Elimination: బిగ్ బాస్ 9 డబుల్ ఎలిమినేషన్ షాక్..ఓటింగ్ కంటే బలమైన కంటెస్టెంట్సే అవుట్..
Elimination : ప్రస్తుతం హౌస్ లోపల సుమన్ శెట్టి, భరణి, సంజన, తనూజ, కళ్యాణ్ పడాల, డీమాన్ పవన్, ఇమ్మాన్యూయేల్ ఉన్నారు.
Elimination
బిగ్ బాస్ సీజన్ 9 షో ఇప్పుడు చివరి దశకు (Final Stage) చేరుకుంది. మరో కొన్ని రోజుల్లో విజేత (Winner) ఎవరనేది తెలియనుంది. వచ్చే ఆదివారం ఈ సీజన్‌కు ఎండ్ కార్డ్ (End Card) పడనుంది. ప్రస్తుతం హౌస్ లోపల సుమన్ శెట్టి, భరణి, సంజన, తనూజ, కళ్యాణ్ పడాల, డీమాన్ పవన్, ఇమ్మాన్యూయేల్ ఉన్నారు. ఇప్పుడు హౌస్ లో సెకండ్ ఫైనలిస్ట్ కోసం టాస్కులు జరుగుతున్నాయి.
మొన్నటివరకు టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఉండేది. టైటిల్ రేసులో కళ్యాణ్, తనూజ పోటాపోటీగా ఉన్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఈవారం ఆట తీరుతో ఇమ్మాన్యుయేల్ సైతం టైటిల్ రేసులోకి దూసుకొచ్చాడు. ముఖ్యంగా సంజనతో ఇమ్మూ బాండింగ్ (Bonding) మధ్య కాస్త దూరం రావడం కూడా ఇమ్మాన్యుయేల్‌కి ఓటింగ్ పెరగడానికి ఒక కారణంగా చెప్పొచ్చు.
ప్రస్తుతం నామినేషన్లలో ఆరుగురు కంటెస్టెంట్స్ ఉండగా, ఈసారి కళ్యాణ్ నామినేషన్లలో లేకపోవడంతో తనూజ అత్యధిక ఓటింగ్‌తో టాప్ 1 స్థానంలో ఉంది. సోషల్ మీడియా లెక్కల ప్రకారం తనూజకు 26 శాతం వరకు ఓటింగ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఆమె తర్వాతి స్థానంలో ఇమ్మాన్యుయేల్ ఉన్నాడు. ఆ తర్వాత డీమాన్ పవన్, భరణి, సంజన, సుమన్ శెట్టి తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

ఈ వారం డబుల్ ఎలిమినేషన్ (Double Elimination) ఉండనుంది. టాప్ 5లో కేవలం ఐదుగురు మాత్రమే ఉండాలి కాబట్టి, సుమన్ శెట్టి మరియు సంజన డేంజర్ జోన్‌లో (Danger Zone) ఉన్నట్లు ముందు నుంచి ప్రచారం జరిగింది. వారికి అతి తక్కువ ఓటింగ్ రావడంతో వారు ఎలిమినేట్ అవుతారని అంతా ఊహించారు.
కానీ ఇప్పుడు ఊహించని ఎలిమినేషన్ జరిగినట్లుగా సమాచారం నెట్టింట చక్కర్లు కొడుతోంది. గత వారం కూడా ఓటింగ్ శాతంతో సంబంధం లేకుండా రీతూను బయటకు పంపించారు. ఇప్పుడు కూడా అదే జరిగినట్లు టాక్ వినిపిస్తోంది. తాజా వార్తల ప్రకారం ఈ వారం సుమన్ శెట్టితోపాటు భరణి సైతం ఎలిమినేట్ అయ్యారని తెలుస్తోంది.
నిజానికి భరణికి సంజన కంటే ఎక్కువ ఓటింగ్ ఉంది. అయినా కూడా ఊహించని విధంగా భరణి బయటకు వచ్చినట్లు(Elimination) సమాచారం. సుమన్ శెట్టి ఎలిమినేషన్(Elimination) ఓకే అయినా, భరణి ఎలిమినేషన్ మాత్రం అందరికీ షాక్ ఇచ్చింది. ఇది ఎంతవరకు నిజమనేది, మరియు ఎక్కువ ఓటింగ్ ఉన్న భరణిని ఎందుకు ఎలిమినేట్ చేశారనేది తెలియాలంటే, త్వరలో రానున్న ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.



