Just LifestyleHealthLatest News

Omnivort:మీరు ఇంట్రావర్టా? ఎక్స్‌ట్రావర్టా? లేక ఈ మూడో రకమైన ఓమ్నివర్టా ?

Omnivort: పరిస్థితులు , ఎదురుగా ఉన్న మనుషులను బట్టి వీరి వ్యక్తిత్వం ఊహించని విధంగా మారిపోతూ ఉంటుంది.

Omnivort

మనిషి స్వభావాన్ని అంచనా వేస్తున్నప్పుడు సాధారణంగా మనం ఇంట్రావర్ట్ (introvert)లేదా ఎక్స్‌ట్రావర్ట్(extrovert) అనే పదాలను ఎక్కువగా వాడుతూ ఉంటాం. కానీ సైకాలజీ ప్రకారం ఈ రెండింటికీ కూడా డిఫరెంటుగా ఉండే ఓమ్నివర్ట్( Omnivort) అనే సరికొత్త వ్యక్తిత్వం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఒకే సమయంలో ఓమ్నివర్ట్ ( Omnivort) అనే వ్యక్తిని ఇద్దరు వేర్వేరు వ్యక్తులుగా చూడొచ్చు. వీరిలో బ్యాలెన్స్ అనేది ఉండదు. అయితే పూర్తి సైలెంట్‌గా ఉంటారు, లేదా ఎవరూ ఊహించలేనంత ఉత్సాహంగా కనిపిస్తారు. ఉదాహరణకు, ఒక పార్టీకి వెళ్లినప్పుడు అందరినీ నవ్విస్తూ, సందడి చేస్తూ స్టార్ ఆఫ్ ది పార్టీలా కనిపిస్తారు.

కానీ ఒక్కసారి ఇంటికి రాగానే కనీసం ఫోన్ కాల్స్ కూడా ఎత్తకుండా.. తన గదిలో ఒంటరిగా గడపడానికి ఓటేస్తారు. వీరిలో ఉండే ఈ రెండు కోణాలు కూడా చాలా విపరీతంగా (Extreme) ఉంటాయి. ఇంకా చెప్పాలంటే పరిస్థితులు , ఎదురుగా ఉన్న మనుషులను బట్టి వీరి వ్యక్తిత్వం ఊహించని విధంగా మారిపోతూ ఉంటుంది.

చాలా మంది ఓమ్నివర్ట్స్‌ను.. యాంబీవర్ట్స్‌తో పోల్చుతూ పొరపాటు పడుతుంటారు. కానీ వీరిద్దరి మధ్య చాలా స్పష్టమైన తేడా ఉంది. యాంబీవర్ట్స్ అనే వారు ఏ పరిస్థితిలోనైనా స్టడీ అండ్ మోడరేట్‌గా ఉంటారు. కానీ ఓమ్నివర్ట్స్ ప్రవర్తన గురించి చెప్పాలంటే.. లోలకం (Pendulum)ను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అంటే లోలకంలాగా ఒక చివర నుంచి మరో చివరకు ఊగుతూ ఉన్నట్లు వీరి ప్రవర్తన ఉంటుంది.

ఇంకా వివరంగా చెప్పాలంటే వారికి నచ్చిన సన్నిహితుల దగ్గర ఎంతో వాగుడుకాయలా, జోకులు వేస్తూ కనిపిస్తారు.. అదే కొత్త వ్యక్తుల మధ్యకు వెళ్లినపుడు మాత్రం అస్సలు నోరు విప్పకుండా ఒక ఇంట్రావర్ట్‌లా మారిపోతారు. అంటే వీళ్లు తమ ఎనర్జీని మనుషుల నుంచి పొందుతారు.

అలాగే అదే సమయంలో ఆ మనుషుల వల్లే అలసిపోయి రీఛార్జ్ అవ్వడానికి మళ్లీ ఒంటరితనాన్ని వెతుక్కుంటారు. ఈ ప్రవర్తన వల్ల వీళ్లు చూసే వాళ్లకు ఒక్కోసారి గందరగోళంగా అనిపించినా, నిజానికి వీరికి మనుషులతో ఎలా ఉండాలో, తనకంటూ సమయం ఎలా కేటాయించుకోవాలో బాగా తెలుసు.

AI Generated Image
AI Generated Image

ఓమ్నివర్ట్(Omnivort) వ్యక్తిత్వం ఉన్న వారిలో కొన్ని స్పెషల్ లక్షణాలు కనిపిస్తాయి. వీరు కొన్ని రోజులు విపరీతమైన ఓవర్ కాన్ఫిడెంట్‌తో ఏదైనా సాధించగలమనే ధీమాతో ఉంటారు. కానీ మరికొన్ని రోజులు చిన్న చిన్న విషయాలకి కూడా లోలోపల మదనపడుతూ ఉంటారు.

వీరి మూడ్ స్వింగ్స్ అనేవి కేవలం ఎమోషన్స్‌కు సంబంధించినవి మాత్రమే కావు, అది వారి పర్సనాలిటిలోనే ఒక భాగం. అంటే వారు కావాలని అలా మారిపోరు..వారిలోని అంతర్గత శక్తులు వారిని అలా నడిపిస్తాయన్న మాట.
ఇప్పుడు చాలా మంది యూత్ ఈ ఓమ్నివర్ట్ లక్షణాలను కలిగి ఉంటున్నారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ, బయట ప్రపంచంలోకి వచ్చేసరికి మాత్రం సైలెంట్‌గా ఉండిపోతున్నారు. అయితే ఈ రకమైన స్వభావం ఉండటం వల్ల సొసైటీలో అన్ని రకాల మనుషులతో ఈజీగా సర్దుకుపోతారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button