ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో మరోసారి వార్తల్లోకి వచ్చింది. 2002 ఫిబ్రవరిలో ప్రత్యూష ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. కాదు ముమ్మాటికీ హత్యేనని ఆమె తల్లి అప్పుడే మీడియా ముందు ఆక్రోశించింది.

అయితే ప్రత్యూష (Prathyusha)తాను ప్రేమించుకున్నామని.. అయితే తమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో, ఇద్దరం కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని కూల్ డ్రింకులో పురుగుల మందు కలుపుకుని తాగామని అప్పట్లో ప్రత్యూష ప్రియుడు అనబడే సిద్ధార్థ రెడ్డి పోలీసులకు తెలిపాడు. చికిత్స పొందుతూ ప్రత్యూష మరణించడం, సిద్ధార్థ రెడ్డి మాత్రం ప్రాణాలతో బయటపడటంతో… అప్పట్లోనే ప్రత్యూష తల్లి సరోజిని దేవి ఇది ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్య అని ఆరోపించారు. అంతేకాదు తన కూతురిపై అత్యాచారం కూడా జరిగిందని ఆరోపించడంతో ఈ కేసు ఒక్కసారిగా మలుపు తిరిగింది.

ఈ కేసు విచారణ సుమారు 24 ఏళ్ల పాటు వివిధ కోర్టుల చుట్టూ తిరిగింది. ముందు ఈ కేసును విచారించిన కింది కోర్టు.. సిద్ధార్థ రెడ్డిని దోషిగా నిర్ధారించి శిక్ష విధించింది. ఆ తర్వాత ఇదే కేసు హైకోర్టుకు చేరింది. అయితే హైకోర్టులో మాత్రం ప్రత్యూష కేసులో అత్యాచారం, హత్య ఆరోపణలు సాక్ష్యాధారాల లేమితో కొట్టివేయబడ్డాయి.

Prathyusha
Prathyusha

కానీ, ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు (Abetment of Suicide)అలాగే ఆత్మహత్యాయత్నం చేసినందుకు సిద్ధార్థ రెడ్డికి రెండేళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ 2004లో తీర్పు ఇచ్చింది. అయితే హైకోర్టు ఇచ్చిన ఆ రెండేళ్ల శిక్షను కూడా రద్దు చేయమని.. తాను నిర్దోషినని చెబుతూ సిద్ధార్థ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.

కానీ సిద్ధార్థ రెడ్డి వేసిన ఈ అప్పీల్‌ను సవాలు చేసిన ప్రత్యూష తల్లి సరోజిని దేవి .. అతడికి శిక్ష తగ్గించడం కాదు.. ఇంకా పెంచాలని సుప్రీంకోర్టులో తన న్యాయ పోరాటాన్ని కొనసాగించారు. దీనిపై ఇన్నేళ్ల పాటు విచారణ కొనసాగింది. ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ఇచ్చిన శిక్షను సమర్థిస్తూ, సిద్ధార్థ రెడ్డి నాలుగు వారాల్లోగా కోర్టు ముందు లొంగిపోవాలని ఆదేశించింది.

భారతదేశ న్యాయ వ్యవస్థలో ఉన్న అప్పీళ్ల ప్రక్రియ, సాక్షుల విచారణలో ఆలస్యంతో పాటు ఫోరెన్సిక్ రిపోర్టుల చుట్టూ జరిగిన వివాదాలతో తీర్పు విచారణకు ఇన్నాళ్లు పట్టింది. అయితే ఈ విషయంపై ప్రత్యూష తల్లి సరోజిని దేవి తన కూతురికి అన్యాయం జరిగిందంటూ పదేపదే వాపోతూనే ఉంటుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో సిద్ధార్థ రెడ్డికి శిక్ష ఖరారు కావడం కాస్త ఊరటనిచ్చే అంశమే అయినా.. ఆమె ఆరోపించినట్లుగా ఇది హత్య అని నిరూపించే బలమైన ఆధారాలు కోర్టులో నిలబడకపోవడంతో కేవలం ఆత్మహత్య ప్రేరణ కిందే శిక్ష పడింది. దీంతో ఆ తల్లికి కొంత అసంతృప్తిని మిగిల్చినా, నిందితుడు జైలుకు వెళ్లడం మాత్రం తప్పలేదు.

మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button