Just LifestyleHealthLatest News

Manipulative:మోనిప్యులేటివ్ బిహేవియర్ చాలా డేంజర్ అట.. మీలో ఉందేమో చెక్ చేసుకోండి..

Manipulative :  ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ పెట్టి, ఆ ఇద్దరి మధ్య తాను మధ్యవర్తిగా ఉంటూ ఆ ఇద్దరినీ కంట్రోల్ చేస్తాడు.

Manipulative

మన చుట్టూనే ఉంటారు ..మనతో చాలా బాగా ఉంటారు. కానీ మన వెనుకే మన గురించి వేరే వారి దగ్గర , వారి గురించి మన దగ్గర చెబుతూ ఉంటారు. ఎందుకంటే మీ ఇద్దరికంటే కూడా వారే పైచేయిగా ఉండాలని వారు కోరుకుంటారు కాబట్టి. దీనికోసం వారు ఎంచుకునే మార్గం మాత్రం చాలా ప్రమాదకరమైనది. సైకాలజీలో ఇటువంటి ప్రవర్తనను ట్రయాంగులేషన్ (Triangulation), మోనిప్యులేటివ్(Manipulative) బిహేవియర్ అని పిలుస్తారు.

ట్రయాంగులేషన్‌లో ఒక వ్యక్తి ఇద్దరి మధ్య నేరుగా కమ్యూనికేషన్ జరగకుండా అడ్డుకునే మనస్తత్వం కనిపిస్తుంది. ఇందులో ఒక మ్యానిపులేటర్ (manipulator) ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ పెట్టో, తెలియని గ్యాప్ క్రియేట్ చేసో, ఆ ఇద్దరి మధ్య తాను మధ్యవర్తిగా ఉంటూ ఆ ఇద్దరినీ కంట్రోల్ చేస్తాడు.

ఉదాహరణకు ఒక స్నేహితుడి దగ్గరకు వెళ్లి నీ గురించి అవతలి వాడు ఇలా అన్నాడని చెప్పి, మళ్లీ అవతలి వాడి దగ్గరకు వెళ్లి నీ మీద వాడు పగ పడుతున్నాడు.. నేను ఉన్నాను కాబట్టి సరిపోయిందని నమ్మిస్తారు. దీనివల్ల ఆ ఇద్దరూ కూడా ఒకరినొకరు అనుమానించుకుంటూ, మధ్యలో ఉన్న ఈ మూడో వ్యక్తిని మాత్రమే నమ్ముతారు. దీనిద్వారా ఆ మ్యానిపులేటర్ ఇద్దరి పైన ఆధిపత్యం చలాయిస్తాడు. అయితే ఇది బంధాలను విచ్ఛిన్నం చేసే అత్యంత ప్రమాదకరమైన పద్ధతి అని సైకాలజీ చెబుతుంది.

వీరు చేసే మెయిన్ పనుల్లో ‘గ్యాస్ లైటింగ్’ (Gaslighting) ఒకటి. అంటే, మనమేదైనా విషయాన్ని గట్టిగా నిలదీస్తే నువ్వే తప్పుగా అర్థం చేసుకున్నావు.. అసలు అలా జరగలేదని మనల్ని మనమే అనుమానించుకునేలా చేస్తారు. అలాగే గిల్ట్ ట్రిప్పింగ్’ (Guilt Tripping) ద్వారా కూడా మనలోనే ఏదో తప్పు చేశామనే ఫీలింగ్ కల్పించి, వారి మాటనే మళ్లీ వినేలా చేసుకుంటారు. వీరి ప్రవర్తన ఎప్పుడూ ఒక ముసుగులో ఉంటుంది, కానీ బయటకు చాలా ప్రేమగా నటిస్తారు.

Manipulative
Manipulative

వీరికి చెక్ పెట్టడం ఎలా అంటే ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఇంకొకరి గురించి ఇలా అని చెబితే, వెంటనే ఆ మూడో వ్యక్తిని పిలిచి ఇది నిజమా? అని ఫేస్ టూ ఫేస్ అడగాలి. మ్యానిపులేటర్లు ఎప్పుడూ ఫేస్ టూ ఫేస్ చర్చలకు భయపడతారు.

మీ వ్యక్తిగత విషయాలను అందరితోనూ పంచుకోకండి. ముఖ్యంగా ఇలాంటి వ్యక్తులకు మీ రహస్యాలు తెలిస్తే, వాటినే రేపు మీ మీద ఆయుధాలుగా వాడతారు.వాటితోనే మిమ్మల్ని కంట్రోల్‌లో పెట్టుకోవడానికి చూస్తారు

వారు మిమ్మల్ని రెచ్చగొట్టి ఆ గొడవలో నుంచి ఆనందం పొందడానికి చూస్తారు. మీరు ప్రశాంతంగా ఉంటే వారి ప్లాన్ ఫెయిల్ అవుతుంది.
అయితే ఎప్పుడైనా వారు చెప్పింది అబద్ధం అని తెలిసినప్పుడు మౌనం వద్దు. వారు రచ్చ చేస్తారని భయపడితే, మీరు వారి బానిసలుగా మిగిలిపోతారు. తప్పును తప్పని నిర్మొహమాటంగా చెప్పడం నేర్చుకోవాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button