Hare Krishna:హరే కృష్ణ హరే కృష్ణ నామం అంత పవర్ ఫుల్‌నా? మరి సైన్స్ ఇదే చెబుతుందా?
Hare Krishna: మనిషిలోని కోపం, అసూయ, స్వార్థం వంటి మలినాలన్నీ హరే కృష్ణ హరే కృష్ణ.. కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ.. రామ రామ హరే హరే నామస్మరణ అనే గంగలో కడిగివేయబడతాయి.
Hare Krishna
చాలామంది హరే కృష్ణ హరే కృష్ణ(Hare Krishna).. కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ.. రామ రామ హరే హరే అనే ఈ దివ్య నామాన్ని మనలో చాలామంది నిత్యం పఠిస్తూ ఉంటారు. అయితే కేవలం నోటితో పలికే అక్షరాలు మాత్రమే కాదు. ఇది అనంతమైన ఆధ్యాత్మిక శక్తి కలిగిన ఒక శబ్ద తరంగం అని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతూ ఉంటారు.
ఎందుకంటే ఈ సృష్టిలో భగవంతునికి, ఆయన పేరుకు మధ్య ఎటువంటి తేడా కనిపించదు. కానీ మన దగ్గర వస్తువు వేరు, దాని పేరు వేరుగా ఉండొచ్చు కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో మాత్రం భగవంతుడే అద్వితీయుడు. అంటే, కృష్ణ అనే పేరును ఉచ్ఛరించినపుడు అక్కడ సాక్షాత్తూ ఆ కృష్ణ పరమాత్మే కొలువై ఉంటాడు. ఈ దివ్యమైన శబ్దానికి, ఆ నీలమేఘ శ్యామునికి మధ్య అణుమాత్రం కూడా భేదం లేదని పండితులు చెబుతుంటారు.
ఈ దివ్య నామ సంకీర్తన ద్వారా మనమంతా భగవంతుడిని మన హృదయ మందిరంలోకి ఆహ్వానించే పనిని మాత్రమే చేయాలి. మనసు ఎంత కల్లోలంగా ఉన్నా, జీవితం ఎన్ని కష్టాల్లో ఉన్నా ఈ మంత్రాన్ని శ్రద్ధగా జపిస్తే చాలట.. ఆ భగవంతుడే స్వయంగా వచ్చి మన చేతిని పట్టుకుంటాడని పండితులు చెబుతారు.
మనమందరం ఎప్పుడైతే పరిపూర్ణమైన భక్తితో, ఆర్తితో ఆ స్వామివారి నామాన్ని జపిస్తూ ఉంటామో, ఆ క్షణమే కృష్ణభగవానుడు మన తోడుగా ఉంటాడని అర్థం. లోకంలో అగ్ని దగ్గరకు వెళ్తే చలి ఎలా మాయమవుతుందో, వెలుగు వస్తే చీకటి ఎలా పారిపోతుందో.. అలాగే సాక్షాత్తూ ఆ కృష్ణ పరమాత్మ మన చెంతగా ఉన్నప్పుడు మనలోని అపవిత్రత అలాగే దూరం అవుతుంది.
మనిషిలోని కోపం, అసూయ, స్వార్థం వంటి మలినాలన్నీ హరే కృష్ణ హరే కృష్ణ.. కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ.. రామ రామ హరే హరే నామస్మరణ అనే గంగలో కడిగివేయబడతాయి. భగవంతుడు పరమ పవిత్రుడు, అత్యంత శుద్ధమైన వాడు. అటువంటివాడు మన హృదయంలో కొలువై ఉన్నప్పుడు, మన మనసు కూడా పవిత్ర గంగలా స్వచ్ఛంగా మారుతుందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.
ఇక దీనిని శాస్త్రీయ కోణంలో చూస్తే, హరే కృష్ణ హరే కృష్ణ(Hare Krishna).. కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ.. రామ రామ హరే హరే అని వినిపించే శబ్దానికి పదార్థాన్ని మార్చే శక్తి ఉంటుంది.అందులో ప్రతీ అక్షరం,ప్రతీ శబ్దం ఒక నిర్దిష్టమైన ఫ్రీక్వెన్సీలో కంపనాలను (Vibrations) పుట్టిస్తాయి. మనం హరే కృష్ణ మంత్రాన్ని జపిస్తున్నప్పుడు, ఆ శబ్ద తరంగాలు మెదడులోని నాడులను ఉత్తేజితం చేసి, అవి ఒత్తిడిని కలిగించే హార్మోన్లను తగ్గిస్తాయి.

అంటే ఈ మంత్రంలోని తరంగాలు మనిషి శరీరంలోని అణువుల అమరికపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయని సైన్స్ చెబుతోంది. ఇవి మన చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని (Negative Energy) తొలగించి, మనల్ని ఒక ప్రశాంతమైన స్థితికి చేరుస్తాయి. భగవంతుని నామం పలకడం వల్ల కలిగే ఆ దివ్యమైన కంపనాలు మనల్ని మానసికంగా, శారీరకంగా కూడా పవిత్రం చేస్తాయి.
హరే కృష్ణ(Hare Krishna) హరే కృష్ణ.. కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ రామ రామ హరే హరే మంత్రం.. ఒక అతీంద్రియ శబ్ద తరంగం (Transcendental Sound Vibration). ఇది కేవలం చెవులకు మాత్రమే వినిపించే శబ్దం కాదు, ఆత్మను తాకే శక్తి. మనం ఈ నామస్మరణలో ఉన్నప్పుడు, ఆ తరంగాలు మన అంతరాత్మను శుద్ధి చేసి, మనల్ని ఆధ్యాత్మికంగా ఉన్నతి స్థితికి తీసుకెళ్తాయి.
సైన్స్ ప్రకారం ధ్వని తరంగాలు ఎలాగైతే వస్తువులను ప్రభావితం చేస్తాయో, అలాగే భగవన్నామం అనే దివ్య ధ్వని మనిషి మనసులోని అశాంతిని తొలగించి శాంతిని నింపుతాది. అందుకే భగవన్నామ స్మరణ అనేది ఒక గొప్ప మానసిక చికిత్సే కాదు, మన జీవితాన్ని పవిత్రంగా మార్చే ఒక ఆధ్యాత్మిక శాస్త్రం అని తెలుసుకోవాలి.



