Just EntertainmentLatest News

Allu Arjun:బన్నీపై కామెంట్లు నా కల్పితమే..క్లారిటీ ఇచ్చిన కావేరి బరువా..ఎందుకిలా మాట మార్చారు?

Allu Arjun: కావేరి బరువాతన ఇంటర్వ్యూలో చాలా కాన్ఫిడెంట్‌గా నన్ను కలవడానికి కూడా అల్లు అర్జున్ ఒప్పుకోలేదని, ఆ 42 రూల్స్ చదివి నేను షాక్ అయ్యానని చెప్పింది.

Allu Arjun

సెలబ్రిటీల జీవితాల గురించి ఎవరైనా చిన్న నెగటివ్‌గా మాట్లాడినా, నెగిటివ్ వార్త వచ్చినా.. అది నిమిషాల్లో వైరల్ అయిపోతుంది. హీరో అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 రూల్స్ ఉంటాయని.. ఇటీవల కావేరి బరువా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం కూడా అలాగే కార్చిర్చులా స్ప్రెడ్ అయింది. బన్నీ కళ్లలోకి చూడకూడదు, షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు వంటి వింత కండిషన్లు ఉన్నాయని ఆమె ఆరోపించారు.

అయితే దీనిపై ఫైర్ అయిన అల్లు అర్జున్(Allu Arjun) టీమ్ లీగల్ నోటీసులు పంపడం, అభిమానుల నుంచి కూడా గట్టిగా వ్యతిరేకత రావడంతో ఆమె వెనక్కి తగ్గారు. ఆ 42 రూల్స్ అనేవి నా కల్పితమే, నేను ఫ్లోలో అలా అనేశానంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో క్షమాపణలు చెప్పారు.

అల్లు అర్జున్ ప్రతిష్టకు భంగం కలిగించేలా చేసిన వ్యాఖ్యలకు హృదయపూర్వక క్షమాపణలు చెబుతున్నాను. నా మాటల వల్ల అర్జున్ గౌరవానికి, ఆయన కుటుంబానికి , అభిమానులకు బాధ కలిగి ఉంటే క్షమించండి అని చెప్పుకొచ్చారు.

నిజానికి కావేరి బరువాతన ఇంటర్వ్యూలో చాలా కాన్ఫిడెంట్‌గా నన్ను కలవడానికి కూడా అల్లు అర్జున్ ఒప్పుకోలేదని, ఆ 42 రూల్స్ చదివి నేను షాక్ అయ్యానని చెప్పింది. తీరా ఇప్పుడు అవి కేవలం నా కల్పితమే అని చెప్పడం చూస్తుంటే, అల్లు అర్జున్ టీమ్ పంపిన లీగల్ నోటీసుల ప్రభావం గట్టిగానే పడినట్లు తెలుస్తోంది.

నిజానికి ఇలాంటి వారు చేసే పనిని సైకాలజీలో అటెన్షన్ సీకింగ్ (Attention Seeking) అంటారు. సెలబ్రిటీల మీద నెగెటివ్ కామెంట్స్ చేస్తే త్వరగా పాపులారిటీ వస్తుందని కొందరు అనుకుంటారు. అంతేకాదు ఈ మైండ్ సెట్ ఉన్న వాళ్లు ముందు పాపులారిటీ కోసం ఏదోదో మాట్లాడి, ఆ తర్వాత ఇబ్బందులు వస్తే మాత్రం తప్పుగా అర్థం చేసుకున్నారనే  ఓ  ముసుగు వేసుకుంటారు.

Allu Arjun
Allu Arjun

కావేరి బరువా ఇదివరకు రాయల్ ఎన్ఫీల్డ్ వంటి పెద్ద కంపెనీలతో పనిచేసినట్లు ఆమె ప్రొఫైల్ చెబుతోంది. అయితే ఇలాంటి వివాదాల్లో ఆమె పేరు రావడం ఇదే మొదటిసారి. ఇప్పుడు సోషల్ మీడియా సాక్షిగా ఆమె సారీ చెప్పినంత మాత్రాన..బన్నీకి జరిగిన డ్యామేజ్ పూర్తిగా రిపేర్ అవ్వదు.
ఎందుకంటే, ఆమె క్షమాపణలు చెప్పిన వార్త కంటే, ఆ 42 రూల్స్ ఉన్నాయన్న నెగెటివ్ వార్తే ఎక్కువ మందికి చేరిపోయింది.అదే గుర్తు పెట్టుకుంటారు. మొత్తంగా ఈ సోషల్ మీడియా కాలంలో క్లిక్ బైట్ కోసం ఏదైనా వివాదాస్పదంగా మాట్లాడటం ఒక ట్రెండ్ అయిపోయిందనేది కావేరి విషయంలో మరోసారి ప్రూవ్ అయింది.

మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button