Just SpiritualJust LifestyleLatest News

Rock salt:శుక్రవారం రోజు ఉప్పుతో చిన్న పరిహారం .. ఇంట్లో ధన వర్షం కురవాల్సిందేనట

Rock salt: ఇంట్లో దంపతుల మధ్య గొడవలు జరుగుతుంటే పడకగదిలో ఒక చిన్న పాత్రలో సముద్రపు ఉప్పు ఉంచడం వల్ల విభేదాలు తొలగిపోతాయట.

Rock salt

శుక్రవారం శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన రోజు అని మనందరికీ తెలిసిందే. ఈ రోజు చేసే చిన్న చిన్న పూజలు , పరిహారాలు అమ్మవారి అనుగ్రహాన్ని త్వరగా పొందేలా చేస్తాయని నమ్మకం. అయితే శాస్త్రం ప్రకారం ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తుంటారు.

సముద్రం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తే, అదే సముద్రం నుంచి ఉప్పు కూడా లభిస్తుంది కాబట్టే.. ఉప్పును ఉపయోగించి చేసే పరిహారాలకు ఎంతో శక్తి ఉంటుందని పండితులు చెబుతారు.

శుక్రవారం ఉదయాన్నే ఒక గాజు గిన్నెలో సముద్రపు ఉప్పు (Rock salt) నింపి, అందులో నాలుగు లవంగాలు ఉంచి ఇంటి ఈశాన్య మూలలో కానీ అక్కడ వీలు కాకపోతే ఏదొక మూలన పెట్టడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తి అంతా తొలగిపోతుందట. ఇది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడమే కాకుండా, వ్యాపారంలో నష్టాలను కూడా తగ్గిస్తుంది.

Rock salt
Rock salt

మరో ముఖ్యమైన పరిహారం ఏంటంటే, శుక్రవారం రోజు ఇల్లు తుడిచే నీటిలో కొద్దిగా కల్లు ఉప్పు(Rock salt) లేదా సముద్రపు ఉప్పు వేసి తుడవడం వల్ల ఇంట్లో ఉన్న దారిద్ర్యం, నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి, ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. ఎవరికైనా దృష్టి తగిలినప్పుడు కూడా ఉప్పుతో దిష్టి తీయడం మనం చూస్తుంటాం. ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదని, ఉప్పునకు నెగటివ్ ఎనర్జీని పీల్చుకునే గుణం ఉంటుందని పెద్దలు చెబుతారు.

అందుకే ఇంట్లో దంపతుల మధ్య గొడవలు జరుగుతుంటే పడకగదిలో ఒక చిన్న పాత్రలో సముద్రపు ఉప్పు ఉంచడం వల్ల విభేదాలు తొలగిపోతాయట. అలాగే శుక్రవారం రోజు ఉప్పును ఎవరికీ అప్పుగా ఇవ్వకూడదట. అంతేకాదు సాయంత్రం వేళల్లో ఉప్పును కొనకూడదని అలా కొనడం అశుభమని చెబుతారు. ఉప్పుతో ఇలాంటి చిన్న చిన్న చిట్కాలను భక్తితో పాటిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుందని పెద్దలు అంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Related Articles

Back to top button